Homeఆంధ్రప్రదేశ్‌CM Jagan: సీఎం జగన్‌ను హెచ్చరిస్తున్న ఉద్యోగ సంఘాల నేతలు.. ప్రభుత్వాన్ని కూల్చేస్తామంటూ..!

CM Jagan: సీఎం జగన్‌ను హెచ్చరిస్తున్న ఉద్యోగ సంఘాల నేతలు.. ప్రభుత్వాన్ని కూల్చేస్తామంటూ..!

CM Jagan: సీఎం జగన్ 2019 ఎన్నికల్లో ఒంటి చేత్తో వైసీపీ పార్టీని అధికారంలోని తీసుకొచ్చారు. ఈ విజయం మామూలుది కాదు. ఎంతో రాజకీయ ఘన చరిత్ర గల తెలుగు దేశం పార్టీని ఏకంగా పాతాళానికి తొక్కాడు జగన్. అందుకు చాలా కారణాలు ఉన్నాయి. చంద్రబాబును నమ్మి 2014లో టీడీపీకి అధికారం కట్టబెడితే ఆయన నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. దీంతో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. అదే చంద్రబాబు పతనానికి జగన్ ముఖ్యమంత్రి అవ్వగానికి బాటలు వేసింది. అయితే, వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రజా సంక్షేమం విషయంలో తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కంటే జగన్ చాలా ముందుండాలని నిర్ణయించకున్నారు. అదే విధంగా పాలనను కొనసాగిస్తున్నారు.

CM Jagan
CM Jagan

నవరత్నాలతో ప్రజల్లోకి..

ముఖ్యమంత్రి జగన్ వైసీపీ ప్రభుత్వం పాలన గురించి ప్రజలు తమంతట తామే చెప్పుకోవాలి అనే విధంగా మేనిఫెస్టోలో ప్రకటించిన నవరత్నాలను పకడ్భందీగా అమలు చేస్తున్నారు. కానీ రాష్ట్రంలో ఆర్థిక లోటు ఉండటం ప్రభుత్వానికి కొత్త చిక్కులు తీసుకొస్తుంది. ఇప్పటికీ ప్రజా సంక్షేమ పథకాలను నమ్ముకున్న జగన్ రాబోయే రోజుల్లో ఆర్థిక కష్టాలు తీరక పోతే నవరత్నాలను ఎలా అందిస్తారనే ప్రశ్న తలెత్తుతుంది. ఒక సంక్షేమ పథకాల అమలులో ఏమైనా అడ్డంకులు ఎదురైతే చంద్రబాబు లాగానే జగన్ కూడా ప్రజాగ్రహానికి గురవ్వక తప్పదు.. ఇప్పటివరకు అయితే టైంకు ఎన్నికష్టాలు ఎదురైనా సంక్షమ పథకాలను అమలు చేస్తున్నారు. దీని వలన రాబోయే ఆరునెలల కాలంలో మూడు లక్షల కోట్ల అప్పులు జగన్ ప్రభుత్వంపై తీరని భారం మోపనున్నాయి.

రాజధాని, పోలవరం తిప్పలు..

ఏపీ ప్రస్తుతం ఆర్థిక ఒడిదుడుకులతో కొట్టుమిట్టాడుతోంది. పన్నుల ద్వారా వచ్చే ఆదాయం ఉద్యోగుల జీతాలకు, కేంద్రం పన్నుల వాటాకే సరిపోతుంది. ఇప్పటివరకు రాజధాని నిర్మాణంపై ఓ కొలిక్కి రాలేదు. గత ప్రభుత్వం సగం నిర్మించి వదిలేసిన భవనాలు మాత్రమే మిగిలాయి. జగన్ అధికారంలోకి వచ్చాక మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల అసెంబ్లీలో ఆ బిల్లును వెనక్కి తీసుకున్నారు. మరోసారి మరిన్ని మార్పులతో మంచి బిల్లును తీసుకొస్తానని చెప్పారు. సీఆర్డీఏ రద్దు గురించి ఇంకా ఏ మాట్లాడటం లేదు.. కేంద్రం నుంచి నిధులు రాక పోలవరం ప్రాజెక్టు నిర్మాణం అక్కడే ఆగిపోయింది. రాష్ట్రం విడిపోయి ఏడేండ్లు పూర్తయిన ఇప్పటి వరకు ఏపీకి రాజధానే లేదు. ఇక పెట్టుబడులు ఎలా వస్తాయి. ఆర్థిక కష్టాలు ఎలా తీరతాయి. అభివృద్ది ఎలా జరుగుతుంది. నిరుద్యోగులు, ప్రజలను తన పాలనతో ఎలా ఒప్పిస్తారు.

Also Read: జర్నలిస్టుల విషయంలో తెలంగాణే నయం..!

ఉద్యోగ సంఘాల నేతల వార్నింగ్..

ప్రస్తుతం ఏపీలో రాజకీయ రగడ మరింత ముదురుతోంది. ఆర్థిక కష్టాలతో సతమతమవుతున్న ప్రభుత్వాన్ని తమ పీఆర్సీ, సమస్యల పరిష్కారం గురించి ప్రశ్నించేందుకు ఉద్యోగ సంఘాల నేతలు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే విధుల బహిష్కరణకు సంబంధించి రెండు సార్లు ప్రభుత్వానికి సమాచారం కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది. తమ కృషి వల్లే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, తాము తలుచుకుంటే ప్రభుత్వాన్ని కూలుస్తామని హెచ్చరికలు కూడా పంపిస్తున్నారట.. ఉద్యోగుల డీఏ పెంపు, పెన్షన్‌కు సంబంధించిన సమస్యల పరిష్కారంపై గత ప్రభుత్వం అధికారులను నియమించి కాలయాపన చేసింది. మంత్రుల వద్దకు వెళ్లినా తమకు ఎలాంటి హామీ రావడం లేదని ఉద్యోగ సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి విషయాలను జగన్ సింగిల్ డీల్ చేస్తారని వారు చెబుతున్నారట.. రాష్ట్రంలో ఆర్థిక లోటు పెరుగుతున్న క్రమంలో జగన్ సత్వరమే నిర్ణయం తీసుకోకపోతే ప్రభుత్వానికి చెడ్డ పేరు రావడంతో పాటు ప్రజాగ్రహానికి గురయ్యే రోజులు కూడా రావొచ్చని పొలిటికల్ నిపుణులు చెబుతున్నారు.

Also Read: ఏపీలో గుట్కా, జర్ధా రాయుళ్లకు షాకిచ్చిన జగన్ సర్కార్

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Exit mobile version