Raja Saab 4 Days Collections: రెబల్ స్టార్ ప్రభాస్(Rebel star Prabhas) ‘రాజా సాబ్'(Rajasaab Movie) చిత్రం వసూళ్లు రోజురోజుకి బాగా తగ్గిపోతున్నాయి. మొదటి వీకెండ్ వసూళ్లు డీసెంట్ గానే వచ్చినప్పటికీ, నిన్నటి నుండి భారీ గా తగ్గిపోయాయి. మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రానికి పాజిటివ్ టాక్ రావడం తో దాని ప్రభావం ఈ చిత్రం పై దారుణంగా పడింది. ప్రధాన నగరాల్లో కూడా ‘రాజా సాబ్’ కి థియేటర్స్ సంఖ్య బాగా తగ్గించేశారు. దీంతో కలెక్షన్స్ కూడా బాగా తగ్గిపోయాయి. నిన్న ఈ చిత్రానికి బుక్ మై షో యాప్ లో 88 వేల టికెట్స్ మాత్రమే అమ్ముడుపోయాయి. నేడు కొత్త సినిమాలు రావడం తో మరిన్ని షోస్ తగ్గు ముఖం పట్టాయి. ఫలితంగా ఈ చిత్రం దాదాపుగా క్లోజింగ్ కి వచ్చినట్టే. రేపటి నుండి పండుగ మొదలు కాబట్టి, కచ్చితంగా కలెక్షన్స్ మంచిగా ఉండే అవకాశాలు ఉన్నాయి.
అయితే ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం బట్టీ చూస్తే, ఈ చిత్రానికి నాల్గవ రోజున 3 కోట్ల రూపాయిల వర్త్ షేర్ తెలుగు రాష్ట్రాల నుండి వచ్చినట్టు తెలుస్తోంది. రిటర్న్ జీఎస్టీ తో కలిపితే 4 నుండి 4.5 కోట్ల షేర్ వసూళ్లు వస్తుందని అంటున్నారు. మొత్తం మీద గ్రాస్ వసూళ్లు 9 కోట్ల రూపాయిల రేంజ్ లో ఉండొచ్చు. దీంతో నాలుగు రోజులకు వరల్డ్ వైడ్ గా 167 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. 200 కోట్ల గ్రాస్ మార్కుని ఈ చిత్రం అందుకునే అవకాశాలు పుష్కలం గా ఉన్నాయి, కానీ నేడు విడుదలైన రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది. రేపటి నుండి ఆ సినిమాకు కూడా ఆడియన్స్ బాగా డివైడ్ అవుతారు. రేపు నవీన్ పోలిశెట్టి నటించిన ‘అనగనగా ఒక రాజు’ చిత్రం కూడా విడుదల కాబోతుంది, ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే ఇక రాజా సాబ్ కి క్లోజింగ్ వేసుకోవడమే అని అంటున్నారు.
2024 వ సంవత్సరం లో సంక్రాంతి కానుకగా విడుదలైన ‘గుంటూరు కారం’ చిత్రానికి కూడా ఫ్లాప్ టాక్ వచ్చింది. ఈ సినిమాకు పోటీ గా ‘హనుమాన్’, ‘నా సామి రంగ’, ‘సైన్ధవ్’ వంటి చిత్రాలు వచ్చాయి. హనుమాన్ కి తప్ప, మిగిలిన సినిమాలన్నిటికీ ఫ్లాప్ టాక్ వచ్చాయి. ఆ సమయం లో ఆడియన్స్ కి మొదటి ఛాయస్ గా ‘హనుమాన్’ ఉంటే, రెండవ ఛాయస్ గా ‘రాజా సాబ్’ చిత్రం ఉంది. ఫలితంగా ‘గుంటూరు కారం’ కమర్షియల్ గా ఆంధ్ర ప్రాంతం వరకు యావరేజ్ రేంజ్ లో ఆడింది. కానీ ‘రాజా సాబ్’ కి అలాంటి పరిస్థితి లేదు, జనాలకు 4 ఛాయస్ లు ఉన్నాయి. ప్రభాస్ కి ఇది బ్యాడ్ లక్ అనే చెప్పొచ్చు.