BJP Leader Arrested: హైదరాబాద్ నగరం విస్తరిస్తోంది. అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారుతోంది. డ్రగ్స్ మాఫియాకు అడ్డాగా రూపుదిద్దుకుంటోంది. రోజుకో కేసు వెలుగులోకి వస్తోంది. ఇటీవల నగరంలో డ్రగ్స్ పట్టుబడటంతో సెలబ్రిటీల బాగోతం వెలుగులోకి వచ్చినా వారిపై చర్యలు తీసుకోవడంలో మీనమేషాు లెక్కించారు. ఫలితంగా కేసు కొలిక్కి రాకుండా పోయింది. అంతర్జాతీయ స్రమాణాలతో అభివృద్ధ చెందుతున్న నగరం దినదినం విస్తరిస్తోంది.
హైదరాబాద్ మహానగరంగా రూపుదిద్దుకుంటున్న క్రమంలో చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు వేదికగా అవుతోంది. పోలీసులు ఎన్ని ఆంక్షలు విధించినా డ్రగ్స్ మాఫియా మాత్రం రెక్కలు విప్పుతోంది. డ్రగ్స్ కు చాలా మంది బలైపోతున్నారు. కళాశాల విద్యార్థులు సైతం డ్రగ్స్ దందాలో దిగుతూ విలువైన ప్రాణాలు తీసుకుంటున్నారు. ఫలితంగా తల్లిదండ్రులకు వేదనలే మిగుల్చుతున్నారు.
Also Read: CM Jagan and Roja Tongue Slip : సీఎం జగన్, రోజా టంగ్ స్లిప్.. వీళ్లకు జర తెలుగు నేర్పండయ్యా!
హైరరాబాద్ నడిబొడ్డున ఉన్న బంజారాహిల్స్ లోని రోడ్ నెం. 2లో పేకాట క్లబ్ నిర్వహిస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. రకరకాలు నేరాలకు కేరాఫ్ అడ్రస్ గా మారుతోంది. డ్రగ్స్ మాఫియానే కాకుండా పేకాట స్థావరంగా కూడా తన పరిధి విస్తరిస్తోంది. నగరం మధ్యలో ఉన్నా యథేచ్ఛగా పేకాట ఆడుతున్నారు. పోలీసులు జరిపిన దాడుల్లో 12 మంది పట్టుబడటం విశేషం. ఇందులో ఆరుగురు మహిళలు, ఆరుగురు పురుషులు ఉన్నారు. అందులో బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన బండపల్లి సతీష్ కూడా ఉండటం సంచలనం సృష్టిస్తోంది.
సాధారణంగా శివారు ప్రాంతాల్లో పేకాట ఆటలు కామనే. కానీ నగరం నడిబొడ్డున పేకాట ఆడుతుండటం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. వారి నుంచి రూ. 17.75 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఏకంగా ఓ ప్లాట్ నే పేకాట స్థావరంగా ఏర్పాటు చేసుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఆరా తీస్తున్నారు. పేకాట ఆడుతూ పట్టుబడిన వారి వివరాలు సేకరిస్తున్నారు. నగరం మధ్యలో ఇంత ధైర్యంగా పేకాడుతున్న వారికి ఎవరి మద్దతు ఉందనే దానిపై కూపీ లాగుతున్నారు.
Also Read: TV9 vs Vishwak Sen: విశ్వక్ సేన్ వర్సెస్ టీవీ9.. ట్రోలింగ్ వీడియోలతో పండుగ చేసుకుంటున్న నెటిజన్లు