OG USA Premiere Review: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎవరికీ దక్కనటువంటి గొప్ప క్రేజ్ ను సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న స్టార్ హీరోలు చాలామంది ఉన్నారు…. ఇక ఇలాంటి క్రమంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న ఓజీ సినిమా రేపు ఇండియాలో రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఈరోను నైట్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ అయితే పడుతున్నాయి…ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్స్ ని యూఎస్ఏ లో వేశారు. దాన్ని బట్టి చూస్తుంటే ఈ సినిమా ఎలా ఉంది సగటు ప్రేక్షకులను మెప్పించిందా? లేదా అనే విషయాన్ని మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
కథ
ఈ సినిమా కథ విషయానికి వస్తే ‘ఓజాస్ గంభీరా’ (పవన్ కళ్యాణ్) అనే వ్యక్తి గ్యాంగ్ స్టర్ గా మారి చాలా సంవత్సరాల పాటు ముంబై లో తన హవాని కొనసాగిస్తూ ఉంటాడు. కొన్ని కారణాల వల్ల ముంబై ని వదిలేసి అజ్ఞాతం లోకి వెళ్లి ఎవ్వరికి కనిపించకుండా ఉంటాడు. మరి ఇలాంటి సందర్భంలోనే ఓమి (ఇమ్రాన్ హష్మీ) అనే ఒక రౌడీ ముంబైలో ఉన్న చాలా మందిని ఇబ్బంది పెడుతూ ఉండడం దానివల్ల సఫర్ అయిన చాలామంది ఓజాస్ గంభీర ను మళ్లీ ముంబై కి రమ్మని పిలవడంతో ఆయన ముంబై కి వచ్చి ఓమి ని ఎలా ఎదిరించాడు అనేదే ఈ సినిమా కథ…
విశ్లేషణ
ఇక విశ్లేషణ విషయానికి వస్తే దర్శకుడు సుజిత్ ఈ సినిమాని చాలా ఎక్స్ట్రాడినరీగా తెరకెక్కించాడు అంటూ యూఎస్ఏ లో ప్రీమియర్స్ చూసిన చాలామంది ప్రేక్షకులు వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. మరి ఏది ఏమైనా కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇంతకుముందు సినిమాల్లో ఎప్పుడు లేనటువంటి ఒక కొత్త పవర్ ని ఈ సినిమాలో చూపించారని తన స్టామినా వల్లే ఈ సినిమా ప్రేకకులకు విపరీతంగా నచ్చిందని పలువురు చెబుతుండడం విశేషం…
ఇక మొత్తానికైతే ఈ సినిమాతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక భారీ సక్సెస్ ను తన ఖాతాలో వేసుకున్నారని చెబుతున్నారు. సుజిత్ ఇప్పటివరకు ఏ దర్శకుడికి లేనటువంటి స్టైలిష్ లుక్ లో పవన్ కళ్యాణ్ ను చూపించాడట… ఇక యాక్షన్ ఎలిమెంట్స్ సైతం చాలా ఎక్స్ట్రార్డినరీగా ఉన్నట్టుగా తెలుస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్వాగ్ ఈ సినిమాలో పూర్తిస్థాయిలో పని చేసిందట… ఇంటర్వెల్ సీన్ మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉందని ఇలాంటి సీన్ ని ఎప్పుడు చూడలేదని వాళ్ళు చెబుతుండడం విశేషం…ఇక బ్యా గ్రౌండ్ స్కోర్ మాకు చాలా ప్లస్ అయిందట…
ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్
ఇక ఈ సినిమాలో ఆర్టిస్టుల పర్ఫామెన్స్ విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ చాలా అద్భుతమైన నటనను కనబరిచినట్టుగా తెలుస్తోంది. ఒక గ్యాంగ్ స్టర్ ఏ రేంజ్ లో ఉంటాడో ఆరెంజ్ కటౌట్ తో పవన్ కళ్యాణ్ నటించిన విధానం నెక్స్ట్ లెవెల్లో ఉందట. ఇక ఓమి గా ఇమ్రాన్ హష్మీ నటన కూడా బాగుంది. పవన్ కళ్యాణ్ ఢీ కొట్టే కొన్ని సన్నివేశాల్లో ఆయన ఎక్స్ట్రాడినరీ పర్ఫామెన్స్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇక హీరోయిన్ ప్రియాంక మోహన్ తన పాత్ర పరిధి మేరకు ఓకే అనిపించింది. ప్రకాష్ రాజ్ సైతం ఈ సినిమాలో తన నటనలో వేరియేషన్స్ ని చూపించినట్టుగా తెలుస్తోంది…ఇక శ్రేయ రెడ్డి తన పాత్ర కి పెర్ఫెక్ట్ గా సెట్ అయిందట…
టెక్నికల్ అంశాలు
ఇక టెక్నికల్ అంశాల విషయానికి వస్తే తమన్ మ్యూజిక్ అండ్ బ్యా గ్రౌండ్ మ్యూజిక్ విషయం లో చాలా వరకు కేర్ ఫుల్ గా వ్యవహరించినట్టుగా తెలుస్తోంది…ప్రతి సీన్ హైలెట్ అవ్వడానికి ఆయన బిజిఎం చాలా వరకు ప్లస్ అయిందట…అలాగే విజువల్స్ కూడా బాగున్నాయట… అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ కూడా నెక్స్ట్ లెవల్లో ఉన్నాయట…
