
మనలో చాలామంది ప్రతినెలా డబ్బులు పొందే స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తి చూపిస్తుంటారు. ఇందుకోసం వేర్వేరు ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ప్రతి నెలా సులువుగా అదిరిపోయే రాబడిని పొందే అవకాశం అయితే ఉంటుంది. నెలనెలా డబ్బులు పొందాలని అనుకునే వాళ్లకు పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ బెస్ట్ అని చెప్పవచ్చు.
ప్రస్తుతం ఈ స్కీమ్ లో 6.6 శాతం వడ్డీ లభిస్తుండగా కనీసం 1,000 రూపాయల నుంచి గరిష్టంగా 4.5 లక్షల రూపాయల వరకు ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ మెచ్యూరిటీ కాలం 5 సంవత్సరాలుగా ఉంది. దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్‌బీఐ యాన్యుటీ డిపాజిట్ స్కీమ్ పేరుతో ఒక స్కీమ్ ను అమలు చేస్తోంది. 3, 5, 7, 10 ఏళ్ల కాల పరిమితితో ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేయవచ్చు.
ఎస్‌బీఐ యాన్యుటీ డిపాజిట్ స్కీమ్ లో వడ్డీరేటు 5.4 శాతంగా ఉంది. సిస్టమ్యాటిక్ విత్‌డ్రాయెల్ ప్లాన్ స్కీమ్ ద్వారా ఇన్వెస్ట్ చేసిన వాళ్లు భారీగా ప్రయోజనాలను పొందే అవకాశం అయితే ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్‌లో డబ్బులు ఇన్వెస్ట్ చేసేవాళ్లకు ఇదే బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. ఇందులో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఫండ్స్ నుంచి ఒకేసారి డబ్బులు తీసుకోకుండా నెలనెలా డబ్బులు తీసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.
సిస్టమ్యాటిక్ విత్‌డ్రాయెల్ ప్లాన్ ద్వారా ఈ విధంగా డబ్బులు పొందే అవకాశం అయితే ఉంటుంది. ఎవరైతే మ్యూచువల్ ఫండ్స్ లో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తారో వాళ్లు డివిడెంట్ ఆప్షన్ ను ఎంచుకుంటే మంచిది. ఈ ఆప్షన్ ద్వారా నిర్ణీత కాల పరిమితిలో డబ్బులను పొందే అవకాశం అయితే ఉంటుంది. గ్రోత్ ఆప్షన్ ఎంచుకున్న వారికి మాత్రం డబ్బులు వెనక్కు వచ్చే అవకాశం అయితే ఉండదు.