OG Worldwide Pre Box Office Business: భారీ అంచనాల నడుమ నెల రోజుల క్రితం విడుదలైన పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) చిత్రం కమర్షియల్ గా పెద్ద డిజాస్టర్ గా నిల్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఫ్లాప్ ఎఫెక్ట్ మరో రెండు నెలల్లో విడుదల కాబోతున్న పవన్ కళ్యాణ్ ఓజీ చిత్రం పై పడుతుందని, ఆ సినిమా బిజినెస్ తగ్గుతుందని అంతా అనుకున్నారు. కానీ ‘హరి హర వీరమల్లు’ ప్రభావం ఓజీ(They Call Him OG) చిత్రం పై ఇసుమంత కూడా పడలేదని రీసెంట్ గా జరిగిన ఓజీ మూవీ థియేట్రికల్ బిజినెస్ చూస్తే అర్థం అవుతుంది. ఒక్క నైజాం ప్రాంతం లోనే చిత్రం 72 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది. ఒక భారీ ఫ్లాప్ తర్వాత నైజాం ప్రాంతం లో ఇంత మొత్తానికి అమ్ముడుపోవడం సాధ్యమయ్యే విషయం కాదు. కానీ మంచి హైప్ ఉన్న పవన్ కళ్యాణ్ సినిమాకు ఇలాంటి అడ్డంకులు ఏమి ప్రభావం చూపలేవని అంటున్నారు.
‘హరి హర వీరమల్లు’ చిత్రం నైజాం లో ప్రీమియర్ షోస్ ఏ రేంజ్ హాట్ కేక్ లాగా అమ్ముడుపోయాయో ప్రతీ ఒక్కరు చూసారు. మరో గంటలో ప్రీమియర్ షోస్ ఉంటాయి అనగా, ఇప్పుడు బుకింగ్స్ ప్రారంభించి 5 కోట్ల 30 గ్రాస్ వసూళ్లను రాబట్టారు. అందుకే పవన్ కళ్యాణ్ నైజాం మార్కెట్ కి అంత కేఈ ఉంటుంది. కేవలం ఒక్క నైజాం లోనే కాదు, మిగిలిన ప్రాంతాల్లో కూడా ఇదే రేంజ్ బిజినెస్ జరిగింది. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాలకు కలిపి 170 కోట్ల రూపాయలకు పైగా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగిందట. అదే విధంగా కర్ణాటకలో 15 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయిన ఈ చిత్రం, ఓవర్సీస్ లో 60 కోట్లకు అమ్ముడుపోయిందట. ఓవరాల్ గా తెలుగు వెర్షన్ బిజినెస్ 250 కోట్లకు జరిగిందని, అన్ని వెర్షన్స్ కి కలిపి 300 కోట్ల రూపాయలకు జరిగి ఉంటుందని అంటున్నారు.
మరో పక్క ఈ సినిమాకు సంబంధించిన నార్త్ అమెరికా మరియు ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ ఈ నెల 29 నుండి మొదలు కానుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా జరిగింది. ఓవర్సీస్ లో ఈ చిత్రానికి విపరీతమైన క్రేజ్ ఉండడంతో, ఆల్ టైం ఇండస్ట్రీ రికార్డు ని నెలకొల్పే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు ట్రేడ్ పండితులు. మరి ఈ సినిమాకు అంత సత్తా ఉందా లేదా అనేది తెలియాలంటే మరో మూడు రోజులు ఆగాల్సిందే. ఇకపోతే ఈ చిత్రానికి సంబంధించిన మొదటి పాటకు ఎంతటి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిందో మనమంతా చూసాము. రెండవ పాట ‘సువ్వి సువ్వి’ వినాయక చవితి సందర్భంగా ఈ నెల 27 న విడుదల కాబోతుంది.