Homeఎంటర్టైన్మెంట్New OTT releases this week: సినిమా ప్రియులకు పండగే పండగ... ఓటీటీలో ఒక్కరోజే ఎన్ని...

New OTT releases this week: సినిమా ప్రియులకు పండగే పండగ… ఓటీటీలో ఒక్కరోజే ఎన్ని సినిమాలో!

New OTT releases this week: ఈ వారం సినిమా ప్రియులకు ప్రత్యేకం. స్టార్ హీరోల చిత్రాలతో పాటు కొన్ని క్రేజీ మూవీస్ ఓటీటీలో ప్రత్యక్షం అయ్యాయి. వాటిలో సంక్రాంతి కూడా చిత్రాలు ఉన్నాయి. ఫిబ్రవరి 8 అర్థరాత్రి నుండి ఓటీటీలో స్ట్రీమ్ అవుతున్న చిత్రాలు ఏమిటో చూద్దాం… సంక్రాంతి కానుకగా మహేష్ బాబు నటించిన గుంటూరు కారం విడుదలైంది. మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న గుంటూరు కారం నెల రోజుల్లోపే డిజిటల్ స్ట్రీమింగ్ కి సిద్ధమైంది. నెట్ఫ్లిక్స్ లో గుంటూరు కారం మూవీ చూడవచ్చు. గుంటూరు కారం చిత్రానికి త్రివిక్రమ్ దర్శకుడు. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటించారు.

మరో సంక్రాంతి మూవీ కెప్టెన్ మిల్లర్. ధనుష్ హీరోగా అరుణ్ మాతేశ్వరన్ తెరకెక్కించాడు. శివరాజ్ కుమార్, సందీప్ కిషన్ వంటి స్టార్ క్యాస్ట్ కీలక రోల్స్ చేసిన కెప్టెన్ మిల్లర్ తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. స్టార్ యాంకర్ సుమ కనకాల కుమారుడు రోషన్ హీరోగా పరిచయం అవుతూ తెరకెక్కించిన చిత్రం బబుల్ గమ్. న్యూ ఏజ్ లవ్ డ్రామాగా రూపొందించారు. రవికాంత్ పేరెపు దర్శకత్వం వహించారు.

బబుల్ గమ్ చిత్రం తెలుగు ఎంటర్టైన్మెంట్ యాప్ ఆహా లో స్ట్రీమ్ అవుతుంది. క్రైమ్ కామెడీ ఎంటర్టైనర్ రెబల్స్ ఆఫ్ తుపాకులగూడెం విన్ లో అందుబాటులోకి వచ్చింది. మార్వెల్ హీరోస్ యూనివర్స్ నుండి వచ్చిన కొత్త చిత్రం ది మార్వెల్స్. హాట్ స్టార్ లో ఈ హాలీవుడ్ మూవీ స్ట్రీమ్ అవుతుంది. తెలుగుతో పాటు పలు భాషల్లోకి అందుబాటులోకి వచ్చింది. మరో హాలీవుడ్ మూవీ ది నన్ 2 ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది.

కోలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్ లేటెస్ట్ మూవీ అయలాన్. ఈ చిత్రానికి ఆర్ రవికుమార్ దర్శకుడు. రకుల్ ప్రీత్ హీరోయిన్ గా నటించింది. అయలాన్ సైన్స్ ఫిక్షన్ మూవీ కాగా సంక్రాంతి కానుకగా విడుదలైంది. అయలాన్ సన్ నెక్స్ట్ లో స్ట్రీమ్ అవుతుంది. అలాగే హాలీవుడ్ చిత్రం ది ఎగ్జార్సిస్ట్ బిలీవర్ జియో సినిమాలో స్ట్రీమ్ అవుతుంది.

Most Popular

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...

Lenin Movie : 11వ రోజు ఊహించని రికార్డు నెలకొల్పిన ‘లెనిన్’.. ఇప్పట్లో ఈ సునామీ ఆగేలా లేదు..

Lenin Movie : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన 'లెనిన్' చిత్రం వసూళ్లు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకున్న...

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...
Oktelugu Epaper
Exit mobile version