Coolie Total World Wide Collections: కచ్చితంగా భారీ బ్లాక్ బస్టర్స్ అవుతాయి, కలెక్షన్స్ పరంగా ఎవ్వరూ ఊహించని బెంచ్ మార్క్స్ క్రియేట్ అవుతాయి అనుకున్న ఎన్నో క్రేజీ కాంబినేషన్ చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఫలితాలను సొంతం చేసుకోలేక డీలా పడుతుండడం ఈమధ్య కాలం లో తరచూ చూస్తూనే ఉన్నాం. ఆ జాబితాలో సూపర్ స్టార్ రజినీకాంత్(Super Star Rajinikanth) కూలీ(Coolie Movie) చిత్రం కూడా చేరిపోతుందని ఎవ్వరూ ఊహించలేకపోయారు. లోకేష్ కనకరాజ్(Lokesh Kanagaraj) దర్శకత్వం, అనిరుద్(Anirudh Ravichander) సంగీత దర్శకత్వం, అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) విలన్, అమీర్ ఖాన్(Aamir Khan) కీలక పాత్ర, ఇలా ఇంత పెద్ద భారీ తారాగణం తో తెరకెక్కిన ఈ సినిమా ఫ్లాప్ అవుతుందని ఎవరూ మాత్రం ఊహిస్తారు చెప్పండి. కేవలం ఒకటి రెండు ప్రాంతాల్లో మినహా ఈ సినిమా అన్ని ప్రాంతాల్లోనూ బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవడం లో విఫలం అయ్యింది. కానీ హిందీ లో మాత్రం భారీ బ్లాక్ బస్టర్ గా నిల్చింది.
11 రోజుల్లో 480 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రానికి హిందీ లో మొదటి రోజు నుండి 11 వ రోజు వరకు ఎంత వసూళ్లు వచ్చాయో ఒకసారి చూద్దాం. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం మొదటి రోజు 5 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం, రెండవ రోజు 7 కోట్ల 40 లక్షలు, మూడవ రోజు 5 కోట్ల 24 లక్షలు, నాల్గవ రోజు 5 కోట్ల 67 లక్షల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చాయి. అలా మొదటి వీకెండ్ లో 23 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రానికి, మొదటి వారం లో 29 కోట్ల 39 లక్షల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా సెకండ్ వీకెండ్ లో 7 కోట్ల 92 లక్షల రూపాయిలు రాబట్టిన ఈ సినిమాకు, ఓవరాల్ గా 11 రోజుల హిందీ వెర్షన్ వసూళ్లు కలిపి 37 కోట్ల రూపాయలకు పైగా నెట్ వసూళ్లను రాబట్టింది.
ఇక మిగిలిన ప్రాంతాల విషయానికి వస్తే తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు ఈ చిత్రానికి 41 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు, 64 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. నిన్న మొన్నటి వరకు తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ చాలా తేలిక అని అనుకున్నారు. కానీ ఇప్పుడు కనీసం మూడు నుండి నాలుగు కోట్ల రూపాయిల నష్టం వాటిల్లే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయని అంటున్నారు ట్రేడ్ పండితులు. అదే విధంగా తమిళనాడు లో 133 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం, కర్ణాటక నుండి 42 కోట్లు, కేరళ నుండి 25 కోట్లు, ఓవర్సీస్ నుండి 175 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకొని క్లీన్ హిట్ స్టేటస్ కి ఈ సినిమా చేరాలంటే మరో 64 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు రావాలి.