A. R. Rahman- RRR: దర్శకధీరుడు రాజమౌళి తీసిన లెటేస్ట్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’. మల్టీస్టార్ గా వచ్చిన ఈ మూవీ పాన్ ఇండియా లెవల్లో సక్సెస్ అయింది. అటు కమర్షియల్ గా రూ.1200 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాల విశ్లేషణ. ఇప్పడు ఈ సినిమాను జపాన్ లో రిలీజ్ చేసి అక్కడ సక్సెస్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో రాజమౌళికి వరల్డ్ వైడ్ గా క్రేజీ పెరిగిపోతుంది. అయతే ఇప్పటికే ఈ సినిమా ఆస్కార్ బరిలో ఉంటుందని అనుకున్నారు. కానీ కొన్నికారణాల వల్ల మిస్సయింది. ఇప్పుడు జక్కన్నకు వస్తున్న క్రేజ్ చూస్తే వచ్చే సినిమా కచ్చితంగా ఆ చాన్స్ కొట్టే అవకాశం ఉందని అంటున్నారు. ఇదే విషయంపై రాజమౌళిపై ప్రముఖ డైరెక్టర్ ఏ.ఆర్. రెహమాన్ ఓ ఆసక్తికర కామెంట్ చేశాడు.

సంగీతాన్ని నమిలేసిన ఏఆర్ రెహమాన్ దూకుడు ఈ మధ్య తగ్గింది. కానీ ఆయన సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేస్తున్నారు. లెటేస్టుగా రాజమౌళి గురించి ఆయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతోంది. రాజమౌళి ఎప్పటికైనా ఆస్కార్ బరిలోకి వెళ్తాడని.. ఆయన సినిమాలు అద్భుతంగా ఉంటాయన్నారు. ఆస్కార్ బరిలోకి వెళ్లే సత్తా రాజమౌళికి మాత్రమే ఉందన్నాడు. దీంతో ఆస్కార్ అవార్డు అందుకున్న రెహమాన్ రాజమౌళి గురించి ఇలాంటి కామెంట్ చేయడం ఆసక్తిగా మారింది.
‘స్టూడెంట్ నెంబర్ 1’ సినిమా నుంచి రాజమౌళి మూవీస్ ప్రత్యేకంగా ఉంటున్నాయి. అయితే ‘మగధీర’ నుంచి హిస్టారికల్ మూవీస్ తీస్తూ పాన్ ఇండియా లెవల్లో ప్రశంసలు తెచ్చుకుంటున్నారు. ఇక బాహుబలి తరువాత రాజమౌళి రేంజ్ వరల్డ్ వైడ్ కు ఎదిగింది. ఈనేపథ్యంలో హాలీవుడ్ నుంచి కూడా ఆఫర్లు వచ్చినట్లు సమాచారం. కానీ ఆయన తెలుగు తప్ప మరో చోటికి వెళ్లి సినిమాలు తీసే ప్రసక్తే లేదని అన్నాడు.

ఇటీవల ట్రిపుల్ ఆర్ ను జపాన్ లో రిలీజ్ చేయడంతో అక్కడా మంచి రెస్పాన్స్ వస్తోంది. మొదటిరోజే కళ్లు చెదిరే కలెక్షన్లు వచ్చాయి. ఇవి ఇలాగే కొనసాగితే ఇక రాజమౌళికి రెండు దేశాల్లో తిరుగుండదు. అంతేకాకుండా ఒకే టైంలో వరల్డ్ వైడ్ గా థియేటర్లలో రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది. అయితే ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆస్కార్ వస్తుందా..? అని కొందరు కామెంట్ చేశారు. కానీ ప్రముఖ డైరెక్టర్ ఏ.ఆర్.రెహమాన్ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారుతున్నాయి.