https://oktelugu.com/

Harish Shankar: హరీష్ శంకర్ – హీరో రామ్.. ఇద్దరు ఫ్లాప్ అయ్యారు.. జట్టు కట్టారు.. ఈసారి ఏం చేస్తారో మరీ…

సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ ఉన్నవాళ్ళకే క్రేజ్ ఉంటుంది. సక్సెసుల్లో ఉన్న దర్శకులకే స్టార్ హీరోలు డేట్స్ ఇస్తూ ఉంటారు. ఒకప్పుడు మంచి విజయాలను అందుకొని ఇప్పుడు ప్లాపులు అందుకున్న దర్శకులు చాలామంది ఉన్నారు...

Written By:
  • Gopi
  • , Updated On : August 21, 2024 / 09:00 AM IST

    Harish Shankar(2)

    Follow us on

    Harish Shankar: ‘గబ్బర్ సింగ్’ సినిమాతో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపును సంపాదించుకున్న హరీష్ శంకర్ ఆ తర్వాత ఎన్టీఆర్ తో చేసిన ‘రామయ్య వస్తావయ్య’ సినిమాతో భారీ డిజాస్టర్ ని మూట గట్టుకున్నాడు. అయినప్పటికీ ఆ తర్వాత వరుస కమర్షియల్ సినిమాలను చేస్తూ మంచి విజయాలను అందుకుంటూ వస్తున్నాడు. ముఖ్యంగా హరీష్ శంకర్ చేసిన సినిమాల్లో ఎక్కువగా రీమేక్ సినిమాలు ఉండడం విశేషం… ఇక రీసెంట్ గా రవితేజతో చేసిన ‘మిస్టర్ బచ్చన్’ సినిమా కూడా ఆశించిన మేరకు విజయాన్ని అయితే సాధించలేకపోయింది. ఇక దాంతో హరీష్ శంకర్ మీద ఇప్పుడు అందరిలో తీవ్రమైన నెగెటివిటీ అయితే పెరిగిపోయింది.

    ఇక పవన్ కళ్యాణ్ తో చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో మరోసారి భారీ సక్సెస్ ని అందుకోవాలనే ప్రయత్నంలో హరీష్ శంకర్ ఉన్నట్టుగా తెలుస్తుంది. అయినప్పటికీ ఈ సినిమా ఎప్పుడు షూటింగ్ ఫినిష్ అవుతుంది అనే దానిమీద ఇంకా క్లారిటీ అయితే రాలేదు. ఇక ఈ క్రమంలోనే డబుల్ ఇస్మార్ట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రామ్ పోతినేని కూడా సక్సెస్ సాధించలేకపోయాడు. ఇక ఇప్పుడు హరీష్ శంకర్ రామ్ కాంబినేషన్ లో ఒక సినిమా రాబోతున్నట్టుగా వార్తలు కూడా వినిపిస్తున్నాయి. నిజానికి హరీష్ శంకర్ కూడా ఈ విషయం మీద స్పందిస్తూ రామ్ తో సినిమా ఉంటుందని స్పష్టం చేశాడు… ఇక ఈ సినిమాలో రామ్ ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడనే విషయాలు కూడా తెలుస్తున్నాయి.

    ఇంతకుముందు రామ్ ది వారియర్ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా కనిపించాడు. లింగస్వామి డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఏమాత్రం అలరించలేకపోయింది. మరి హరీష్ శంకర్ తో చేయబోతున్న ఈ సినిమా మంచి విజయాన్ని అందించాలని తను కోరుకుంటున్నాడు. ఇక తొందర్లోనే ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్ళాలని హరీష్ శంకర్ ప్రణాళికలను రూపొందించుకుంటున్నారు. ఇక ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ తో చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేసే విధంగా ప్రణాళికలు రూపొందించబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక అప్పటి వరకు పవన్ కళ్యాణ్ కూడా కొంచెం ఫ్రీ అవ్వనున్నాడు.

    అందువల్ల ఈ గ్యాప్ లో హరీష్ శంకర్ ఈ సినిమాను చేసేసి ఒక మంచి సక్సెస్ ని అందుకోవాలని చూస్తున్నాడు. ఎందుకంటే మిస్టర్ బచ్చన్ సినిమాతో ఫ్లాప్ ని మూట గట్టుకున్న హరీష్ శంకర్ ఇప్పుడు అతనికి అర్జెంటుగా సక్సెస్ అయితే కావాలి. కాబట్టి ఎనర్జిటిక్ స్టార్ అయిన రామ్ ను హీరో గా పెట్టి ఒక సినిమా చేస్తున్నాడు…చూడాలి మరి ఈ సినిమాతో అయిన సక్సెస్ సాధిస్తాడా లేదా అనేది…