Homeఎంటర్టైన్మెంట్Pawan Kalyan advice Vijay: రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ సలహాలు తీసుకుంటున్న విజయ్...వ్యూహం మార్చాడుగా...

Pawan Kalyan advice Vijay: రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ సలహాలు తీసుకుంటున్న విజయ్…వ్యూహం మార్చాడుగా…

Pawan Kalyan advice Vijay: తమిళ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా వెలుగొందుతున్న విజయ్ సైతం ప్రస్తుతం రాజకీయ బాట పట్టాడు. టీవీకే అనే పార్టీని పెట్టి ప్రత్యక్ష రాజకీయాల్లో తను కూడా పోటీ చేస్తుండటం విశేషం…ఇక ఏది ఏమైనా కూడా విజయ్ కి అంత రాజకీయ అనుభవం లేదు అని కొంతమంది అంటుంటే, మరి కొంతమంది మాత్రం విజయ్ చూసిన పరిస్థితులను బట్టి ఆయన రాజకీయాల్లోకి వస్తున్నాడు. కాబట్టి ఆయన గెలిస్తే తప్పకుండా అంతో ఇంతో మంచి చేస్తాడని భావించే వాళ్లు కూడా ఉన్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే రీసెంట్ గా ఆయన మీద తన భార్య సంగీత విడాకులు కావాలంటూ కోర్టును ఆశ్రయించడం ఒకెత్తయితే తనకు ఒక స్టార్ హీరోయిన్ తో ఎఫైర్ ఉందనే వార్తలు రావడంతో ఆయన ఇమేజ్ చాలావరకు డ్యామేజ్ అయిందనే చెప్పాలి.

ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చాలా వరకు ఆచితూచి మరి ముందుకు అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తుంది. అధికార పార్టీలో ఉన్నవారు తనని తొక్కేయాలనే ప్రయత్నం చేస్తున్నారని గమనించిన విజయ్ కొంతమంది రాజకీయ నాయకుల సలహాలు సూచనలు తీసుకుంటున్నాడట. ఇక అందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సలహాలను కూడా తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది.

ఎందుకంటే పవన్ కళ్యాణ్ పార్టీని స్థాపించిన 10 సంవత్సరాల తర్వాత కూటమి ప్రభుత్వంతో కలిసి గవర్నమెంట్ ను ఏర్పాటు చేయడంలో కీలకపాత్ర వహించాడు. అలాగే ప్రస్తుతం ఆయన డిప్యూటీ సీఎం గా కొనసాగడమే కాకుండా పలు శాఖలకు మంత్రిగా కూడా వ్యవహరిస్తున్నాడు.

కాబట్టి ఇలాంటి క్రమంలో పవన్ కళ్యాణ్ యొక్క సలహాలు సూచనలు తనకు చాలా వరకు హెల్ప్ అవుతాయనే ఉద్దేశ్యంతో ఆయన పర్సనల్ గా పవన్ కళ్యాణ్ ని కలిసినట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. ఇక ఏది ఏమైనా కూడా పవన్ కళ్యాణ్ ఎలాగైతే రాజకీయాల్లో గేమ్ చేంజర్ గా మారాడు. విజయ్ కూడా అలాంటి ఒక పాత్రను పోషించగలుగుతాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular