https://oktelugu.com/

Old Actress Vijayalakshmi: భారత ప్రధాని కోరిక తీర్చిన నటి

Old Actress Vijayalakshmi: నటి ‘విజయలక్ష్మి’ 1960వ దశకంలో వెండి తెరపై ఓ వెలుగు వెలిగారు. సినిమా నటిగానే కాకుండా, భరతనాట్య కళాకారిణిగా కూడా ఆమె ట్రాక్ రికార్డు అనితరసాధ్యం. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో వందకు పైగా సినిమాల్లో ఆమె నటించింది. ఆమె అంటే ఎన్టీఆర్ సైతం ఎంతో గౌరవం ఉండేవారు. ‘విజయలక్ష్మి’ గారు ప్రత్యేకమైన వ్యక్తి అని అక్కినేని కూడా ఆమెను అభిమానించేవారు. అలాంటి ‘విజయలక్ష్మి’ గారి గురించి ఈ తరానికి చెప్పాలన్నదే […]

Written By:
  • Shiva
  • , Updated On : May 5, 2022 / 04:46 PM IST
    Follow us on

    Old Actress Vijayalakshmi: నటి ‘విజయలక్ష్మి’ 1960వ దశకంలో వెండి తెరపై ఓ వెలుగు వెలిగారు. సినిమా నటిగానే కాకుండా, భరతనాట్య కళాకారిణిగా కూడా ఆమె ట్రాక్ రికార్డు అనితరసాధ్యం. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో వందకు పైగా సినిమాల్లో ఆమె నటించింది. ఆమె అంటే ఎన్టీఆర్ సైతం ఎంతో గౌరవం ఉండేవారు. ‘విజయలక్ష్మి’ గారు ప్రత్యేకమైన వ్యక్తి అని అక్కినేని కూడా ఆమెను అభిమానించేవారు. అలాంటి ‘విజయలక్ష్మి’ గారి గురించి ఈ తరానికి చెప్పాలన్నదే మా ప్రయత్నం.

    Old Actress Vijayalakshmi

    ‘విజయలక్ష్మి’ సినీ ప్రయాణం :

    విజయలక్ష్మి తన తొమ్మిదేళ్ల వయసులో ఆంధ్రప్రదేశ్‌లోని ఓ దేవాలయంలో తొలిసారి ప్రదర్శన ఇచ్చారు . అలాగే 1955లో విజయలక్ష్మి గారు సాంస్కృతిక సంస్థ అయిన రసిక రాజ్యసభలో కూడా అరంగేట్రం చేశారు. విజయలక్ష్మి గారిది సంపన్న కుటుంబం కాదు. మొదట్లో అనేక ప్రదర్శనల కోసం ఆమె ఒకే దుస్తులను ధరించారు. అయినా ఆమె ఎంతో ఇష్టంగా నాట్యం చేసేవారు. మీకు తెలుసా ? కేవలం విజయలక్ష్మి గారికి సరైన భరతనాట్యం గురువు కోసం, ఆమె కుటుంబం పూణే నుంచి చెన్నై తరలి వెళ్ళింది. నాట్యం అంటే.. ఆమెకు ఆ స్థాయి ఇష్టం. ఆ నాట్యమే ఆమెను హీరోయిన్ని చేసింది. విజయలక్ష్మి మొదట కొన్ని మలయాళ సినిమాల్లో నటించారు. ఆ తర్వాత తమిళ చిత్రాల్లో MG రామచంద్రన్, శివాజీ గణేశన్, జెమినీ గణేశన్ వంటి నటులతో కూడా విజయలక్ష్మి నటించారు. ఈ క్రమంలోనే “ఆలుక్కోరు వీడు” సినిమాలో విజయలక్ష్మి నటించారు. తమిళంలో ఉత్తమ చలనచిత్రంగా జాతీయ చలనచిత్ర అవార్డును సైతం ఈ చిత్రం గెలుచుకుంది. ఈ చిత్రంలో విజయలక్ష్మి నటనకు అప్పటి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు.

    Also Read: Superstar Krishna: తెలుగు మొదటి పాన్ ఇండియా స్టార్ ఆయనే !

    ‘విజయలక్ష్మి’ వ్యక్తిగత జీవితం :

    1969లో విజయలక్ష్మి తన సోదరుడి స్నేహితుడు, ఫిలిప్పీన్స్‌లో పనిచేస్తున్న వ్యవసాయ శాస్త్రవేత్త ‘సురజిత్ కుమార్ డి దత్తా’ను వివాహం చేసుకుంది. వివాహమైన తర్వాత, విజయలక్ష్మి ప్రైవేట్ అభ్యర్థిగా బెనారస్ హిందూ మెట్రిక్యులేషన్ పరీక్షకు హాజరైంది. ఆ తర్వాత ఆమె కరస్పాండెన్స్ ద్వారా మద్రాసు విశ్వవిద్యాలయంలో BSc పూర్తి చేసింది. 1969లో , ఆమె ఫిలిప్పీన్స్‌లోని మనీలాకు కూడా వెళ్లింది .

    Old Actress Vijayalakshmi:

    భారత ప్రధాని కోరికను మన్నించిన విజయలక్ష్మి :

    1977లో, మొరార్జీ దేశాయ్ భారత ప్రధానిగా ఉన్నారు. ఆ సమయంలో విజయలక్ష్మి భారత రాయబార కార్యాలయాన్ని సందర్శించారు. అయితే, మొరార్జీ దేశాయ్ ఓ కార్యక్రమంలో విజయలక్ష్మిని డ్యాన్స్ చేయమని కోరారు. ఆమె నాట్యం అంత గొప్పగా ఉండేది. భారత ప్రధాని సైతం ఆమెను అభిమానించేవారు.

    సినీ నటి నుంచి అమెరికాలో బడ్జెట్ అధికారిగా..

    Old Actress Vijayalakshmi:

    విజయలక్ష్మి గారు 1991లో అమెరికా వెళ్లారు. ఆమె మొదట అక్కడ ఆడిటర్‌గా జాయిన్ అయ్యారు. ఆ తర్వాత వర్జీనియా పాలిటెక్నిక్ విశ్వవిద్యాలయంలో బడ్జెట్ అధికారిగా కూడా ఉద్యోగం పొందారు. పైగా ఆమె వర్జీనియా పాలిటెక్నిక్ ఇన్‌స్టిట్యూట్ లో అకౌంటింగ్, అలాగే CPA (భారతదేశంలో CAకి సమానమైన సర్టిఫైడ్ పబ్లిక్ అకౌంటింగ్)లో కూడా ఆమె మాస్టర్స్ చదివారు.

    తల్లిగా కూడా విజయలక్ష్మి విజయం :

    విజయలక్ష్మి గారు గొప్ప తల్లి కూడా. ఆమె ఏకైక కుమారుడికి సిలికాన్ వ్యాలీలో సాఫ్ట్‌వేర్ కంపెనీ ఉంది. తన కుమారుడి విజయంలో విజయలక్ష్మి గారి పాత్ర ఎంతో ఉంది. ఏది ఏమైనా తన జీవిత గమనంలో ఆమె ఎన్నో ప్రతికూలతలను దాటుకుని.. విజయలక్ష్మి గారు ఎంతో గొప్ప స్థాయికి వెళ్లారు.

    Also Read:BJP Leader Arrested: పేకాట ఆడుతూ మహిళలతో పట్టుబడ్డ బీజేపీ నేత

    Tags