https://oktelugu.com/

Om Bheem Bush Review: ఓం బీమ్ బుష్ మూవీ రివ్యూ…

సామజవరగమణ అనే సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు ఇప్పుడు ఈ సినిమాతో మరోసారి రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శిలను కలుపుకొని 'ఓం బీమ్ బుష్ ' అనే సినిమాతో మన ముందుకు వచ్చాడు మరి ఈ సినిమా ఎలా ఉంది?

Written By:
  • Gopi
  • , Updated On : March 22, 2024 / 11:02 AM IST

    Om Bheem Bush Review

    Follow us on

    Om Bheem Bush Review: ఈమధ్య ముగ్గురు హీరోలతో వచ్చి కామెడీని పండించి సూపర్ సక్సెస్ అవుతున్న సినిమాలు చాలా ఉన్నాయి. అందులో శ్రీ విష్ణు హీరోగా వస్తున్నాడు అంటే ప్రేక్షకుల్లో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక రీసెంట్ గా సామజవరగమణ అనే సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు ఇప్పుడు ఈ సినిమాతో మరోసారి రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శిలను కలుపుకొని ‘ఓం బీమ్ బుష్ ‘ అనే సినిమాతో మన ముందుకు వచ్చాడు మరి ఈ సినిమా ఎలా ఉంది? ఈ సినిమాతో మరో సక్సెస్ వచ్చినట్టేనా లేదా అనే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

    కథ

    ఏ పనీపాటా లేకుండా తిరుగుతున్న ముగ్గురు( శ్రీ విష్ణు,రాహుల్ రామకృష్ణ , ప్రియదర్శి) యువకులు ఏదో ఒకటి చేసి చాలా గొప్ప రేంజ్ లో బతకాలని కోరుకుంటూ ఉంటారు. ఇక అందులో భాగంగానే ఒక యూనివర్సిటీ లో ప్రొఫెసర్ రంజిత్ దగ్గర పీహెచ్ డి చేయాలనుకుంటారు. కానీ అక్కడ అల్లరి అల్లరిగా చేస్తూ యునివర్సిటీ మొత్తాన్ని డిస్ట్రబ్ చేయడం తో ప్రొఫెసర్ రంజిత్ (శ్రీకాంత్ అయ్యంగార్) వాళ్ళని అక్కడి నుంచి తరిమికొడుతాడు…ఇక అక్కడి నుంచి వీళ్ళు భైరవ కొండ అనే గ్రామానికి వెళ్తుంటే అక్కడ కొంతమంది చేసే క్షుద్ర పూజలు వాళ్ళు చేసే పనుల గురించి తెలుసుకున్న ఈ ముగ్గురు భైరవ కొండ లో ఏం చేశారు…వాళ్ళు దర్జా గా ఎలా బతికారు అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది….

    విశ్లేషణ

    ఈ సినిమా విశ్లేషణ విషయానికి వస్తే, ఈ సినిమాను మొదటి నుంచి చివరి వరకు దర్శకుడు ఎంటర్ టైనర్ గా నడిపాడు. ముఖ్యంగా వీళ్ళ మధ్య కామెడీ సీన్లు నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయనే చెప్పాలి. ముఖ్యంగా వీళ్ల ముగ్గురి కాంబినేషన్ లో ఇంతకు ముందు బ్రోచేవారెవరురా అనే సినిమా వచ్చింది. ఇక ఆ సినిమాను మించి ఈ సినిమాలో కామెడీ ఉందనే చెప్పాలి…ఇక శ్రీ హర్ష కొత్త దర్శకుడు అయిన కూడా ఎక్కడ తడబడ కుండ సినిమాను చాలా హై లెవల్లో ముందుకు తీసుకెళ్ళాడు…ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో బాగంగా దీనిలో లాజిక్స్ లేవు అని చెప్పారు. కానీ సినిమాలో ప్రతి దానికి మంచి లాజిక్స్ సెట్ చేశారు. అయితే కొన్ని చోట్ల లాజిక్స్ అంత పర్ఫెక్ట్ గా సెట్ అవ్వనప్పటికి ఏదో ఒక రీజన్ తో ఆ లాజిక్ ను క్లోజ్ చేశారు…ఇక జాతిరత్నలు సినిమా ఎలాంటి హిలేరియస్ జానర్ లో వచ్చిందో ఇప్పుడు ఈ సినిమా కూడా అంతకు మించి అనేంత రేంజ్ ప్రేక్షకులకు వినోదాన్ని పంచింది. ఇక మొత్తానికైతే శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ లు ఎప్పటిలాగే సినిమా చూసే ప్రేక్షకుడి ని మేస్మరైజ్ చేశారు… ఇక మొత్తానికైతే ఈ సినిమా యూత్ ను ఎక్కువ అట్రాక్ట్ చేస్తుందనే చెప్పాలి.జాతిరత్నాలు సినిమాతో అనుదీప్ ఎలాంటి మ్యాజిక్ చేశాడో శ్రీ హర్ష కూడా ఈ సినిమాతో అదే మ్యాజిక్ చేశాడు…

    ఆర్టిస్టుల పర్ఫామెన్స్

    ఇక ఆర్టిస్ట్ ల పర్ఫామెన్స్ విషయానికి వస్తే శ్రీ విష్ణు,ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ముగ్గురు గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని అయితే లేదు. వీళ్లు స్క్రీన్ మీద ఉన్నంతసేపు ప్రతి ఒక ప్రేక్షకుడు వాళ్ల కామెడీ కి నవ్వుతూనే ఉంటారు. అలాగే వీళ్ళు కాంబినేషన్ కి బ్రోచేవారేవరు రా సినిమాతోనే మంచి క్రేజ్ వచ్చింది. ఇంకా అప్పటినుంచి ఇప్పటివరకు వరుసగా అదే క్రేజ్ ను మెయింటైన్ చేస్తూ వస్తున్నారు. ఇక ఈ జనరేషన్ లో దొరికిన మరొక గొప్ప నటుడు శ్రీకాంత్ అయ్యంగార్. ఒకటి అని కాదు ఎలాంటి పాత్ర అయిన ఈజీగా చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకోవడం లో ఈయన తరువాతే ఎవరైనా…ప్రతి పాత్ర లో ఔరా అనేలా నటించి మెప్పించాడు.ఇక అయేషా ఖాన్ తన పాత్ర పరిధి మేరకు నటించి మెప్పించింది. ఇక రచ్చ రవి చేసిన హంగామా కూడా చాలా బాగుంది…మిగిలిన ఆర్టిస్టులందరూ వాళ్ల పాత్ర పరిది మేరకు ఓకే అనిపించారు…

    టెక్నికల్ విషయాలు…
    ఇక టెక్నికల్ అంశాల విషయానికి వస్తే ఈ సినిమాకి మ్యూజిక్ అందించిన సన్నీ ఇచ్చిన సాంగ్స్ కొంతవరకు పర్లేదు బాగానే అనిపించాయి. ముఖ్యంగా కొన్ని ఎమోషనల్ సీన్స్ లో మాత్రం బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగా ఇచ్చాడనే చెప్పాలి. ఇంతకు ముందు సినిమాలకు సన్నీ ఇచ్చిన మ్యూజిక్ కంటే ఈ సినిమాలో ఇచ్చిన బ్యాగ్రౌండ్ స్కోర్ అయితే బావుంది. అలాగే రాజ్ తోట అందించిన విజువల్స్ కూడా సినిమాను నెక్స్ట్ లెవల్లో నిలిపాయనే చెప్పాలి. ఇక కొన్ని కామెడీ సీన్లను కూడా డిఫరెంట్ షాట్స్ లో తీసి ప్రేక్షకులకు కొత్త ఎక్స్పీరియన్స్ అయితే అందించాడు. ఇక రాజ్ తోట ఇంతకు ముందు చేసిన సినిమాలు కు ఏ మాత్రం తీసిపోకుండా ఈ సినిమాకి కూడా తన విజువల్స్ అందించడం అనేది సినిమాటోగ్రాఫర్ గా ఆయనను మరొక మెట్టు పైకెక్కిచ్చిందని చెప్పాలి. క్లైమాక్స్ లో ఆ పెళ్లి డ్రామా సిక్వెన్స్ లో ఆయన పెట్టిన షాట్స్ మాత్రం చాలా ఎక్స్ ట్రా ఆర్డినరీ గా ఉన్నాయనే చెప్పాలి. దానివల్ల సినిమాకి మంచి హైప్ అయితే వచ్చింది…ఇక ఈ సినిమా కి ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా రిచ్ గా ఉన్నాయనే చెప్పాలి…

    ప్లస్ పాయింట్స్

    కథ
    కొన్ని కామెడీ సీన్స్
    శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ…

    మైనస్ పాయింట్స్

    కొన్ని సీన్లు లాగ్ అయ్యాయి..
    అక్కడక్కడ లాజిక్స్ మిస్ అయ్యాయి…

    ఇక ఈ సినిమాకి మేము ఇచ్చే రేటింగ్ 2.75/5

    చివరి లైన్
    ఈ వీకండ్ ఫ్యామిలీ మొత్తం కలిసి ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేయవచ్చు…