Ormax Stars India Loves: దేశంలోనే అతిపెద్ద ఇండస్ట్రీగా టాలీవుడ్ అవతరించింది. ప్రభాస్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్ లకు ఇండియా వైడ్ పాపులారిటీ ఉంది. వీరు పాన్ ఇండియా హీరోల లిస్ట్ లో ఉన్నారు. మరి దేశంలోనే అతి పెద్ద హీరో ఎవరు? ఎవరికి అత్యంత ఎక్కువ పాపులారిటీ ఉంది? అని బాలీవుడ్ కి చెందిన ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్ సర్వే నిర్వహించింది. 2024కి గాను మోస్ట్ పాప్యులర్ ఫిమేల్ ఫిల్మ్ స్టార్స్ లిస్ట్ విడుదల చేసింది. ఈ లిస్ట్ లో టాలీవుడ్ హీరోల డామినేషన్ స్పష్టంగా కనిపిస్తుంది.
టాప్ 10 లిస్ట్ పరిశీలిస్తే… బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ కి 10వ స్థానం దక్కింది. కొన్నాళ్లుగా అక్షయ్ కుమార్ కి విజయాలు లేకుండా పోయాయి. హిట్ కోసం ఆయన ప్రయత్నం చేస్తున్నారు. 9వ స్థానంలో రామ్ చరణ్ ఉన్నాడు. ఒకప్పుడు రామ్ చరణ్ ఇంకా మెరుగైన ర్యాంక్ కలిగి ఉండేవాడు. గేమ్ ఛేంజర్ అనంతరం రామ్ చరణ్ ర్యాంక్ పెరిగే సూచనలు ఉన్నాయి. 8వ స్థానంలో సూర్య ఉన్నాడు. సూర్య లేటెస్ట్ మూవీ కంగువా ఆశించిన స్థాయిలో ఆడలేదు. 7వ స్థానం మహేష్ బాబుకు దక్కింది.
మహేష్ బాబు ఇంత వరకు ఒక్క పాన్ ఇండియా మూవీ కూడా చేయలేదు. అయినా ఆయనకు ఇండియా వైడ్ పాపులారిటీ ఉందని, ఈ సర్వే తెలియజేస్తుంది. 6వ స్థానం అజిత్ కుమార్ కి దక్కింది. కోలీవుడ్ టాప్ స్టార్స్ లో ఒకరిగా గా అజిత్ ఉన్నాడు. దేవర మూవీతో సోలోగా పాన్ ఇండియా హిట్ కొట్టిన ఎన్టీఆర్ 5వ స్థానంలో ఉన్నాడు. ఆయనకు టాప్ 5 లో చోటు దక్కింది. 4వ స్థానంలో షారుఖ్ ఖాన్ ఉన్నాడు. 2023లో షారుఖ్ ఖాన్ పఠాన్, జవాన్ చిత్రాలతో రెండు వేల కోట్లకు పైగా వసూళ్లు రాబట్టాడు. రాజ్ కుమార్ హిరానీ తెరకెక్కించిన డంకీ సైతం పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.
ఇక 3వ స్థానం అల్లు అర్జున్ కి దక్కింది. పుష్ప 2 తో అల్లు అర్జున్ ఇండియాస్ అతిపెద్ద బ్లాక్ బస్టర్ నమోదు చేశాడు. ఈ మూవీ రూ. 1500 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. కాగా 2వ స్థానంలో విజయ్ ఉన్నాడు. విజయ్ గత చిత్రం గోట్ డిజాస్టర్ అయ్యింది. అయినా ఆయనకు ఫేమ్ తగ్గలేదు. ఒక్క పాన్ ఇండియా హిట్ లేకపోయినా విజయ్ కి జనాల్లో భారీ పాపులారిటీ ఉంది.
కాగా నెంబర్ 1 స్థానం ప్రభాస్ కైవసం చేసుకున్నాడు. దేశంలోనే అత్యంత పాపులారిటీ కలిగిన హీరోగా అవతరించాడు. బాహుబలి, బాహుబలి 2, సాహో, కల్కి చిత్ర విజయాలతో ప్రభాస్ ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. ప్రభాస్ కి అల్లు అర్జున్ నుండి గట్టి పోటీ ఎదురవుతుంది.
Ormax Stars India Loves: Most popular male film stars in India (Nov 2024) #OrmaxSIL pic.twitter.com/n03VKxAyuQ
— Ormax Media (@OrmaxMedia) December 21, 2024