https://oktelugu.com/

Katrina Kaif Marriage: కత్రినా కైఫ్ – విక్కీ కౌశల్ ల పెళ్ళికి 100 కోట్ల ఆఫర్… ఎందుకంటే

Katrina Kaif Marriage: బాలీవుడ్ లో పెళ్లిళ్ల వాతావరణం జోరందుకుంది. ఇన్నాళ్ళు ప్రేమికులుగా ఉన్న బాలీవుడ్ నటీనటులు ఇటీవల ఒక్కొక్కరిగా పెళ్లి పీటలెక్కుతున్నారు. తాజాగా బాలీవుడ్ లో లవ్ బర్డ్స్ విక్కీ కౌశల్ – కత్రీనా కైఫ్ ల పెళ్లి గురించి గత కొన్ని రోజులుగా అనేక వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్ లో ఇప్పుడంతా వీళ్ళ పెళ్లి గురించే చర్చ నడుస్తుంది. కానీ విక్కీ కౌశల్, కత్రీనా కైఫ్ లు మాత్రం దీనిపై స్పందించట్లేదు. కాగా డిసెంబరు […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 7, 2021 / 01:41 PM IST
    Follow us on

    Katrina Kaif Marriage: బాలీవుడ్ లో పెళ్లిళ్ల వాతావరణం జోరందుకుంది. ఇన్నాళ్ళు ప్రేమికులుగా ఉన్న బాలీవుడ్ నటీనటులు ఇటీవల ఒక్కొక్కరిగా పెళ్లి పీటలెక్కుతున్నారు. తాజాగా బాలీవుడ్ లో లవ్ బర్డ్స్ విక్కీ కౌశల్ – కత్రీనా కైఫ్ ల పెళ్లి గురించి గత కొన్ని రోజులుగా అనేక వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్ లో ఇప్పుడంతా వీళ్ళ పెళ్లి గురించే చర్చ నడుస్తుంది. కానీ విక్కీ కౌశల్, కత్రీనా కైఫ్ లు మాత్రం దీనిపై స్పందించట్లేదు. కాగా డిసెంబరు 9న వీరిద్దరు రాజస్థాన్​లో ఓ రాజభవనంలో పెళ్లి పీటలెక్కనున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు వీళ్ళ పెళ్లి పనులకు సంబంధించిన ఫోటోలు కాని వీడియోలు కానీ ఒక్కటి కూడా బయటకి రాలేదు.

    బాలీవుడ్ లో కత్రీనాకు మంచి డిమాండ్ ఉంది, విక్కీ కూడా ఇప్పుడిప్పుడే స్టార్ హీరోగా ఎదుగుతున్నాడు. దీంతో వీళ్ళ పెళ్లిని బిజినెస్ చేసుకోవాలనే ప్లాన్ లో కొంతమంది ఉన్నారు. అందుకోసమే వీళ్ళ పెళ్లిని ఓటిటిలో లైవ్ స్ట్రీమ్ చేయాలని కొన్ని ఓటిటి సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. ఇందుకోసం ఓ ఓటిటి సంస్థ ఏకంగా 100 కోట్ల డీల్ ని విక్కీ కత్రీనాలకు ఆఫర్ చేసినట్టు సమాచారం. దీంతో ఈ పెళ్లికి హాజ‌ర‌య్యేవారు సెల్ఫీలు తీయ‌డం, సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌డం నిషిద్ధ‌మ‌ని.. ముందే చెప్పేశారట. ఈ పెళ్లికి సంబంధించిన ఒక్క ఫొటో, వీడియో బ‌య‌ట‌కు వెళ్ల‌కూడ‌ద‌ని క‌త్రినా – విక్కీలు భావిస్తున్నారు. రాజ‌స్థాన్ లోని సిక్స్‌సెన్సెస్ ఫోర్టులో కత్రినా- విక్కీల పెళ్లి జ‌ర‌గ‌బోతోంది. కేవ‌లం 400మంది అతిథుల‌కు మాత్ర‌మే ఆహ్వానాలు అందాయి అని సమాచారం. గతంలో కూడా చాలా మంది సెలబ్రేటీల వివాహ వేడుకలు ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. కాక‌పోతే ఓటీటీ సంస్థ ఓ పెళ్లికి సంబంధించిన ఫుటేజీని వంద కోట్ల‌కు కొనుగోలు చేయ‌డం అంటే ఆలోచించాల్సిన విషయమే అని చెప్పాలి.