Oscar Awards: Prabhas – Ram Charan: రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి మరియు #RRR సినిమాల ద్వారా ప్రభాస్ , రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ వంటి మన టాలీవుడ్ స్టార్ హీరోలకు పాన్ వరల్డ్ రేంజ్ లో గుర్తింపు లభించింది..ఈ హీరోలు ఇక నుండి ఏ సినిమా చేసిన పాన్ వరల్డ్ రేంజ్ లోనే బిజినెస్ జరుగుతుంది..#RRR సినిమాకి అయితే ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి ఆదరణ పొందిందో మన అందరం గమనించాము..థియేట్రికల్ పరంగా వండర్స్ సృష్టించిన ఈ చిత్రం OTT విడుదల తర్వాత ఫారినర్స్ నుండి విశేష ఆదరణ దక్కించుకుంది..నెట్ ఫ్లిక్స్ లో ఈ చిత్రాన్ని ఇతర దేశానికీ సంబంధించిన వారు ఎగబడిమరీ చూసారు.

హాలీవుడ్ నటీనటులు మరియు దర్శక నిర్మాతలు కూడా #RRR ని చూసి రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ లను పొగడ్తలతో ముంచి ఎత్తారు..అంతటి ఆదరణ దక్కించుకున్న ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డ్స్ నామినేషన్స్ లో చోటు దక్కుతుందని అందరూ భావించారు..మూవీ టీం కూడా ఆస్కార్ అవార్డ్స్ నామినేషన్స్ కోసం #RRR మూవీ ని పంపింది.
అయితే ఆస్కార్ అవార్డ్స్ లో నామినేషన్స్ దక్కలేదు కానీ..మన టాలీవుడ్ నుండి ఆస్కార్ అవార్డ్స్ ఫంక్షన్ కి హాజరు కావాల్సిందిగా రామ్ చరణ్ మరియు ప్రభాస్ కి ప్రత్యేకమైన ఆహ్వానం దక్కినట్టు సమాచారం..ఈ వార్త ఇప్పుడు ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారింది..ప్రతి ఏడాది ఆస్కార్ అవార్డ్స్ ఈవెంట్ కి సౌత్ నుండి కొంతమంది పాపులర్ హీరోలను ప్రత్యేకంగా ఎంచుకొని ఆహ్వానిస్తుంటారు ఆస్కార్ అకాడమీ అవార్డ్స్ టీం..అలా ఈ ఏడాది జరగబొయ్యే ఆస్కార్ ఈవెంట్ కి ఈ ఇద్దరి క్రేజీ హీరోలకు ఆహ్వానం దక్కినట్టు సమాచారం.

మరి ఈ ఆహ్వానాన్ని స్వీకరించి రామ్ చరణ్ – ప్రభాస్ వెళ్తారా లేదా అనేది చూడాలి..ప్రస్తుతం ప్రభాస్ సాలార్ , ప్రాజెక్ట్ K వంటి చిత్రాల షూటింగ్స్ తో బిజీ గా ఉన్నాడు..రామ్ చరణ్ డైరెక్టర్ శంకర్ తో ఒక సినిమా చేస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే..ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కి విరామం దక్కడం తో రామ్ చరణ్ చిల్ అవుతున్నాడు.