Murari Movie: టాలెంట్ ఉండాలే గానీ వైరల్ అవడం, ఫేమస్ అవడం పెద్ద విషయం కాదు అని నిరూపిస్తుంటుంది సోషల్ మీడియా. ఇక సరిగ్గా వాడుకోవాలే గానీ సోషల్ మీడియా ద్వారా ప్రతిభను బయటపెట్టవచ్చు. ఇక ఇందులో ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్స్ రెండూ ఉంటాయి. అదృష్టం టాలెంట్ రెండూ ఉండి రాత్రికి రాత్రి ఫేమస్ అయిన వారు కూడా ఉన్నారు. అలాంటి వారికి ఈ మీడియా ఒక మాధ్యమం కూడా. ఓ యువతి కూడా ఇదే విధంగా ఫేమస్ అయింది. ఆమె ఎవరు అనుకుంటున్నారా?
మహేష్ బాబు నటించిన మురారీ సినిమా గుర్తుందా? మహేష్ బాబు కెరీర్ లోనే బెస్ట్ గా నిలిచిన సినిమాల్లో ఇదొక సినిమా. అయితే ఇందులో మహేష్ బాబు పాత్రతో సినిమాకు హైలైట్ గా నిలిచిన మరొక పాత్ర లక్ష్మీ పాత్ర. ఈమె భర్త పాత్రలో ప్రసాద్ రావు నటించారు.అయితే మురారీ సినిమాలో లక్ష్మీది ఒక ఎమోషనల్ డైలాగ్ ఉంటుంది. పెళ్లై వచ్చినప్పుడు మురారీ ఎలా ప్రవర్తించాడు అనే విషయం గురించి లక్ష్మీ చెబుతూ చాలా ఎమోషనల్ అవుతుంటుంది. ఇది వింటున్న మురారీ కూడా ఫుల్ ఎమోషనల్ అవుతాడు.
అయితే ఈ డైలాగును మరో అమ్మాయి ఇన్ స్టా రీల్ చేసి పెట్టింది. లక్ష్మీ తప్ప మరొకరు సూట్ కారు అనుకున్న అభిమానులకు ఈమె నటనతో మెప్పించింది. ఈమె ఒక్క రీల్ తోనే ఫుల్ ఫేమస్ అయింది. అంతేకాదు ఎంతో మంది సెలబ్రెటీలు కూడా ఈమె రీల్ కు కామెంట్లు చేశారు. అమ్మాడి 0786 అనే పేరుతో ఇన్ స్టాను వాడుతుంది ఈ అమ్మాయి. ఈ ఒక్క వీడియో ఫుల్ ఫేమస్ అయింది.