https://oktelugu.com/

Ormax popular Heros : లేటెస్ట్ సర్వేలో షాకింగ్ రిజల్ట్… టాలీవుడ్ నెంబర్ హీరో ఎవరో తెలుసా?

ఆయనకు ఇండియా వైడ్ గా ఉన్న ఫ్యాన్స్ 2వ ర్యాంక్ ఇచ్చారు. ఇక పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ టాప్ 1 లో ఉన్నారు. ఆర్మాక్స్ సర్వే ప్రకారం ప్రస్తుతానికి టాలీవుడ్ టాప్ హీరో ప్రభాస్ అన్నమాట.

Written By:
  • NARESH
  • , Updated On : May 16, 2024 / 04:35 PM IST

    Ormax popular Heros

    Follow us on

    Ormax popular Heros : టాలీవుడ్ టాప్ హీరో ఎవరో తేలిపోయింది. ప్రముఖ మీడియా సంస్థ తాజాగా నిర్వహించిన సర్వేలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. దేశవ్యాప్తంగా ఉన్న సినిమా లవర్స్ అభిప్రాయాన్ని బట్టి ఈ ర్యాంకింగ్స్ ఇవ్వడం జరిగింది. దీని ప్రకారం టాప్ వన్ లో ఎవరున్నారు? టాప్ 10లో చివరి స్థానం ఎవరికి దక్కిందో ఇప్పుడు తెలుసుకుందాం. తెలుగు మోస్ట్ పాపులర్ మేల్ స్టార్స్ పేరిట నిర్వహించిన సర్వే లో ఏప్రిల్ 24 వరకు ఫలితాలు ఇలా ఉన్నాయి.

    రౌడీ హీరో విజయ్ దేవరకొండ 10వ స్థానం దక్కించుకున్నాడు. ఆయనకు చాలా కాలంగా సరైన హిట్ పడలేదు. అయినప్పటికీ విజయ్ దేవరకొండ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికి కూడా ఫార్మ్ కొనసాగిస్తున్నారు. యంగ్ హీరోలతో పోటీ పడి సినిమాలు చేస్తున్నారు. ఆయనకు 9వ ర్యాంక్ దక్కడం విశేషం. హీరో రవితేజ కు ప్రేక్షకులు 8వ ర్యాంక్ ఇచ్చారు. హిట్స్, ప్లాప్స్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు మాస్ మహా రాజా.

    ఇక నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం మంచి జోరు మీద ఉన్నారు. దసరా, హాయ్ నాన్న సూపర్ హిట్ అయ్యాయి. ప్రస్తుతం సరిపోదా శనివారం సినిమా చేస్తున్నారు. నానికి 7వ స్థానం లభించింది. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 6 స్థానంలో ఉన్నారు. ఆయనకు టాప్ 5లో చోటు దక్కలేదు. రామ్ చరణ్ కు 5వ ర్యాంక్ దక్కింది. త్వరలో గేమ్ ఛేంజర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. పుష్ప సినిమాతో దేశవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించాడు అల్లు అర్జున్. ఆయనకు 4వ స్థానం ఇచ్చారు ప్రేక్షకులు.

    యంగ్ టైగర్ ఎన్టీఆర్ 3వ ర్యాంక్ లో కొనసాగుతున్నారు. ఆర్ ఆర్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ రేంజ్ మారిపోయింది. వరల్డ్ వైడ్ గా అభిమానులు ఏర్పడ్డారు. సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనకు ఇండియా వైడ్ గా ఉన్న ఫ్యాన్స్ 2వ ర్యాంక్ ఇచ్చారు. ఇక పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ టాప్ 1 లో ఉన్నారు. ఆర్మాక్స్ సర్వే ప్రకారం ప్రస్తుతానికి టాలీవుడ్ టాప్ హీరో ప్రభాస్ అన్నమాట.