New Investment: కాలం మారుతున్న కొద్దీ అవసరాలు పెరుగుతన్నాయి. ఈ క్రమంలో ఖర్చులు బోలెడవుతున్నారు. దీంతో వస్తున్న ఆదాయం పరిపోవడం లేదు. కొందరికి సరిపడ ఆదాయం వస్తున్నా.. భవిష్యత్ లో అత్యవసరం అయినప్పడు డబ్బు లేకపోతే తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయి. అందువల్ల వివిధ మార్గాల ద్వారా ఇన్వెస్ట్ మెంట్ చేసి డబ్బును ఆదా చేసుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ఈ ఇన్వెస్ట్ మెంట్ ఓ వైపు రిటర్న్స్ మరోవైపు ఇన్సూరెన్స్ ఉండే విధంగా ఉండాలంటున్నారు. ఇలా రెండు ప్రయోజనాలు ఉండే ఓ పెట్టుబడి గురించి తెలుసుకుందాం..
ప్రముఖ బ్యాంకుల్లో హెచ్ డీఎఫ్ సీ ఒకటి. ఈ బ్యాంకు కేవలం నదు వ్యవహారాలు మాత్రమే కాకుండా పలు పెట్టుబడులను కోరుతుంది. ముఖ్యంగా దీని నుంచి HDFC Life Midcap Moment Index Fund పెట్టుబడి ఇటీవల పాపులర్ అయింది. ఇందులో ఇన్వెస్ట్ మెంట్ చేయడం ద్వారా ఓ వైపు రిటర్న్స్ రావడమే కాకుండా మరోవైపు రిస్క్ కు కూడా ఉపయోగపడుతుంది. ఇందులో మినిమం రూ.2000… ఆ తరువాత ఎంతైనా ఇన్వెస్ట్ మెంట్ చేయొచ్చు.
అయితే ఇందులో పెట్టుబడి పెట్టాలంటే మార్చి 31 వరకు మాత్రమే అవకాశం ఉంది. ఆ తరువాత గడువు తీరనుంది. గత 5 సంవత్సరాల నుంచి మార్జిన్ 30 శాతానికి పైగా ఉంది. అందువల్ల కొంత మంది ఇన్వెస్ట్ దారులుదీనిని ఎక్కువగా రెఫర్ చేస్తున్నారు. భవిష్యత్ అవసరాలు దృష్టిలో ఉంచుకొని ఇందులో పెట్టుబడులు పెడితే కనీసం 5 సంవత్సరాల తరువాత బెస్ట్ రిటర్న్స్ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.
పెట్టుబడులపై ఇంట్రెస్ట్ ఉన్నవారికి ఇది మంచి అవకాశం అని అంటున్నారు. అయితే దీని గురించి పూర్తిగా తెలుసుకున్న తరువాతే ముందుకు వెళ్లాలి. అంతేకాకుండా వస్తున్న ఆదాయం సమతుల్యంగా ఉన్నప్పుడే ఇలాంటి వాటిపై ఆసక్తి చూపించాలి. లేకుంటే ఇబ్బందులు ఎదురవుతాయి.