https://oktelugu.com/

విశాఖకు రాజధాని: జగన్ కు షాకిచ్చిన సొంత పత్రిక సర్వే?

విశాఖపట్నం పరిపాలన రాజధానిగా చేయాలన్నది సీఎం జగన్ చిరకాల స్వప్నం. దాని కోసం ఆయన పంతం పట్టారు. ఎన్ని విభేదాలు వచ్చినా.. ప్రతిపక్ష నేత చంద్రబాబు వ్యతిరేకించినా.. ప్రజలు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నా.. హైకోర్టులు అడ్డుకుంటున్నా మొక్కవోని దీక్షతో ముందుకెళ్తున్నారు. Also Read: అదే జరిగి ఉంటే విజయవాడ స్వర్ణ ప్యాలెస్ లో ఎంతో మంది బ్రతికేవారు..! మూడు రాజధానుల బిల్లును గవర్నర్ ఆమోదించడంతో ఇప్పుడు జగన్ వడివడిగా విశాఖ రాజధానిగా అడుగులు వేస్తున్నారు. ఆగస్టు 16న […]

Written By:
  • NARESH
  • , Updated On : August 9, 2020 / 05:25 PM IST
    Follow us on


    విశాఖపట్నం పరిపాలన రాజధానిగా చేయాలన్నది సీఎం జగన్ చిరకాల స్వప్నం. దాని కోసం ఆయన పంతం పట్టారు. ఎన్ని విభేదాలు వచ్చినా.. ప్రతిపక్ష నేత చంద్రబాబు వ్యతిరేకించినా.. ప్రజలు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నా.. హైకోర్టులు అడ్డుకుంటున్నా మొక్కవోని దీక్షతో ముందుకెళ్తున్నారు.

    Also Read: అదే జరిగి ఉంటే విజయవాడ స్వర్ణ ప్యాలెస్ లో ఎంతో మంది బ్రతికేవారు..!

    మూడు రాజధానుల బిల్లును గవర్నర్ ఆమోదించడంతో ఇప్పుడు జగన్ వడివడిగా విశాఖ రాజధానిగా అడుగులు వేస్తున్నారు. ఆగస్టు 16న ప్రధాని నరేంద్రమోడీతో విశాఖ రాజధాని శంకుస్థాపన కార్యక్రమం చేయాలని జగన్ ఆలోచిస్తున్నారు.

    అయితే ఈ క్రమంలోనే సీఎం జగన్ కు చెందిన సొంత పత్రిక విశాఖ రాజధానిపై ప్రజాభిప్రాయం సేకరించిందట.. ఒక ప్రైవేట్ ఏజెన్సీతో కలిసి సర్వే చేస్తే అందులో ఆశ్చర్యకర ఫలితాలు వచ్చాయని మీడియా సర్కిల్స్ లో చర్చించుకుంటున్నారు.

    విశాఖలో రాజధాని ఏర్పాటుపై జగన్ సొంత పత్రిక సర్వే చేస్తే అందులో ఏకంగా 62శాతం ప్రజలు వ్యతిరేకించారని సమాచారం. ఇదే విషయాన్ని మాజీ ఎంపీ సబ్బం హరి కూడా వెల్లడించడం విశేషం.

    Also Read: మోడీ ని జగన్ కోరిన మూడు కోరికలు ఇవే…?

    ఈ సర్వేలో సచివాలయం మినహా విశాఖకు వచ్చేది ఏమీ లేదన్న భావన ప్రజల్లో ఉందని తేటతెల్లమైందట.. దీంతో విశాఖ రాజధానిపై అక్కడ ప్రజా బ్యాలెట్ నిర్వహిస్తే ఫలితం జగన్ కు వ్యతిరేకంగా వచ్చే అవకాశాలున్నాయంటున్నారు.

    జగన్ సొంత పత్రిక సర్వే ఫలితం చూస్తే నిజంగానే వైసీపీ ప్రభుత్వం ఇరుకునపడ్డట్టు అవుతుంది. అందుకే దీన్ని పెద్దగా బయటకు ప్రొజెక్ట్ చేయడం లేదని సమాచారం. సర్వేను బట్టి చూస్తే జగన్ ఆశపడినా విశాఖ రాజధాని ఆ ప్రాంతవాసులకే ఇష్టం లేదని అర్థమవుతోంది. ఇప్పుడు ఇదే విషయాన్ని ప్రతిపక్ష టీడీపీ అనుకూలంగా మలుచుకొని జగన్ ను ఇరుకునపెడుతోంది.