https://oktelugu.com/

Superstar Krishna: తెలుగు మొదటి పాన్ ఇండియా స్టార్ ఆయనే !

Superstar Krishna: పాన్ ఇండియా స్టార్ అనిపించుకోవాలని ఇప్పుడేదో మన కుర్ర హీరోలు పోటీ పడుతున్నారు గానీ, అసలు పాన్ ఇండియా సినిమా చేసిన మొట్టమొదటి హీరో మన తెలుగు హీరోనే అని చాలామందికి తెలియదు. ‘సాహసం నా ఊపిరి’ అంటూ ఎన్నో ప్రయోగాలకు ఎప్పుడూ ముందు ఉండే సూపర్ స్టార్ కృష్ణ 50 సంవత్సరాల క్రితమే పాన్ ఇండియాకు తెలుగు సినిమా పవరేంటో చూపించాడు. సూపర్ స్టార్ కృష్ణకే కాదు, నిజానికి ఆ రోజుల్లో తెలుగు […]

Written By:
  • Shiva
  • , Updated On : May 5, 2022 / 04:56 PM IST
    Follow us on

    Superstar Krishna: పాన్ ఇండియా స్టార్ అనిపించుకోవాలని ఇప్పుడేదో మన కుర్ర హీరోలు పోటీ పడుతున్నారు గానీ, అసలు పాన్ ఇండియా సినిమా చేసిన మొట్టమొదటి హీరో మన తెలుగు హీరోనే అని చాలామందికి తెలియదు. ‘సాహసం నా ఊపిరి’ అంటూ ఎన్నో ప్రయోగాలకు ఎప్పుడూ ముందు ఉండే సూపర్ స్టార్ కృష్ణ 50 సంవత్సరాల క్రితమే పాన్ ఇండియాకు తెలుగు సినిమా పవరేంటో చూపించాడు. సూపర్ స్టార్ కృష్ణకే కాదు, నిజానికి ఆ రోజుల్లో తెలుగు సినిమాకి కూడా పాన్ ఇండియా స్థాయిలో పెద్దగా మార్కెట్ లేదు. పైగా అప్పటి కాలంలో తెలుగు సినిమాకి అంత ప్రభావం కూడా లేదని అంటారు.

    Superstar Krishna

    కొన్ని గొప్ప క్లాసిక్ చిత్రాలు తెలుగులో వచ్చినప్పటికీ ‘మాయాబజార్, మిస్సమ్మ, గుండమ్మ కథ’ లాంటి మంచి చిత్రాలకు ఇతర భాషల్లో కూడా మంచి ఆదరణ లభించినప్పటికీ.. ఎందుకో ఆ సినిమాలకు పాన్ ఇండియా మూవీస్ అనే క్రెడిట్ మాత్రం దక్కలేదు. అలాంటి పరిస్థితుల్లో ఒ క తెలుగు హీరో, పాన్ ఇండియా సినిమా చేయాలని నిర్ణయించుకోవడం, అన్నిటికి మించి అలాంటి సినిమాని తానే నిర్మించాలనుకోవడం అంటే.. గొప్ప సాహసం అనే చెప్పాలి. కృష్ణ తన ‘శ్రీ పద్మాలయా మూవీస్ బ్యానర్‌’ పై తానే హీరోగా నిర్మించిన చిత్రం ‘మోసగాళ్లకు మోసగాడు’. ఒక విధంగా ‘పద్మాలయ బ్యానర్ యొక్క అత్యంత ప్రతిష్టాత్మక చిత్రంగా ‘మోసగాళ్లకు మోసగాడు’ సినిమా నిలిచింది.

    Also Read: Old Actress Vijayalakshmi: భారత ప్రధాని కోరిక తీర్చిన నటి

    అలాగే ఈ చిత్రంతో ప్రపంచ ప్రఖ్యాత బ్యానర్లలో పద్మాలయా కూడా ఒకటిగా నిలిచింది. అసలు ఈ సినిమా చేయడం వెనుక ఒక ఆసక్తికరమైన సంఘటన జరిగిందట. ఒక ఇంగ్లీష్ సినిమాని అప్పటి ప్రముఖ నిర్మాత యమ్.ఎస్ రెడ్డితో కలిసి చూస్తున్నారట కృష్ణ. ఇలాంటి సినిమాని తెలుగులో కూడా చేయాలి అన్నారట కృష్ణ. దానికి ఆ నిర్మాత ఫక్కున నవ్వి ‘ఎందుకు ఉన్నవి అమ్ముకోవడానికా ?’ అంటూ కాస్త వ్యంగ్యంగా నవ్వాడట.

    Superstar Krishna

    అది మనసులో పెట్టుకున్న కృష్ణ, ఎలాగైనా ఇండియన్ స్క్రీన్‌పై మొట్టమొదటి కౌబాయ్ చిత్రం తానే నిర్మించాలనుకుని పట్టుబట్టి ‘మోసగాళ్లకు మోసగాడు’ సినిమాని తీశారు. ఈ చిత్రం 1971 ఆగస్టు 27న తెలుగులోనే కాకుండా ఇంగ్లీష్, స్పానిష్, రష్యన్, తమిళం, మలయాళం, హిందీ, బెంగాలీతో పాటు మరికొన్ని ఇతర భాషలలో విడుదలై ఘనవిజయం సాధించింది. అలా పాన్ ఇండియా చిత్రాన్ని.. 50 సంవత్సరాల క్రితమే సూపర్‌స్టార్ కృష్ణ చేశారు. అందుకే, కృష్ణ అవసరం అయితే.. మాట్లాడుతూ ఉంటారు. ఏది ఏమైనా అవసరం అయితే.. ఏది ఏమైనా ఇది విచిత్రం.. విశేషము

    Also Read:Rajamouli-Pawan Kalyan movie: రాజమౌళి-పవన్ కళ్యాణ్ మూవీ ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

    Tags