Fauji : యంగ్ రెబల్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు ప్రభాస్ (Prabhas)…ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేస్తూ తనకంటూ ఒక సెపరేట్ క్రేజ్ కూడా సంపాదించి పెట్టుకున్నాడు. అలాంటి ప్రభాస్ ఇప్పుడు చేయబోతున్న సినిమాలతో భారీ విజయాలను అందుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తున్నాడు…ప్రస్తుతం ప్రభాస్ పాన్ వరల్డ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు కాబట్టి ఆ సినిమాలతో ఆయన ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు అనేది కూడా తెలియాల్సి ఉంది.
Also Read : వివాదాల్లో ‘ఫౌజీ’..పాకిస్థాన్ ఆర్మీ కి హీరోయిన్ ఇమాన్వి కి ఉన్న లింక్ ఏమిటంటే!
తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక గొప్ప గుర్తింపును సంపాదించుకున్న నటుడు ప్రభాస్ (Prabhas)…బాహుబలి (Bahubali) సినిమాతో పాన్ ఇండియాలోకి అడుగుపెట్టిన ఆయన యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేశాడు. బాహుబలి 2 (Bahubali 2) సినిమాతో 1800 కోట్లకు పైన కలెక్షన్లు రాబట్టి తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు. ఇక ప్రస్తుతం ఆయన చేస్తున్న ప్రతి సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా ఇకమీదట రాబోయే సినిమాలతో భారీ విజయాలను అందుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు ఒకెత్తయితే ఇక మీదట సాధించబోయే విజయాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి… సలార్(Salaar), కల్కి (Kalki) లాంటి సినిమాలతో మంచి విజయాలను అందుకున్న ఆయన ఇప్పుడు రాజాసాబ్, ఫౌజీ (Fouji) లాంటి సినిమాలను ప్రేక్షకులు ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలతో 2000 కోట్లకు పైన కలెక్షన్లు కొల్లగొట్టి ఇండస్ట్రీ రికార్డులను తిరగరాయాలనే ఉద్దేశ్యంలో ప్రభాస్ ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే హను రాఘవపూడి (Hanu Raghavapidi) దర్శకత్వంలో చేస్తున్న ఫౌజీ (Fouji) సినిమా విషయంలో ఆయన చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నాడు.
ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఎవరికి సాధ్యం కానీ రీతిలో బాలీవుడ్ హీరోలకు సైతం పోటీని ఇస్తు చెమటలు పట్టిస్తున్న నటుడు కూడా తనే కావడం విశేషం… ఇక ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏ హీరోకి సాధ్యం కానీ రీతిలో గొప్ప విజయాలను సాధించి ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్నాడు.
Also Read : నాకు పాకిస్థాన్ సైన్యం తో సంబంధం లేదు..ఆరోపణలపై స్పందించిన ప్రభాస్ ‘ఫౌజీ’ హీరోయిన్!
ఇక ఫౌజీ(Fouji) సినిమాలో ప్రభాస్ కి ఒక తమ్ముడు ఉంటారట. ఆయన అనుకోని పరిస్థితుల్లో మరణిస్తాడట…మరి అప్పటినుంచి కథ మరొక మలుపు తిరుగుతుందట. మొత్తానికైతే ఈ సినిమా ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో సాగుతున్నప్పటికి మధ్య మధ్యలో విలేజ్ లో కూడా కొంత కథ అయితే రన్ అవుతుందట.
మరి తన తమ్ముడి క్యారెక్టర్ లో ఎవరు నటిస్తున్నారు అనే విషయాల మీద సరైన క్లారిటీ అయితే ఇవ్వడం లేదు. కానీ ఈ సినిమా కథలో రెండు ప్లాట్స్ ఉన్నాయట. అందులో మెయిన్ ప్లాటుగా ఆర్మీ బ్యాక్ గ్రౌండ్ తీసుకుంటే, సబ్ ప్లాట్ గా విలేజ్ ఎపిసోడ్స్ ఉండబోతున్నాయట.