SS Rajamouli: ప్రపంచం లోనే అత్యున్నత అవార్డ్స్ లో ఒకటిగా చెప్పుకునే ఆస్కార్ మన తెలుగు సినిమా #RRR కి దక్కడం కేవలం తెలుగు వాళ్లకి మాత్రమే కాదు, ప్రతీ భారతీయుడికి ఎంతో గర్వకారణం.ఈ అరుదైన గౌరవం దక్కడానికి కారణం ఒకే ఒక్కడి విజన్, అతనే రాజమౌళి.మన తెలుగు సినిమా గర్వపడేందుకు ఆయన చేసిన కృషి ని ఎప్పటికీ మరచిపోలేము.

బాహుబలి సినిమాతో తెలుగు సినిమా ఖాతిని ప్రపంచం నలుమూలల వ్యాప్తి చెందేలా చేసిన రాజమౌళి, ఇప్పుడు #RRR సినిమాతో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ మొత్తం గర్వపడేలా చేసాడు.ప్రతీ ఒక్కరు ఇది మా సినిమా అని అనిపించేలా చేసాడు రాజమౌళి.అయితే ఈ ఆస్కార్ అవార్డ్స్ అంత తేలికగా అయితే రాలేదు.#RRR సినిమాని తియ్యడం కోసం రాజమౌళి ఎంత కష్టపడ్డాడో, ఆస్కార్ అవార్డ్స్ వచ్చేలా చేసేందుకు కూడా ఆయన అంతలాగానే కష్టపడ్డాడు.ఆ కష్టం ఏంటో ప్రతీ ఒక్కరికి ఆ కథనం ద్వారా తెలియాలి.
ఈ సినిమాని విదేశీయులు అంతలా ఎగబడి చూడడానికి కారణం నెట్ ఫ్లిక్స్.ప్రపంచం లో ఉన్న ప్రతీ దేశం లోను ఈ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ లో వినియోగదారులు కలిగి ఉండడం వల్ల అందరూ ఈ చిత్రాన్ని చూసారు.తద్వారా వచ్చిన రీచ్ ని సరైన పద్దతి లో ప్రమోట్ చేసుకోవడం లో డైరెక్టర్ రాజమౌళి సక్సెస్ అయ్యాడు.ఆస్కార్ అవార్డ్స్ నామినేషన్స్ లోకి అడుగుపెట్టిన రోజు నుండి రాజమౌళి తన సినిమాని ప్రమోట్ చేసుకోవడానికి ఉపయోగపడే ప్రతీ మాధ్యమం ని ఉపయోగించుకున్నాడు.ఇక ఆస్కార్ అవార్డ్స్ ప్రదానోత్సవం తేదీ ప్రకటించిన తర్వాత తన సినిమాని ప్రమోట్ చేసుకునేందుకు రాజమౌళి తన హీరోలను అమెరికాలో దింపి ప్రతీ మీడియా ఛానల్ కి ఇంటర్వ్యూస్ వచ్చేలా చేసాడు.వీటి అంతటికి ఖర్చు మొత్తం ఆయనే భరించాడట.
#RRR కోసం తీసుకున్న రెమ్యూనరేషన్ మొత్తాన్ని ఇందుకోసమే ఉపయోగించాడట రాజమౌళి.హీరోలిద్దరూ అమెరికా లో ఉన్నన్ని రోజులు వాళ్లకి అయ్యే ఖర్చులు కూడా రాజమౌళినే భరించాడట.ఇంత కృషి చేస్తేనే ఆస్కార్ అవార్డు దక్కింది, ఇలా మన ఇండియన్స్ మొత్తం గర్వపడేలా చేసేందుకు ఇంత కృషి చేసిన రాజమౌళి ప్రతీ ఒక్కరు సెల్యూట్ చెయ్యాల్సిన సమయం ఇది.