https://oktelugu.com/

Anchor Anasuya: తండ్రిని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టిన అనసూయ…

Anchor Anasuya: ఓ వైపు యాంకర్ గా రాణిస్తూనే మరోవైపు సినిమాల్లో కూడా బిజీగా రాణిస్తుంది యాంకర్ అనసూయ. కాగా ఆమె నటించిన ‘పుష్ప’ సినిమా ఈరోజు విడుదల అయిన విషయం తెలిసిందే. మొదటి షో నుంచే హిట్ టాక్ తో దూసుకుపోతూ ఆడియన్స్ ను అలరిస్తుంది ఈ సినిమా. అలానే ఈ సినిమాలో అనసూయ ద్రాక్షాయని పాత్ర పోషించగా… ఆమె పాత్రకు విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు దక్కుతున్నాయి. అయితే ఇటీవ‌ల అనసూయ తండ్రి సుదర్శన్‌ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 17, 2021 / 02:26 PM IST
    Follow us on

    Anchor Anasuya: ఓ వైపు యాంకర్ గా రాణిస్తూనే మరోవైపు సినిమాల్లో కూడా బిజీగా రాణిస్తుంది యాంకర్ అనసూయ. కాగా ఆమె నటించిన ‘పుష్ప’ సినిమా ఈరోజు విడుదల అయిన విషయం తెలిసిందే. మొదటి షో నుంచే హిట్ టాక్ తో దూసుకుపోతూ ఆడియన్స్ ను అలరిస్తుంది ఈ సినిమా. అలానే ఈ సినిమాలో అనసూయ ద్రాక్షాయని పాత్ర పోషించగా… ఆమె పాత్రకు విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు దక్కుతున్నాయి. అయితే ఇటీవ‌ల అనసూయ తండ్రి సుదర్శన్‌ రావు కస్బా మరణించారు. డిసెంబర్‌ 5న ఆయన క్యాన్సర్‌ కారణంగా కన్నుమూశారు. ఆయ‌న మృతితో అన‌సూయ కుటుంబం విషాదంలో మునిగిపోయింది.

    Anchor Anasuya

    Also Read: ఎన్టీఆర్ – చరణ్ కోసం స్పెషల్ స్పీచ్ లు రెడీ !

    ఆయన కార్యక్రమాలన్నీ ఇటీవల పూర్తి కాగా అనసూయ తన తండ్రి మరణంపై మొదటి సారి స్పందించింది. తన తండ్రిని గుర్తు చేసుకుంటూ కొన్ని ఫోటోలు షేర్ చేసి సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టింది అనసూయ. ఈ పోస్ట్ లో నా అత్యంత అందమైన పాపాజీ… నేను నా మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఎప్పుడూ గర్వపడేలా చేస్తూనే ఉంటానని వాగ్దానం చేస్తున్నాను. మీరిచ్చిన ఈ జీవితానికి ఎలా కృతజ్ఞత చెప్పాలో అర్థం కావడం లేదు. దాన్ని చెప్పేందుకు మాటలు లేవు. మేము చేసే అన్ని పనుల్లోనూ ఏం చేయాలో, ఎలా చేయాలో చెప్తూనే మాకు ఛాయిస్ లు ఇచ్చారు. మనం గడిపిన ఆనంద సమయాలన్నింటినీ నేను ఎప్పటికీ గుర్తుంచుకుంటాను.

    మీరు అర్థరాత్రి ఇచ్చే సర్‌ప్రైజ్‌ ట్రీట్‌లన్నింటినీ ఎప్పటికీ మర్చిపోలేను. అదంతా మాపై మీకున్న అపరిమితమైన ప్రేమ. మమ్మల్ని మా కాళ్ళ మీద నిలబడేలా జీవితాన్ని నేర్పించారు. ధైర్యంగా, బలంగా ఉండమని నేర్పించారు. మీరు ఎప్పటికీ జనాలకు టైగర్‌ దర్శన్‌ పెహెల్వాన్‌గానే నిలిచి ఉంటారు. మీరు మా నాన్నగా ఎంతో గొప్పగా, మమ్మల్ని ఎంతో ఆదర్శంగా పెంచారు. మనం ఏం చెప్పినా ఈ ప్రపంచం అలా ఉంటుందని నేను ఊహించను. మనం ఎలా ఉంటామో మీరు మమ్మల్ని వదిలి వెళ్లకముందే చెప్పాను. మీరు వెళ్లిపోయినా ఎప్పటికీ మాతోనే ఉంటారు. మీ ఆత్మకి శాంతి చేకూరాలి నాన్నా” అంటూ ఎమోషనల్ గా తన తండ్రితో ఉన్న జ్ఞాపకాలని షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

    Also Read: మరో రీమేక్ చిత్రానికి రెడీ అవుతున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్…