మాట తప్పిన జగన్..!

రాష్ట్రంలో 70 శాతం మంది ప్రజలు వ్యవసాయ రంగంపైనే ఆధారపడి నేటికి జీవనం సాగిస్తున్నారు. అయినప్పటికీ ఈ రంగం తీవ్ర సంకోభాన్ని ఎదుర్కొంటుంది. ఈ సంక్షోభం నుంచి రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ఇచ్చే చేయూత అరకోరే. ఇచ్చిన వాటిలో రైతుల వరకూ చేరేవి తక్కువే. గతేడాది అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు చాలా ఉన్నాయి. రైతుల విషయం లో ప్రధాన హామీ రైతు భరోసా పథకం. ఈ పథకం కింద […]

Written By: Neelambaram, Updated On : May 16, 2020 2:59 pm
Follow us on

రాష్ట్రంలో 70 శాతం మంది ప్రజలు వ్యవసాయ రంగంపైనే ఆధారపడి నేటికి జీవనం సాగిస్తున్నారు. అయినప్పటికీ ఈ రంగం తీవ్ర సంకోభాన్ని ఎదుర్కొంటుంది. ఈ సంక్షోభం నుంచి రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ఇచ్చే చేయూత అరకోరే. ఇచ్చిన వాటిలో రైతుల వరకూ చేరేవి తక్కువే. గతేడాది అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు చాలా ఉన్నాయి. రైతుల విషయం లో ప్రధాన హామీ రైతు భరోసా పథకం. ఈ పథకం కింద రైతులకు ఖరీఫ్ సీజన్ ప్రారంభించడానికి ముందే రైతులకు వ్యవసాయ పనులకు ఆర్ధిక చేయూత కోసం రూ. 12,500 ప్రతి రైతు ఖతాకు జమ చేస్తామని ప్రస్తుత ముఖ్యమంత్రి, అప్పటి ప్రతిపక్ష నాయకులు జగన్మోహన్ రెడ్డి అనేక ప్రాంతాల్లో జరిగిన బహిరంగ సభల్లో హామీ ఇచ్చారు. అనంతరం జరిగిన ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చింది.

ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన తరువాత జగన్ రైతు భరోసా పథకం విషయంలో తన వైఖరిని పూర్తిగా మార్చేశారు. అప్పటికే అమలులో ఉన్న కేంద్ర ప్రభుత్వ పథకం పీఎం కిసాన్ లో భాగంగా కేంద్రం ఇచ్చే నిధులను తన పథకంలో కలిపి ఇస్తున్నట్లు ప్రకటించారు. ఆంటే రైతులకు ఇస్తామన్న రూ. 12,500లలో రూ. 5 వేలు వెనక్కి తీసుకున్నారు. కేవలం రూ. 7,500 మాత్రమే జగన్ రైతులకు ఇస్తారన్నమాట. ఈ మొత్తం కేంద్రం ఇచ్చే రూ.6,000 లతో కలిపి రూ. 13,500 అవుతుంది. ఇస్తామన్న మొత్తం కంటే రూ. 1,000 అధనంగా ఇస్తున్నామంటూ రూ. కోట్లు ఖర్చు పెట్టి ప్రచారం మాత్రం జోరుగా చేయించుకుంటున్నారు.

జగన్ ఎన్నికల ప్రచార సభలో ఎక్కడా రైతు భరోసా పథకంలో కేంద్రం ఇచ్చే మొత్తంతో కలిపి రూ.12,500 చెల్లిస్తామని చెప్పలేదు. అదేవిధంగా మొత్తం రూ. 12,500 మే నెలలోనే చెల్లిస్తామని చెప్పారు. ఇప్పుడు కరోనా కారణంగా రెండు విడతలుగా ఇచ్చారు అనుకుంటాకి లేదు. గత ఏడాది విడతల వారిగానే చెల్లింపు చేశారు. ఈ విషయంలో రైతులను జగన్ ప్రభుత్వం మోసం చేసిందంనే చెప్పుకోవచ్చు. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ, అదేవిధంగా బీజేపీలు రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని తప్పుబడుతున్నాయి. రైతులకు ఒకేసారి రూ.12,500 చెల్లిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన వైసీపీ అనంతరం కేవలం రూ.7,500 చెల్లిస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పారు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోట సాయి కృష్ణ ఇదే విమర్శలు చేశారు.