Homeఎంటర్టైన్మెంట్Bollywood director insulted Allu Arjun: అల్లు అర్జున్ ను అవమానించిన ఏకైక బాలీవుడ్ డైరెక్టర్...

Bollywood director insulted Allu Arjun: అల్లు అర్జున్ ను అవమానించిన ఏకైక బాలీవుడ్ డైరెక్టర్…

Bollywood director insulted Allu Arjun: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తుంది. మన స్టార్ హీరోలందరు పాన్ ఇండియా బాట పట్టడమే కాకుండా అక్కడ పెను సంచనలను క్రియేట్ చేస్తూ సినిమాలను చేస్తుండడం విశేషం…ఇప్పటివరకు ఎవ్వరికి రానీ గుర్తింపు మన తెలుగు హీరోలకు మాత్రమే వచ్చింది అంటే మన వాళ్ళు ఎలాంటి పెను ప్రభంజనాన్ని క్రియేట్ చేశారో మనం అర్థం చేసుకోవచ్చు. తెలుగు సినిమా హవా ఏంటో చూపిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరో సైతం పుష్ప సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరో గా మారిపోయాడు. ఇక పుష్ప రెండు పార్టులు అద్భుతమైన విజయాలను సాధించడంతో ఇప్పుడు ఆయన అట్లీ డైరెక్షన్లో చేస్తున్న సినిమా మీద చాలా కేర్ఫుల్గా వ్యవహరిస్తున్నాడు. అయితే అల్లు అర్జున్ గతంలో ఒక డైరెక్టర్ తో సినిమా చేయాలని అనుకున్నారట.

కానీ ఆ దర్శకుడు మాత్రం అల్లు అర్జున్ తో సినిమా చేయడానికి పెద్దగా ఆసక్తి చూపించలేదని దానివల్ల ఆయన కొంతవరకు నిరుత్సాహ పడ్డాడనే వార్తలైతే వచ్చాయి. ఇంతకీ ఆ దర్శకుడు ఎవరు అంటే బాలీవుడ్ డైరెక్టర్ ఆయన రాజ్ కుమార్ హిరానీ కావడం విశేషం. రాజకుమార్ హిరానీ డైరెక్షన్ లో వచ్చిన మున్నాభాయి ఎంబిబిఎస్ అలాగే లాగేరాహో మున్నాభాయ్, త్రి ఇడియట్స్ సినిమాలు ఎంత గొప్ప విజయాన్ని సాధించాయో మనం అర్థం చేసుకోవచ్చు…

అలాంటి రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో వర్క్ చేయడానికి చాలా మంది హీరోలు ఇంట్రెస్ట్ చూపించారు. కానీ ఆయన చాలా బిజీగా ఉండటం వల్ల కొంతమందితో సినిమాలు చేయలేకపోయాడు. ఇక అందులో అల్లు అర్జున్ కూడా ఒకరు కావడం విశేషం… అల్లుఅర్జున్ తన తండ్రి అయిన అల్లు అరవింద్ తో కలిసి రాజ్ కుమార్ హిరానీ తో సినిమా సెట్ చేసే ప్రణాళికలు రూపొందించినప్పటికి అది వర్కౌట్ కాలేదు.

ఆయన అల్లు అర్జున్ తో సినిమా చేయడం కుదరదని చెప్పాడట. దాంతో అల్లు అర్జున్ ఎలాగైనా సరే పాన్ ఇండియా హీరోగా మారాలని మొత్తానికే పాన్ ఇండియాలో తన సత్తా చాటుతున్నాడు. ఇక ఇప్పుడు రాజ్ కుమార్ హిరానీ సైతం తనతో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నా కూడా అల్లు అర్జున్ ఇంట్రెస్ట్ చూపించడం లేదనే వార్తలైతే వస్తున్నాయి…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular