Telugu film industry: తెలుగు తెర గౌరవానికి ముఖ్య కారణం అతనే !

Telugu film industry: తెలుగు సినిమా స్థాయిని పెంచిన దర్శకులు ఎందరో ఉన్నారు. సినీ దిగ్గజాలుగా తెలుగు వెండితెరకు ఎనలేని సేవలను అందించి.. మహా దర్శకులుగా రాబోయే తరాల వారికి కూడా ప్రమాణంగా నిలిచిన వారు ఎందరో ఉన్నారు. ఎనభై సంవత్సరాల తెలుగు సినిమా చరిత్రలో ఎన్నో గొప్ప చిత్రాలు వచ్చాయి. అయితే, ఆ చిత్రాలన్నీ ఇన్నాళ్లు తెలుగు ప్రేక్షకులకు మాత్రమే పరిమితం అయ్యాయి. ‘మాయాబజార్’ సినిమా గురించి, ఆ సినిమా స్క్రీన్ ప్లే గురించి విదేశాల్లో […]

Written By: Shiva, Updated On : December 17, 2021 1:53 pm
Follow us on

Telugu film industry: తెలుగు సినిమా స్థాయిని పెంచిన దర్శకులు ఎందరో ఉన్నారు. సినీ దిగ్గజాలుగా తెలుగు వెండితెరకు ఎనలేని సేవలను అందించి.. మహా దర్శకులుగా రాబోయే తరాల వారికి కూడా ప్రమాణంగా నిలిచిన వారు ఎందరో ఉన్నారు. ఎనభై సంవత్సరాల తెలుగు సినిమా చరిత్రలో ఎన్నో గొప్ప చిత్రాలు వచ్చాయి. అయితే, ఆ చిత్రాలన్నీ ఇన్నాళ్లు తెలుగు ప్రేక్షకులకు మాత్రమే పరిమితం అయ్యాయి.

Telugu film industry

‘మాయాబజార్’ సినిమా గురించి, ఆ సినిమా స్క్రీన్ ప్లే గురించి విదేశాల్లో కూడా సినిమా విద్యార్థులకు పాఠాలు చెబుతారు అని విన్నాం గానీ, నిజంగా ఆ సినిమాకి పాన్ ఇండియా సినిమాగా కూడా ఇప్పటికీ సరైన గుర్తింపు దక్కలేదు. అసలు దర్శకత్వానికే కేరాఫ్ అడ్రస్ గా నిలిచిపోయిన దాసరి లాంటి దిగ్గజ దర్శకుడికి కూడా రావాల్సిన స్థాయిలో పాన్ ఇండియా ఇమేజ్ రాలేదు.

అలాగే అంతకుముందు సినిమా అంటే ఇది అని తన సినిమాలతో కొత్త గ్రామర్ నేర్పిన గొప్ప దర్శకుడు కేవీ రెడ్డి గారికి కూడా మిగిలిన భాషల్లో గుర్తింపు దక్కలేదు. ఒక విధంగా తెలుగు మహా దర్శకులకు జరిగిన అన్యాయమే ఇది. అయితే, అప్పుడు ఆ మహా దర్శకులు కోల్పోయిన జాతీయ స్థాయి గుర్తింపును నేడు మన కొత్త తరం దర్శకులు అంది పుచ్చుకుంటున్నారు.

ఇప్పటికే, రాజమౌళికి ఇండియన్ డైరెక్టర్ గా కాదు, ఇండియన్ నెంబర్ వన్ డైరెక్టర్ గా గొప్ప క్రెడిట్ లభించింది. అలాగే, నేడు పుష్ప రిలీజ్ తో సుకుమార్ కి కూడా పాన్ ఇండియా డైరెక్టర్ గా పేరు వచ్చింది. ఇక ఇప్పటికే సందీప్ వంగకు హిందీలో కూడా భారీ డిమాండ్ ఉంది. అలాగే జెర్సీ డైరెక్టర్ గౌతమ్ ను కూడా పాన్ ఇండియా డైరెక్టర్ గా గుర్తిస్తున్నారు.

Also Read: Pushpa: థియేటర్​లో ఫ్యామిలీతో పుష్పరాజ్​ సందడి.. ఎగబడిన అభిమానులు

మొత్తమ్మీద ఒకప్పుడు మన దిగ్గజ దర్శకులు సాధించలేనిది, నేటి యువ దర్శకులు సాధించడం కచ్చితంగా అభినందనీయమే. అయితే, ఈ రోజు తెలుగు సినిమాలకు, అలాగే తెలుగు దర్శకులకు, అన్నిటికీ మించి తెలుగు తెరకు లభిస్తోన్న గౌరవానికి నీరాజనాలకు ముఖ్య కారణం.. రాజమౌళినే.

Also Read: Pushpa Telugu Movie Review: ‘పుష్ప- ది రైజ్’ రివ్యూ

Tags