https://oktelugu.com/

Oo Antava Song: సోషల్ మీడియా లో వైరల్ గా మారిన ఊ అంటావా సాంగ్ మేల్ వెర్షన్…

Oo Antava Song: అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప ద రైజ్’ సినిమా శుక్రవారం థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ చిత్రం లోని ‘‘ఊ అంటావా.. ఉఊ అంటావా’’ సాంగ్ సోషల్ మీడియాలో దూసుకెళ్తోంది. ఈ స్పెషల్ సాంగ్‌లో సమంత తళుకులు చూసి అభిమానులు విజిల్స్ వేస్తున్నారు. అరుపులు కేకలతో థియేటర్లు దద్దరిల్లుతున్నాయ్. మంగ్లీ సోదరి ఇంద్రావతి చౌహాన్ ఆలపించిన ఈ పాట యూట్యూబ్‌లో ట్రెండవ్వుతోంది. అయితే ఈ పాటలో ‘‘మగాళ్ల బుద్ధి.. వంకర బుద్ధి’’ అనేది […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 17, 2021 / 02:13 PM IST
    Follow us on

    Oo Antava Song: అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప ద రైజ్’ సినిమా శుక్రవారం థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ చిత్రం లోని ‘‘ఊ అంటావా.. ఉఊ అంటావా’’ సాంగ్ సోషల్ మీడియాలో దూసుకెళ్తోంది. ఈ స్పెషల్ సాంగ్‌లో సమంత తళుకులు చూసి అభిమానులు విజిల్స్ వేస్తున్నారు. అరుపులు కేకలతో థియేటర్లు దద్దరిల్లుతున్నాయ్. మంగ్లీ సోదరి ఇంద్రావతి చౌహాన్ ఆలపించిన ఈ పాట యూట్యూబ్‌లో ట్రెండవ్వుతోంది. అయితే ఈ పాటలో ‘‘మగాళ్ల బుద్ధి.. వంకర బుద్ధి’’ అనేది లిరిక్స్ పై భర్తల సంఘం అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. ఈ మేరకు ఈ పాటపై కేసు కూడా నమోదు చేశారు. ఇప్పుడు తాజాగా సోషల్ మీడియా లో మేల్ వెర్షన్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

    Oo Antava Song

    Also Read: పుష్పరాజ్​కు అయాన్​ స్పెషల్​ విషెస్​.. నెట్టింట్లో పోస్ట్​ వైరల్

    అయితే ఈ పాట పాడిన వ్యక్తి గళం కాస్త కర్ణకఠోరంగా ఉన్నా… పాట ఎడిటింగ్ కూడా మీకు నచ్చుతుంది. మరోవైపు అమరావతిలోని తాళ్లూరు గ్రామంలో కోదండరామ ఆలయంలో ‘ఊ అంటావా… ఊఊ అంటావా’ పాటలో డాన్స్ చేసిన సమంతకు, ఆ పాట రాసిన గేయ రచయిత చంద్రబోసుకు స్థానిక మహిళామండలి సభ్యులు అర్చన చేశారు. అలాగే, వారి ఫొటోలకు పాలతో అభిషేకం చేశారు. అనంతరం పురుషులది దురహంకారమని, ఈ పాట మీద కేసు వేయడం దుశ్చ్యర్య అని మండిపడ్డారు. పురుషుల దురహంకారాలు, దుశ్చర్యలను ఎండగట్టే పాట మీద వివాదాన్ని రాజేసిన పురుష సంఘానిది వంకరబుద్ది అని దుయ్యబట్టారు. మహిళల ఐకమత్యం వర్థిల్లాలని నినాదాలు చేశారు. అంతే కాదు… ‘పుష్ప’ సినిమాను తొలి రోజు చూస్తామని, ‘ఊ అంటావా’ పాటకు ఈలలు వేసి, చప్పట్లు కొడతామని చెప్పారు. మొత్తానికి ఈ పాట ఒక ట్రెండ్ సెట్ చేస్తుంది.

    https://twitter.com/vaaalisugreeva/status/1470944433306841092?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1470944433306841092%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Ftelugu.abplive.com%2Fentertainment%2Fpushpa-oo-antava-oo-oo-antava-male-version-song-goes-viral-14518

    Also Read: ‘పుష్ప- ది రైజ్’ రివ్యూ