Oscar Awards 2023: ప్రపంచం లో ఉన్న సినీ అభిమానులు మొత్తం ఎంతగానో ఎదురు చూసిన ఆస్కార్ అవార్డ్స్ వేడుక సంబరం నిన్నటితో ముగిసింది.మన ఇండియన్ సినిమాకి ఎదో ఒక రోజు ఆస్కార్ అవార్డు వస్తుంది అని కలలు దిగ్గజాలకు నిన్న#RRR మూవీ రూపం లో నెరవేరింది.కేవలం #RRR మాత్రమే కాదు తమిళం లో అతి తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ‘ది ఎలిఫెంట్ విష్పర్స్’ అనే డాక్యుమంటారు ఫిలిం కి కూడా ఆస్కార్ అవార్డు దక్కడం అందరినీ షాక్ కి గురి చేసింది.

ఒక్క ఇండియన్ సినిమాకి ఆస్కార్ వస్తే చాలు అనుకున్నాం, కానీ రెండు సినిమాలకు ఆస్కార్స్ వచ్చాయి, ఆ రెండు కూడా సౌత్ ఇండియన్ సినిమాలు అవ్వడం విశేషం.ఇక హాలీవుడ్ చిత్రాలు కూడా వివిధ విభాగాల్లో అత్యధిక ఆస్కార్ అవార్డ్స్ ని గెలుపొంది ప్రతీ ఏడాది లాగానే ఈ ఏడాది కూడా సత్తా చాటాయి.ఇది ఇలా ఉండగా ఆస్కార్ అవార్డ్స్ కి సంబంధించి ఎవరికీ తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు మీ ముందు ఉంచబోతున్నాము.
ఆస్కార్ అవార్డ్స్ ప్రధాన విభాగాలైన ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటి, ఉత్తమ నటుడు, ఉత్తమ సహాయ నటుడు, ఉత్తమ సహాయ నటి, ఉత్తమ దర్శకుడు వంటి క్యాటగిరి లో నామినేషన్స్ సంపాదించుకున్న ప్రతీ ఒక్కరికి ఆస్కార్స్ తరుపున ఒక గిఫ్ట్ బ్యాగ్ వస్తుందట.ఆ గిఫ్ట్ బ్యాగ్ లో 1,26,000 డాలర్లు (1.03 కోట్లు) విలువ చేసే బహుమతులు ఉంటాయట.లాస్ ఏంజిల్స్ కి చెందిన ఒక ప్రముఖ కంపెనీ ఈ గిఫ్ట్ బ్యాగ్స్ ని అందిస్తుందట.
ఇందులో ఆస్ట్రేలియా లో ఒక విలువైన ఫ్లాట్, జపనీస్ మిల్ బ్రెడ్, ఇటలీ దేశం లో ఒక ప్రఖ్యాతి గాంచిన దీవిలో కాస్మొటిక్ ట్రీట్మెంట్ ట్రిప్, అంతేకాకుండా లైట్ హౌస్ లో ఉండేందుకు అయ్యే ఖర్చు లో 9 వేల డాలర్లు విలువ చేసే కూపన్స్ ఇలా మొత్తం మీద 60 వరకు విలువైన బహుమతులు ఉంటాయి.ఈ గిఫ్ట్ బ్యాగ్స్ అవార్డు విన్నర్స్ కి కూడా వస్తుందో లేదో తెలియదు కానీ రన్నర్స్ కి మాత్రం గౌరవిస్తూ ఇచ్చే బహుమతి అని తెలుస్తుంది.