https://oktelugu.com/

ఎన్టీఆర్ ప్రేమ కోసం చనిపోతుందట !

‘ఆర్ఆర్ఆర్‘లో ఎన్టీఆర్ కి జోడీగా హాలీవుడ్ బ్యూటీ ఓలివియా మోరిస్ నటిస్తోందంటేనే ఆమె రోల్ ఎంత కీలకమైనదో అర్ధం చేసుకోవచ్చు. అయితే తాజాగా ఎన్టీఆర్ – ఓలివియా లవ్ ట్రాక్ కు సంబంధించిన సీన్స్ గురించి ఒక ఆసక్తికరమైన మ్యాటర్ తెలిసింది. ఈ లాక్ డౌన్ గ్యాప్ లో ఎడిటర్ తమ్మిరాజు ఈ సీన్స్ ఎడిటింగ్ కూడా పూర్తి చేశారు. కాగా ఆయన ఎడిటింగ్ చేస్తోన్న క్రమంలో ఆ నోటా ఈ నోటా పాకి మొత్తానికి ఈ […]

Written By:
  • admin
  • , Updated On : August 9, 2020 / 05:12 PM IST
    Follow us on


    ఆర్ఆర్ఆర్‘లో ఎన్టీఆర్ కి జోడీగా హాలీవుడ్ బ్యూటీ ఓలివియా మోరిస్ నటిస్తోందంటేనే ఆమె రోల్ ఎంత కీలకమైనదో అర్ధం చేసుకోవచ్చు. అయితే తాజాగా ఎన్టీఆర్ – ఓలివియా లవ్ ట్రాక్ కు సంబంధించిన సీన్స్ గురించి ఒక ఆసక్తికరమైన మ్యాటర్ తెలిసింది. ఈ లాక్ డౌన్ గ్యాప్ లో ఎడిటర్ తమ్మిరాజు ఈ సీన్స్ ఎడిటింగ్ కూడా పూర్తి చేశారు. కాగా ఆయన ఎడిటింగ్ చేస్తోన్న క్రమంలో ఆ నోటా ఈ నోటా పాకి మొత్తానికి ఈ సీన్స్ తాలూకు కంటెంట్ ఫిల్మ్ సర్కిల్స్ లో తెగ హల్ చల్ చేస్తోంది. ఎన్టీఆర్ – ఒలివియా లవ్ ట్రాక్ లో ఎక్కడా ఇద్దరి మధ్య సింగిల్ డైలాగ్ కూడా ఉండదట.. అంటే వారి మధ్య చోటు చేసుకున్న సంఘటనలతోనే ఓలివియా, ఎన్టీఆర్ పై ఘాడమైన ప్రేమను పెంచుకుంటుందని.. ఎన్టీఆర్ పాత్రకు మాత్రం ఆమె పై ఎలాంటి ఫీలింగ్స్ ఉండవని తెలుస్తోంది.

    Also Read: హాట్‌ బ్యూటీ.. హారర్ వెబ్‌ సిరీస్‌

    అన్నట్టు చివరికీ ఓలివియా, ఎన్టీఆర్ మీద ప్రేమతోనే భారత దేశం కోసం ప్రాణాలు కూడా ఇస్తుందట. మొత్తానికి ఎన్టీఆర్ – ఓలివియా ట్రాక్ మొత్తంలోనే టాకీ పార్ట్ లేకుండా, రాజమౌళి లవ్ స్టోరీని చాల కొత్తగా ఎమోషనల్ గా ప్లాన్ చేశాడు అన్నమాట. ఇక ఈ సినిమాలో తెలంగాణ యాసలో తారక్ పలికే డైలాగ్ లు కూడా అద్భుతంగా వచ్చాయట. డైలాగ్ చెప్పడంలో ఎన్టీఆర్ కి ఉన్న వాయిస్ కమాండ్ కి తోడు తెలంగాణలోని యాస కూడా డైలాగ్ లకు మరింత అందాన్ని తీసుకొచ్చిందట. ఇక ఎన్టీఆర్ పుట్టిన రోజుకు మిస్ అయిన తారక్ ఫస్ట్ లుక్ వీడియో కోసం తారక్ ఫాన్స్ తో పాటు యావత్తు ప్రేక్షక లోకం ఎంతగానో ఎదురు చూస్తోంది.

    Also Read: అవార్డు విన్నింగ్‌ డైరెక్టర్​తో రాజశేఖర్ మూవీ?

    కాగా ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజులా, తారక్ కొమరంభీంలా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా 80% షూట్ పూర్తి చేసుకున్నా… మిగిలిన షూటింగ్ పూర్తి చేయడానికి మరో రెండు నెలలు టైం పడుతుంది. ప్రస్తుతం రాజమౌళి కరోనా నుండి కోలుకుంటున్నారు. ఏమైనా ‘బాహుబలి’ సిరీస్ తర్వాత జక్కన్న నుండి వస్తున్న చిత్రం కావడంతో ప్రేక్షకులు ఈ సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమాలో ఇతర ముఖ్యమైన పాత్రల్లో అజయ్ దేవగన్, సముద్రఖని, శ్రీయా నటిస్తుండగా.. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు.