https://oktelugu.com/

రూట్ మార్చిన ఓటీటీ.. పే ఫర్ వ్యూ లెక్కన ప్రదర్శన?

  కరోనా ఎఫెక్ట్ తో సినిమా థియేటర్లు మూతపడ్డాయి. గత ఆరునెలలుగా థియేటర్లు మూతపడటడంతో ఓటీటీలకు ఫుల్ డిమాండ్ వచ్చిపడింది. కొత్త సినిమాలన్నీ ఓటీటీల్లోనే వస్తుండటంతో థియేటర్లలో సినిమాలు చుసే ప్రేక్షకులంతా ఓటీటీలకు అలవాటు పడిపోతున్నారు. దీంతో ఓటీటీ బిజినెస్ మూడుపువ్వులు.. ఆరుకాయలు అన్నచందంగా మారింది. Also Read: మిల్క్ బ్యూటీ తమన్నాకి కరోనా పాజిటివ్ ? ఇదిలా ఉంటే తాజాగా ఓటీటీలో రిలీజవుతున్న పెద్ద సినిమాలన్నీ కూడా ప్లాప్ టాక్ తెచ్చుకుంటున్నాయి. దీంతో ఇప్పటివరకు లాభాల్లో […]

Written By:
  • NARESH
  • , Updated On : October 4, 2020 / 01:48 PM IST
    Follow us on

     

    కరోనా ఎఫెక్ట్ తో సినిమా థియేటర్లు మూతపడ్డాయి. గత ఆరునెలలుగా థియేటర్లు మూతపడటడంతో ఓటీటీలకు ఫుల్ డిమాండ్ వచ్చిపడింది. కొత్త సినిమాలన్నీ ఓటీటీల్లోనే వస్తుండటంతో థియేటర్లలో సినిమాలు చుసే ప్రేక్షకులంతా ఓటీటీలకు అలవాటు పడిపోతున్నారు. దీంతో ఓటీటీ బిజినెస్ మూడుపువ్వులు.. ఆరుకాయలు అన్నచందంగా మారింది.

    Also Read: మిల్క్ బ్యూటీ తమన్నాకి కరోనా పాజిటివ్ ?

    ఇదిలా ఉంటే తాజాగా ఓటీటీలో రిలీజవుతున్న పెద్ద సినిమాలన్నీ కూడా ప్లాప్ టాక్ తెచ్చుకుంటున్నాయి. దీంతో ఇప్పటివరకు లాభాల్లో కొనసాగుతున్న ఓటీటీలు పెద్ద సినిమాల కారణంగా నష్టాలు చవిచూడాల్సి వస్తుందనే టాక్ విన్పిస్తోంది. ఇటీవల దిల్ రాజు నిర్మించిన ‘వి’ చిత్రం కోన వెంకట్ నిర్మించిన ‘నిశబ్దం’.. కీర్తి సురేష్ నటించిన ‘పెంగ్విన్’ చిత్రాలు ఓటీటీలో రిలీజై మిక్స్ డ్ టాక్ తెచ్చుకున్నాయి.

    ఈ సినిమాలకు ఓటీటీ సంస్థలు పెద్దమొత్తంలో డబ్బులు చెల్లించి స్ట్రీమింగ్ రైట్స్ కొనుగోలు చేశాయి. అయితే ఈ చిత్రాలు ఓటీటీలు రిలీజయ్యాక మాత్రం ప్లాప్ టాక్ తెచ్చుకొని ఓటీటీలకు నష్టాలను తెచ్చిపెట్టాయి. దీంతో ఓటీటీ సంస్థలు రూట్ మార్చే పనిలో పడ్డాయి. ఇకపై ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాలను పే ఫర్ వ్యూ పేరిట ప్రదర్శించాలని భావిస్తున్నాయి. ఈమేరకు నిర్మాతలతో మంతనాలను ఓటీటీలు మంతనాలు జరుపుతున్నాయి.

    Also Read: కరాటేకు పూర్వ వైభవం రావాలి: హీరో విశ్వక్ సేన్

    సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన ‘సోలో బ్రతుకే సో బెటర్’ మూవీ త్వరలో ఓటీటీలోనే రిలీజ్ కానుందట. ఈమేరకు చిత్ర నిర్మాతలు ప్రముఖ స్ట్రీమింగ్ ఛానల్ జీ ప్లెక్స్ తో చర్చలు జరుపుతున్నారు. వీరిద్దరి మధ్య డీల్ కుదిరే అవకాశం ఉన్నట్లు గుసగుసలు విన్పిస్తున్నాయి. ఈ మూవీని పే పర్ వ్యూ ప్రాతిపదికన ప్రదర్శించేందుకు మంతనాలు సాగుతున్నాయనే టాక్ విన్పిస్తోంది.

     ఈ చిత్రం సంబంధించిన కొన్ని సన్నివేశాలు ఇంకా మిగిలి ఉన్నట్లు తెలుస్తోంది. వాటిని పూర్తి చేసి సినిమాను రిలీజ్ చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. ఈ మూవీలో తేజుకు జోడిగా నభానటేష్ నటిస్తోంది. పే ఫర్ వ్యూ లెక్కన ప్రదర్శిస్తే ఓటీటీలకు లాభామోగానీ.. నిర్మాతలకు ఏమేరకు గిట్టుబాటు అవుతుందో లేదోననే సందేహాలు కలుగుతున్నాయి. దీంతో పెద్ద సినిమా నిర్మాతలకు ఓటీటీలోనూ కష్టాలు మొదలైనట్టే అనే ప్రచారం జరుగుతోంది.