https://oktelugu.com/

Shriya Saran: వంగి వంగి పరువాలు ప్రదర్శిస్తున్న శ్రియ శరన్… వయసు పెరిగే కొద్దీ గ్లామర్ పెరుగుతుంది!

అక్కడ నుండి శ్రియ వెనక్కి తిరిగి చూసుకున్నది లేదు. సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ గా ఎదిగారు. చిరంజీవి, బాలకృష్ణ, రజినీకాంత్ ఇలా టాప్ స్టార్స్ అందరితో జతకట్టారు. ఈ తరం సూపర్ స్టార్స్ అయిన పవన్, మహేష్, ఎన్టీఆర్, లతో కూడా స్క్రీన్ షేర్ చేసుకున్నారు. రెండు తరాల స్టార్ హీరోల పక్కన నటించిన అరుదైన హీరోయిన్స్ లో శ్రియ ఒకరు.

Written By:
  • Shiva
  • , Updated On : May 31, 2023 / 09:19 AM IST

    Shriya Saran

    Follow us on

    Shriya Saran: మిలీనియం బిగినింగ్ లో చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టింది శ్రియ శరన్. వస్తూ వస్తూనే సంచలనాలు చేసింది. 2001లో విడుదలైన ఇష్టం శ్రియ మొదటి చిత్రం. ఇది పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. రెండో చిత్రమే స్టార్ పక్కన ఛాన్స్ కొట్టేసింది. నాగార్జున హీరోగా తెరకెక్కిన సంతోషం మూవీలో శ్రియ నటించారు. సంతోషం సూపర్ హిట్ కావడంతో వివి వినాయక్ చెన్నకేశవరెడ్డి మూవీలో బాలయ్యకు జోడీగా తీసుకున్నారు. చెన్నకేశవరెడ్డి మూవీ శ్రియకు స్టార్ ఇమేజ్ తెచ్చిపెట్టింది.

    అక్కడ నుండి శ్రియ వెనక్కి తిరిగి చూసుకున్నది లేదు. సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ గా ఎదిగారు. చిరంజీవి, బాలకృష్ణ, రజినీకాంత్ ఇలా టాప్ స్టార్స్ అందరితో జతకట్టారు. ఈ తరం సూపర్ స్టార్స్ అయిన పవన్, మహేష్, ఎన్టీఆర్, లతో కూడా స్క్రీన్ షేర్ చేసుకున్నారు. రెండు తరాల స్టార్ హీరోల పక్కన నటించిన అరుదైన హీరోయిన్స్ లో శ్రియ ఒకరు.

    కెరీర్ కొంచెం నెమ్మదించాక పెళ్లి చేసుకుంది. చాలాకాలంగా శ్రియ రష్యన్ అయిన ఆండ్రీని ప్రేమిస్తున్నారు. 2018లో నిరాడంబరంగా అతన్ని వివాహం చేసుకుంది. వీరికి ఒక అమ్మాయి. లాక్ డౌన్ సమయంలో సైలెంట్ గా ఒక పాపకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని పబ్లిక్ నుండి దాచారు. నాకు కూతురు పుట్టిందని తర్వాత చెప్పి షాక్ ఇచ్చింది. పరిశ్రమకు వచ్చి రెండు దశాబ్దాలు అవుతున్నా శ్రియకు ఆఫర్స్ తగ్గలేదు. హీరోయిన్ గా నటిస్తూనే ఉన్నారు.

    ఇటీవల ఆమె ప్రధాన పాత్రలో తెరకెక్కిన మ్యూజిక్ స్కూల్ అనే చిత్రం విడుదలైంది. పాన్ ఇండియా మూవీ కబ్జ లో మెయిన్ హీరోయిన్ గా నటించింది. సీనియర్ స్టార్ కి శ్రియ బెస్ట్ ఛాయిస్ అయ్యారు. మరోవైపు మోడలింగ్ చేస్తూ కోట్లు సంపాదిస్తున్నారు. తాజా ఫోటో షూట్ లో శ్రియ నాజూకు పరువాలు మతులు పోగొట్టేలా ఉంటున్నాయి. స్లీవ్ లెస్ ట్రెండీ వేర్ ధరించి అందాల విందు చేసింది. నాలుగు పదుల వయసు దాటిన శ్రియ గ్లామర్ చూస్తుంటే ఆమెకు వయసు పెరుగుతుందా, తగ్గుతుందా అనే డౌట్ వస్తుంది.