This Week OTT Releases
This Week OTT Releases: సినీ ప్రేమికులకు ప్రతి శుక్రవారం ఒక కొత్త సినిమా అనేది కచ్చితంగా ఉండాలి. ఇప్పుడు అదే కోవలో ప్రతి వారం వారం OTT ప్లాట్ ఫామ్స్ ప్రేక్షకులకు కూడా కొత్త కొత్త సినిమాలు వెబ్ సిరీస్ లు అందించే ప్రయత్నం చేస్తున్నాయి. ఇక ఈ వారం రెండు భారీ సినిమాలు విడుదల కాబోతున్నాయి. ఒకటి మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ కాగా, మరొకటి సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్ మూవీ. ఒక రోజు వ్యవధిలో ఈ రెండు సినిమాలు విడుదల కాబోతున్నాయి.
ఈ రెండు సినిమాల విషయం పక్కన పెడితే ఇక OTT ప్రేక్షకుల కోసం ఈ వారం భారీ స్థాయిలో సినిమాలు, వెబ్ సిరీస్ లు రాబోతున్నాయి. ఒకటి రెండు కాదు ఏకంగా 23 చిత్రాలు రిలీజ్ కాబోతున్నాయి. దాదాపు అరడజను పైగా OTT ప్లాట్ ఫామ్స్ ఉండటంతో ఇవన్నీ కూడా కొత్త కంటెంట్ ఇచ్చే క్రమంలో వారం వారం భారీ స్థాయిలో చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి. ఈ వారం రిలీజ్ కాబోతున్న 23 మూవీస్ – వెబ్ సిరీస్ లో కొన్ని చిత్రాలు ఎంతో ఆసక్తి ని కలిగిస్తున్నాయి.
తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన ‘పోర్ తోడిల్’ సోని లివ్ లో రిలీజ్ కాబోతుంది. ఒకే ఒక్క పాటతో వైరల్ అయిన హిందీ సినిమా ‘జరా హాట్కే జరా బచ్కే’ కూడా ఈ వారమే రానుంది. ఇక హిదంబి మూవీ, మేడ్ ఇన్ హెవెన్ వెబ్ సిరీస్ , ది కాశ్మీర్ ఫైల్స్ ఆన్ రిపోర్టడ్ , నేయమర్ కూడా ఈ వారమే OTT వేదికగా విడుదల కానున్నాయి.
ఈ వారం ఓటీటీ లో విడుదల అయ్యే చిత్రాలు
నెట్ ఫ్లిక్స్
* లేడీస్ ఫస్ట్ : ఏ స్టోరీ అఫ్ ఉమెన్ ఇన్ హిప్ హప్ (ఇంగ్లీష్ సిరీస్ ) – ఆగస్టు 08
* ఆన్ టోల్డ్ : జానీ ఫుట్ బాల్ (ఇంగ్లీష్ సినిమా )- ఆగస్టు 08
* జాంబీవర్స్ (కొరియన్ సిరీస్ ) – ఆగస్టు 08
* మెక్ క్యాడెడ్స్ (ఇంగ్లీష్ సిరీస్) – ఆగస్టు 10
* పెయిన్ కిల్లర్ (ఇంగ్లీష్ సిరీస్) – ఆగస్టు 10
* హార్డ్ అఫ్ స్టోన్ (ఇంగ్లీష్ మూవీ ) – ఆగస్టు 11
* పద్మిని (మలయాళం చిత్రం) – ఆగస్టు 11
* బిహేండ్ యువర్ టచ్ (కొరియన్ సిరీస్) – ఆగస్టు 12
అమెజాన్ ప్రైమ్
* మేడ్ ఇన్ హెవెన్ సీజన్ 2 (తెలుగు డబ్బింగ్ సిరీస్) – ఆగస్టు 10
* రెడ్, వైట్ & రాయల్ బ్లూ (ఇంగ్లీష్ చిత్రం ) – ఆగస్టు 11
హాట్ స్టార్
* నెయ్ మార్ (తెలుగు డబ్బింగ్ మూవీ) – ఆగస్టు 08
* ఓన్లీ మర్డర్స్ ఇన్ ది బిల్డింగ్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) – ఆగస్టు 08
* కమెండో (హిందీ సిరీస్) – ఆగస్టు 11
జియో సినిమా
* జరా హాట్కే జరా బచ్కే (హిందీ సినిమా ) – ఆగస్టు 11
ఆహా
* హిదంబి (తెలుగు సినిమా) – ఆగస్టు 10
* వేరే మారి ఆఫీస్ (తమిళ్ సిరీస్) – ఆగస్టు 10
* వాన్ ముండ్రు (తమిళ్ మూవీ) – ఆగస్టు 11
జీ 5
* అభర్ ప్రళయ్ (బెంగాలీ సిరీస్) – ఆగస్టు 11
* ది కాశ్మీర్ ఫైల్స్ ఆన్ రిపోర్టడ్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) – ఆగస్టు 11
సోనీ లివ్
* ది జంగబూర్ కర్స్ (హిందీ సిరీస్) – ఆగస్టు 09
* పోర్ తొడిల్ (తెలుగు డబ్బింగ్ మూవీ ) – ఆగస్టు 11
ఆపిల్ ప్లస్ టీవీ
* స్ట్రేంజ్ ప్లానెట్ (ఇంగ్లీష్ సిరీస్) – ఆగస్టు 09
లయన్స్ గేట్ ప్లే
* హై హిట్ (ఇంగ్లీష్ సినిమా ) – ఆగస్టు 11