కరోనా సమయంలోనూ ముదురు పోయిన మన హీరోలు పెళ్లిళ్ల హడావుడిలో పడిపోయారు. ఎలాగూ ఖాళీగా ఉన్నాం కదా అని పెళ్లి పీటలెక్కేస్తున్నారు. దగ్గుబాటి వారసుడుగా నేషనల్ లెవల్లో క్రేజ్ తెచ్చుకున్న రానా నిన్న పెళ్లి చేసుకున్నాడు. మొత్తానికి తాను కోరి ప్రేమించిన మిహీక బజాజ్ ను వివాహం చేసుకున్నాడు. అయితే పెళ్లితో రానా హ్యాపీ అయినా రానాతో సినిమా చేస్తోన్న ఓ చిత్రబృందానికి మాత్రం కాస్త ఇబ్బంది కలిగేలా ఉంది. ‘నీది నాది ఒకే కథ’ అనే చిన్న సైజు కథలో కొత్త సంఘర్షణను జోడించి మంచి విజయాన్ని అందుకున్న డైరెక్టర్ ‘వేణు ఉడుగుల’ దర్శకత్వంలో రానా, సాయిపల్లవి హీరోహరోయిన్లుగా వస్తోన్న సినిమా ‘విరాటపర్వం‘.
Also Read: హాట్ బ్యూటీ.. హారర్ వెబ్ సిరీస్
కరోనా రాకపోయి ఉంటే ఈ పాటికే ఈ సినిమా రిలీజ్ అయిపోయేది. కానీ కరోనా దెబ్బతో సినిమా మధ్యలో ఆగింది. ఇప్పుడు పెళ్లి కారణంగా రానా ఈ ఏడాది మొత్తం షూటింగ్స్ కి గ్యాప్ ఇచ్చేశాడు. ఈ మేరకు ఇప్పటికే డైరెక్టర్ కి కూడా క్లారిటీ ఇచ్చాడు. పైగా వచ్చే ఏడాది స్టార్టింగ్ లో కూడా ఈ సినిమా కోసం రానా డేట్స్ ఇచ్చే పరిస్థితి లేదట. ఆల్ రెడీ ఒప్పుకున్న ఓ హిందీ సినిమాతో పాటు మరో తెలుగు సినిమాకి డేట్స్ ముందుగా ఇవ్వాలట. ఆ సినిమాల షూటింగ్స్ వ్యవహారం ముగిశాక.. తిరగ్గా విరాటపర్వంకు వస్తాడట రానా. అంటే దాదాపు మరో సంవత్సరం దాకా విరాటపర్వం ఖాళీనే. దానికితోడు విరాటపర్వంను నమ్ముకునోళ్లు కూడా ఖాళీగా కూర్చోవాలి. పాపం ఒకవేళ కరోనా తగ్గినా కూడా విరాటపర్వం టీమ్ కి మాత్రం షూటింగ్ చేసుకునే అవకాశం లేదు.
Also Read: కరోనా జయించిన బిగ్‌బీ కుటుంబం..
ఇక పొలిటికల్ పీరియాడిక్ థ్రిల్లర్ గా రానున్న ఈ సినిమాలో కొత్త కోణాలు చాలా ఉన్నాయని మెయిన్ గా రానా పాత్రలో కొంత నెగిటివ్ యాంగిల్ ఉంటుందని, అది సినిమాలో హైలైట్ గా అనిపిస్తోందని తెలుస్తోంది. కాగా తెలంగాణ ప్రాంతంలోని 1980 – 90 నాటి సామాజిక పరిస్థితుల ఆధారం చేసుకుని ఈ కథను రాసుకున్నాడట వేణు ఉడుగుల. సినిమాలో ఆ నాటి దళారుల వ్యవస్థను కళ్లకు కట్టినట్టు చూపించబోతున్నారు. అన్నట్టు డి. సురేష్‌బాబు, సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాలో బాలీవుడ్ ఫేమస్ నటి నందితా దాస్, ఈశ్వరీరావు, జరీనా వహాబ్ తో పాటు ప్రియమణి కూడా ఒక కీలక పాత్రలో నటిస్తోంది.