Operation Sindhoor : ఆపరేషన్ సింధూర్(#OperationSindhoor) పై ప్రతీ భారతీయుడు ఎంతలా గర్విస్తున్నాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఏ పాపం తెలియని అమాయక పర్యాటకులపై పెహల్గామ్ లో ఉగ్రమూకలు దాడి చేసి గతమార్చినందుకు ప్రతీకారంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు, మన ఇండియన్ ఆర్మీ చేపట్టిన ఈ ఆపరేషన్ లో పాకిస్తాన్ లో రహస్యం గా ఉంటున్న ఉగ్రమూకలను మట్టుపెట్టింది. సుమారుగా వంద మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. ఇది దేశానికీ ఎంతో గర్వించ దగ్గ విషయం. సినీ సెలబ్రిటీలు దీనిపై ఎంతో గర్విస్తూ కామెంట్స్ కూడా చేసారు. అయితే బాలీవుడ్ ఖాన్స్ త్రయం మాత్రం ఈ అంశం పై నోరు మెదపలేదు. భారతదేశ ప్రజలు వాళ్ళని పెంచి పోషించి ఇంత పెద్ద సూపర్ స్టార్స్ ని చేస్తే, ఇలా సైలెంట్ గా ఉండడం పై తీవ్ర స్థాయిలో మన ఇండియన్స్ విరుచుకుపడుతున్నారు.
Also Read : ఆపరేషన్ సింధూర్.. సంచలన వీడియో రిలీజ్ చేసిన ఇండియన్ ఆర్మీ..
అమీర్ ఖాన్(Amir Khan) అయినా ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా స్పందించాడు కానీ, షారుఖ్ ఖాన్(Shahrukh Khan), సల్మాన్ ఖాన్(Salman Khan) లు మాత్రం అసలు రెస్పాన్స్ ఇవ్వలేదు. సీజ్ ఫైర్ చేసిన తర్వాత సల్మాన్ ఖాన్ ట్విట్టర్ లో ‘సీజ్ ఫైర్ చేసినందుకు కృతఙ్ఞతలు’ అంటూ ట్వీట్ చేసాడు. ఈ ట్వీట్ పై నెటిజెన్స్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మన దేశం గాలి పీలుస్తూ పాకిస్తాన్ కి సపోర్ట్ గా ఉన్న ఇలాంటోళ్ళనా మనం ఇన్ని రోజులు అభిమానించింది అంటూ కామెంట్స్ చేశారు. అయితే షారుఖ్ ఖాన్ గతంలో చేసిన కొన్ని కామెంట్స్ కి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఈ వీడియో చూసిన తర్వాత నెటిజెన్స్ ఈ ఖాన్స్ పై ఆ రేంజ్ లో విరుచుకు పడడంలో ఎలాంటి తప్పు లేదని అర్థం అవుతుంది. ఇలాంటి వారైనా ఇంత కాలం మనం ఆదరించింది అని సిగ్గు పడాల్సిన సమయం ఇది.
ఇంతకీ ఆయన ఏమి మాట్లాడాడు అంటే ‘నా తండ్రి కరాచీ(పాకిస్తాన్ లో ఒక సిటీ) ప్రాంతానికి చెందిన వాడు అని నేను గర్వం గా చెప్పుకుంటున్నాను. అయినా భారతీయులకు, పాకిస్థానీయులకు మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు, కేవలం రాజకీయ నాయకుల వల్లే ఇదంతా జరుగుతుంది. ఆ స్థాయికి దిగజారిపోయాయి మన రాజకీయాలు’ అంటూ చెప్పుకొచ్చాడు. ఈ వీడియో ఇప్పుడు సెన్సేషనల్ గా మారింది. వాస్తవానికి షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ లకు పాకిస్తాన్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. వీళ్ళ సినిమాలకు ఇక్కడ భారీ రేంజ్ లో వసూళ్లు వస్తుంటాయి. పాకిస్తాన్ ఫ్యాన్స్ ని కోల్పోవడం ఇష్టం లేకనే వీళ్లిద్దరు మౌనం వహించారని స్పష్టంగా తెలుస్తుంది. మన టాలీవుడ్ నుండి అల్లు అర్జున్, ప్రభాస్ వంటి వారికి కూడా పాకిస్తాన్ లో గొప్ప ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కానీ ఆపరేషన్ సింధూర్ సమయం లో దేశం కోసం నిలబడి మాట్లాడడం లో వాళ్ళు ఏ మాత్రం ఆలస్యం చేయలేదు. వాళ్ళని చూసి నేర్చుకోమని ఖాన్స్ కి హితబోధ చేస్తున్నారు నెటిజెన్స్.
Also Read : ఆపరేషన్ సింధూర్’ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్న టాలీవుడ్ సెలబ్రిటీలు..!
వీడు పాకీ నా pic.twitter.com/zohpMcxhFj
— సర్ధార్ సర్వాయి పాపన్న (@kaloji2022) May 15, 2025