Site icon OkTelugu

Nag Ashwin: అమితాబ్ కమలహాసన్ ప్రభాస్ వీళ్ల స్టార్ డమ్ ను దృష్టిలో పెట్టుకొనే ఈ సినిమాను తీశా: నాగ్ అశ్విన్

Made this film which focuses on the stardom of Amitabh Bachchan, Kamal Haasan, and Prabhas

Made this film which focuses on the stardom of Amitabh Bachchan, Kamal Haasan, and Prabhas

Nag Ashwin: ఇక ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో కల్కి సినిమా హవా నడుస్తుందనే చెప్పాలి. ఇక ఈ సినిమా నుంచి మూడు రోజులకు ఒక అప్డేట్ రిలీజ్ చేస్తూ ప్రేక్షకుల్లో ఈ సినిమా పట్ల అంచనాలను తారాస్థాయిలో పెంచేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా దర్శకుడు అయిన నాగ్ అశ్విన్ రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కల్కి సినిమాలో అమితాబచ్చన్, కమలహాసన్ లాంటి దిగ్గజ నటులు ఉన్నారు. ఇక వాళ్ళ స్టార్ డమ్ ని దృష్టిలో పెట్టుకొని సీన్లని చిత్రీకరించాం.

అలాగే వాళ్ళని ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా షూటింగ్ సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ మరి ఈ సినిమాని తెరకెక్కించాను అంటూ నాగ్ అశ్విన్ చెప్పాడు. ఇక అలాగే మొదట అమితాబచ్చన్ గారి మీదనే ఈ సినిమాను చిత్రీకరించాడట. అయితే ఇందులో అమితాబచ్చన్ కి ఎక్కువ యాక్షన్ సీక్వెన్స్ ఉండడంతో ఈ సినిమా చాలా రోజుల పాటు ప్రేక్షకులకు గుర్తుండిపోతుందని చెప్పాడు.

Also Read: Son of Satyamurthy child artist: సన్ ఆఫ్ సత్యమూర్తి చిత్రంలోని పాప ఇంత పెద్దది అయ్యిందా… ఆమె లేటెస్ట్ లుక్ చూస్తే షాక్ అవుతారు!

ఇక ఈ సినిమాని 10 సంవత్సర వయసు ఉన్న పిల్లల దగ్గర నుంచి 80 సంవత్సరాల వయసున్న ముసలి వాళ్ళ దాకా ఎవరు చూసినా కూడా ఈజీగా అర్థమయ్యే రీతిలోనే సినిమాని తెరకెక్కించాను. ఇక అలాగే ట్రైలర్ లో చూపించినట్టుగా మొహానికి మాస్కులు వేసుకోవడం, ఆక్సిజన్ సిలిండర్లను వాడడం లాంటివి కూడా బయట జీవితంలో కొంత మంది దగ్గర చూశానని నాగ్ అశ్విన్ చెప్పాడు. ఇక అందుకే వాటిని సినిమాలో ఇంప్లిమెంట్ చేసినట్టుగా తను చెబుతున్నాడు.

Also Read: Actress Hema: జైలు నుంచి విడుదలైన నటి హేమ… ఇప్పుడు ఏం చేస్తుంది? ఆమె భవిష్యత్తు ఏమిటీ?

ఇక దీపికా పదుకొనే ప్రభాస్ స్టార్ డమ్ లకు ఏమాత్రం తగ్గకుండా వాళ్ళ ఫ్యాన్స్ వాళ్ళని ఎలాగైతే చూడాలనుకుంటున్నారో అంతకు ఏ మాత్రం తగ్గకుండా స్క్రీన్ మీద వాళ్ళను చూపించే ప్రయత్నం అయితే చేశాను అంటూ నాగ్ అశ్విన్ మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఇక మొత్తానికైతే జూన్ 27వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడమే కాకుండా ప్రభాస్ కి ఒక భారీ సక్సెస్ ని కూడా అందిస్తుందని అతని అభిమానుల్లో భారీ అంచనాలైతే ఉన్నాయి…

Exit mobile version