
‘Orange’ rerelease : #RRR సినిమా తో గ్లోబల్ స్టార్ గా పేరు తెచ్చుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు ఈ నెల 27 వ తేదీ అనే సంగతి అందరికీ తెలిసిందే.ఇది వరకు జరుపుకున్న పుట్టిన రోజులు వేరు, ఈ ఏడాది జరుపుకోబోయ్యే పుట్టిన రోజు వేరు.ఈ ఏడాది రామ్ చరణ్ కి ఎంతో స్పెషల్,అందుకే ఈసారి కనీవినీ ఎరుగని రీతిలో ఆయన పుట్టిన రోజు వేడుకలు చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు.
అయితే గత కొంతకాలం నుండి స్టార్ హీరోల పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు తమ అభిమాన హీరో కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చిన చిత్రాలను రీ రిలీజ్ చేసుకొని సంబరాలు చేసుకుంటున్నారు.అలా రామ్ చరణ్ ఫ్యాన్స్ కూడా మగధీర చిత్రాన్ని రీ రిలీజ్ చేసి సంబరాలు చేసుకోవాలని అనుకున్నారు.కానీ కొన్ని టెక్నికల్ లోపాలు ఉండడం వల్ల ఈ సినిమాకి బదులుగా ‘ఆరంజ్’ చిత్రాన్ని రీ రిలీజ్ చేస్తున్నారు.
ఈ చిత్రానికి నిర్మాత నాగబాబు కాబట్టి, ఆయనే ఈ సినిమాని 4K క్వాలిటీ కి మార్చి రీ రిలీజ్ చేస్తున్నాడు.ఈ రీ రిలీజ్ ద్వారా వచ్చిన కలెక్షన్స్ మొత్తం జనసేన పార్టీ కి విరాళంగా ఇస్తామని ఈ సందర్భంగా నాగబాబు తెలిపాడు.దీనితో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఈ చిత్రాన్ని చూసేందుకు ఎగబడ్డారు.బుక్ మై షో లో అప్పుడే ఈ చిత్రం కొత్త రిలీజ్ లను కూడా పక్కకి నెట్టి టాప్ 1 లో ట్రెండింగ్ అవ్వడం ప్రారంభించింది.హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉన్న పాపులర్ థియేటర్ సంధ్య 35MM లో టికెట్స్ ఓపెన్ చేసారు.
బుకింగ్స్ ప్రారంభించిన పది నిమిషాల వ్యవధిలోనే టికెట్స్ మొత్తం హాట్ కేక్స్ లాగ అమ్ముడుపోయాయి.ఇది నిజంగా ఎవ్వరూ ఊహించనిది.హిట్ సినిమాలు రీ రిలీజ్ అయ్యినప్పుడు బుకింగ్స్ స్పీడ్ గా ఉంటాయి అనేది ఎవరైనా ఊహిస్తారు.కానీ కెరీర్ లో ఒక బిగ్గెస్ట్ డిజాస్టర్ మూవీ కి ఈ స్థాయి బుకింగ్స్ అంటే సాధారణమైన విషయం కాదు.రీ రిలీజ్ ద్వారా ఈ చిత్రం మొదటి రోజు ఎంత వసూళ్లను రాబడుతుందో చూడాలి.