https://oktelugu.com/

Bro Movie Release Date: బ్రో… మరీ ఇంత ఫాస్టా?

బ్రో విడుదలకు సిద్ధం అవుతుండగా... మరో మూడు చిత్రాలు పవన్ సెట్స్ పైకి తీసుకెళ్లారు. హరి హర వీరమల్లు నెక్స్ట్ షెడ్యూల్ మొదలు కావాల్సి ఉంది. ఇక దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్, సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఓజీ షూటింగ్ జరుపుకుంటున్నాయి. ఏక కాలంలో పవన్ కళ్యాణ్ మూడు చిత్రాల షూటింగ్స్ లో పాల్గొంటున్నారు.

Written By: , Updated On : May 31, 2023 / 09:27 AM IST
Bro Movie Release Date

Bro Movie Release Date

Follow us on

Bro Movie Release Date: రెండు నెలల క్రితం షూటింగ్ మొదలుపెట్టారు. అప్పుడే డబ్బింగ్ అంటున్నారు. పవన్ కళ్యాణ్ స్పీడ్ కి ఫ్యాన్స్ మతులు పోతున్నాయి. సముద్ర ఖని దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ బ్రో టైటిల్ తో సోషియో ఫాంటసీ మూవీ చేస్తున్నారు. ఇది వినోదయ సితం రీమేక్. తమిళంలో సముద్ర ఖని నటించి దర్శకత్వం వహించారు. ఆయన చేసిన పాత్ర తెలుగులో పవన్ కళ్యాణ్ చేస్తున్నారు. పవన్ ఇమేజ్ కి తగ్గట్టు స్క్రిప్ట్ లో మార్పులు చేశారు. ఆ బాధ్యత త్రివిక్రమ్ తీసుకున్నారు. మాటలు కూడా సమకూర్చారు.

ఈ చిత్ర షూటింగ్ ఊహించని స్థాయిలో పూర్తి చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ పాత్ర నిడివి కొంచెం తక్కువగా ఉంటుంది. సాయి ధరమ్ తేజ్ పూర్తి నిడివి కలిగిన పాత్ర చేస్తున్నారు. కేవలం రెండు మూడు నెలల క్రితం బ్రో మూవీ షూటింగ్ స్టార్ట్ అయ్యింది. అప్పుడే డబ్బింగ్ షురూ చేశారు. డబ్బింగ్ పూజా కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోలు విడుదల చేశారు. పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరో మూవీ ఆరు నెలల్లో పూర్తి చేసి విడుదల చేయడం మామూలు విషయం కాదు.

ఇక జులై 28న బ్రో మూవీని వరల్డ్ వైడ్ విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మించింది. థమన్ సంగీతం అందిస్తున్నారు. బ్రో మూవీ నుండి వస్తున్న ఒక్కో పోస్టర్ ఆసక్తి రేపుతోంది. అంచనాలు పెంచేస్తుంది. బ్రో అనే టైటిల్ సైతం ప్రేక్షకుల్లో ఒక క్యూరియాసిటీ పెంచింది. ప్రస్తుతం అందరూ బ్రో అని సంబోధిస్తుంటారు. సాధారణంగా సోదరుడు అనే మీనింగ్ కలిగిన ఈ పదం వెనుక చాలా పెద్ద భావమే ఉందని సమాచారం. అది సినిమాలో తెలియజేస్తారట.

బ్రో విడుదలకు సిద్ధం అవుతుండగా… మరో మూడు చిత్రాలు పవన్ సెట్స్ పైకి తీసుకెళ్లారు. హరి హర వీరమల్లు నెక్స్ట్ షెడ్యూల్ మొదలు కావాల్సి ఉంది. ఇక దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్, సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఓజీ షూటింగ్ జరుపుకుంటున్నాయి. ఏక కాలంలో పవన్ కళ్యాణ్ మూడు చిత్రాల షూటింగ్స్ లో పాల్గొంటున్నారు.