Chiranjeevi: చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఆ స్టార్ డైరెక్టర్ తో మరో సినిమా అనౌన్స్ చేయనున్నాడా..?

సినిమా ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్లకు మంచి గుర్తింపు ఉంటుంది. వాళ్ళ కాంబోలో ఎప్పుడు సినిమా వచ్చినా కూడా సినిమా మీద భారీ అంచనాలు ఉండడమే కాకుండా ఆ సినిమా కూడా సక్సెస్ అయ్యే దిశగా అడుగులు వేయడంలో వాళ్ళు చాలా వరకు కీలకపాత్ర వహిస్తూ ఉంటారు...

Written By: Gopi, Updated On : August 21, 2024 8:55 am

Chiranjeevi(3)

Follow us on

Chiranjeevi: ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమర్షియల్ డైరెక్టర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న వాళ్ళలో వివి వినాయక్ ఒకరు. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో సినిమాలను చేసి సూపర్ సక్సెస్ లను అందుకోవడంలో ఈయనను మించిన దర్శకుడు మరొకరు లేరనేది వాస్తవం… జూనియర్ ఎన్టీఆర్, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలందరితో వరుస సినిమాలను చేస్తూ అందరికీ సూపర్ సక్సెస్ లను అందించాడు. ఇక మొత్తానికైతే ఆయన ప్రస్తుతం సినిమాలు చేయకుండా ఖాళీగానే ఉంటున్నాడు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో ఛత్రపతి సినిమాని హిందీలో రీమేక్ చేసి భారీగా దెబ్బతిన్నాడు. ఇక ఇప్పుడు మరొక స్టార్ హీరో అతనికి డేట్స్ ఇవ్వడానికి చాలా వరకు ఆలోచిస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే చిరంజీవికి గతంలో ఠాగూర్, ఖైదీ నెంబర్ 150 లాంటి సినిమాలతో మంచి సక్సెస్ లను ఇచ్చాడు. కాబట్టి మరోసారి చిరంజీవి ఒక రీమేక్ సినిమాని చేయాలని చూస్తున్నాడాట. ఇక ఈ సినిమా భాద్యతలను వినాయక్ కి అప్పగించాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి ఆ సినిమా ఏంటి అనేది ఇంకా పూర్తి వివరాలు తెలియడం లేదు.

కానీ వినాయక్ తో మాత్రం చిరంజీవి ఒక సినిమా చేసే అవకాశాలు ఉన్నాయంటూ సోషల్ మీడియాలో విపరీతంగా వార్తలైతే వస్తున్నాయి. నిజానికి చిరంజీవి ఇమేజ్ కి తగ్గట్టుగా కథని మార్పులు చేర్పులు చేసి సినిమా చేయడంలో వినాయక్ ముందు వరుసలో ఉంటాడు. ముఖ్యంగా ఆయన ఎవరికి సక్సెస్ ఇచ్చిన ఇవ్వకపోయినా చిరంజీవికి మాత్రం ఒక మంచి సక్సెస్ ని ఇస్తాడని మెగాస్టార్ అభిమానులు కూడా చాలా వరకు నమ్ముతుంటారు.

కాబట్టి వారి నమ్మకాన్ని ఆయన ఎప్పుడూ వమ్ము చేయలేదు. ఇక చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఈ సినిమాని అనౌన్స్ చేసే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ విషయాన్ని తెలుసుకున్న కొంతమంది చిరంజీవి అభిమానులు మాత్రం వినాయక్ ఫేడౌట్ అయిపోయాడు. ఇప్పుడు ఆయనతో చిరంజీవి సినిమా చేయడం అవసరమా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక దాంతో పాటుగా గతంలో చేసిన భోళా శంకర్, గాడ్ ఫాదర్ రీమేకులు గానీ అతన్ని భారీగా దెబ్బతీసాయి.

మరి ఇలాంటి సందర్భంలో చిరంజీవి మరోసారి రీమేక్ సినిమాలు చేయడం ఎందుకు కొత్త కథలతో వస్తున్న దర్శకులను ఎంకరేజ్ చేసి మంచి సినిమాలు చేసి సక్సెస్ లను అందుకోవచ్చు కదా అంటూ కామెంట్లైతే చేస్తున్నారు… మరి చిరంజీవి ఈ సినిమాతో వినాయక్ కి మరోసారి అవకాశాన్ని ఇస్తాడా వీళ్ళ కాంబినేషన్ లో హ్యాట్రిక్ సినిమా నమోదు అవుతుందా లేదా అనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…