Highest Paid Actors: దేశంలో అత్యధిక మంది చూసే.. అత్యంత సంపాదన వచ్చే ఇండస్ట్రీ బాలీవుడ్.. ఇక్కడ సినిమా తీస్తే దాదాపు ఇండియాలోని 60శాతం మంది జనాభా చూస్తారు. దక్షిణాది నాలుగు భాషల్లో తప్పితే హిందీ సినిమాకు దేశవ్యాప్తంగా క్రేజ్ ఉంది. ఇప్పుడు బాలీవుడ్ సినిమాలు ఫ్లాప్ అవుతున్నా.. ఒకప్పుడు వెలుగు వెలిగాయి. ముగ్గురు ఖాన్ లు, కపూర్ లు, సింగ్ లు బాలీవుడ్ ను ఏలారు. వయసు పెరుగుతున్నా కూడా ఇప్పటికీ బాలీవుడ్ అగ్ర హీరోలు తమ సినిమాలతో కోట్లు వెనకేసుకుంటున్నారు.

బిగ్ బాస్ అమితాబ్ బచ్చన్ నుంచి షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, అక్షయ్ కుమార్ లు ప్రస్తుతం బాలీవుడ్ లో అగ్రహీరోలుగా కొనసాగుతున్నారు. వీరి ఒక్కరోజు సంపాదన ఎంతో తెలిస్తే మైండ్ బ్లాక్ కావాల్సిందే..
-అక్షయ్ కుమార్
ఖాన్ ల త్రయం తర్వాత బాలీవుడ్ లో పెద్ద హీరో అక్షయ్ కుమార్. ఎనర్జటిక్ కథలు ఎంచుకొని హిట్స్ కొడుతుంటాడు. ఇటీవల ఆయన తీసిన ‘రక్షా బంధన్’ ఫ్లాప్ అయ్యింది. అక్షయ్ ఒకరోజుకు ఏకంగా రూ. కోటి సంపాదిస్తాడని తెలిసింది.

-అమీర్ ఖాన్
బాలీవుడ్ లోనే క్రియేటివ్ హీరో అమీర్ ఖాన్. నటన, సమాజిక సేవ చేస్తుంటారు. విభిన్నమైన చిత్రాలు తీస్తూ హిట్ కొడుతుంటాడు. ఇటీవల ఆయన తీసిన లాల్ సింగ్ చద్దా ఫ్లాప్ అయ్యింది. అయితే అమీర్ సంపాదన మాత్రం మిగతా హీరోల కంటే తక్కువే. ఈయన రోజుకు 33 లక్షల 50 వేలు మాత్రమే చార్జ్ చేస్తాడట..

-షారుఖ్ ఖాన్:
హిట్ కోసం గత ఐదారేళ్లుగా చకోర పక్షిలా సినిమాలు తీస్తూ అలిసిపోయాడు షారుఖ్ ఖాన్. ఆయనకు విజయం మాత్రం దక్కడం లేదు. అయినా వరుసగా సినిమాలు చేస్తూ పోతున్నాడు. బిజినెస్ లు, వీఎఫ్ఎక్స్, ఐపీఎల్ జట్టును కొని అలా సంపాదిస్తున్నాడు. షారుఖ్ ఒక్కరోజు సంపాదన కోటి 40 లక్షలుగా ఉంది.

-సల్మాన్ ఖాన్:
ప్రస్తుతం బాలీవుడ్ లో అంతో ఇంతో హిట్ సినిమాలు దక్కించుకుంటున్న హీరో సల్మాన్ కాన్.. సల్మాన్ కు పన్వేల్ ప్రాంతంలో 100 ఎకరాల ఫామ్ హౌస్ ఉంది. అందులోనే సినిమాలు లేనప్పుడు సేదతీరుతుంటారు. సల్మాన్ రోజుకు రూ.కోటి వరకూ తీసుకుంటారు.

-అమితాబ్ బచ్చన్ :
అందరికంటే బిగ్ బి అమితాబ్ ఇప్పటికీ ఇంతటి ముదిమి వయసులో కూడా సినిమాలు, టీవీ కార్యక్రమాలలో నటిస్తూ సంపాదిస్తున్నారు. సామాజికసేవ కూడా చేస్తున్నారు. హీరోగా కాకుండా సహాయకపాత్రలు పోషిస్తున్నాడు. ప్రస్తుతం అమితాబ్ ఒకరోజుకి కోటి 20 లక్షల రూపాయాలు తీసుకుంటున్నట్టు సమాచారం.

మొత్తంగా ఒక్క అమీర్ ఖాన్ తప్ప అందరూ కోటి రూపాయలకు పైగానే ఒకరోజుకు తీసుకుంటారు. హిట్, ఫ్లాపులతో సంబంధం లేకుండా ఈ భారీ మొత్తాన్ని వారు తీసుకుంటారు. సినిమాలకు మాత్రం పర్సంటేజీని భారీగా తీసుకుంటారు. అందరికంటే షారుఖ్ ఖాన్ కోటి 40 లక్షలతో బాలీవుడ్ లో అత్యధికంగా తీసుకునే హీరోగా ఉన్నారు.
[…] […]
[…] […]