OG Trailer Release Date: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) నటించిన ‘ఓజీ'(They Call Him OG) చిత్రం పై ఫ్యాన్స్ మరియు ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. నార్త్ అమెరికా వంటి దేశం లో నెల రోజుల ముందు అడ్వాన్స్ బుకింగ్స్ ని మొదలు పెడితే, సినిమా విడుదలకు 20 రోజులు ముందుగానే ఈ చిత్రం 1 మిలియన్ డాలర్ల గ్రాస్ మార్కుని దాటేసిందంటేనే అర్థం చేసుకోవచ్చు, ఈ సినిమాకు జనాల్లో ఎలాంటి క్రేజ్ ఉంది అనేది. ప్రస్తుతం ఉన్న ఊపుని చూస్తుంటే కచ్చితంగా ఈ చిత్రం ప్రీమియర్ షోస్ నుండి 4 మిలియన్ డాలర్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి ఆల్ టైం రికార్డు ని నెలకొల్పే అవకాశాలు ఉన్నాయని అక్కడి ట్రేడ్ పండితులు చెప్తున్నారు. నార్త్ అమెరికా లోనే ఈ రేంజ్ క్రేజ్ వుంటే, ఇక తెలుగు రాష్ట్రాల్లో ర్యాంపేజ్ ఏ రేంజ్ లో ఉంటుందో మీరే ఊహించుకోండి.
Also Read: కవిత కోపం హరీశ్‌పై కాదా.. మరి టార్గెట్ ఎవరు?
అయితే ఈ సినిమా ప్రొమోషన్స్ ని మేకర్స్ అనుకున్నంత రేంజ్ లో చేయడం లేదని అభిమానుల నుండి వస్తున్న కంప్లైంట్. కానీ ఈ వీకెండ్ నుండి ఫ్యాన్స్ మెంటలెక్కిపోయే రేంజ్ ప్రొమోషన్స్ ని మొదలు పెట్టబోతున్నారని విశ్వసనీయ వర్గాల నుండి సమాచారం. వీకెండ్ అంటే రేపే, రేపు ఈ చిత్రానికి సంబంధించి ఏదైనా ఆసక్తికరమైన అప్డేట్ వస్తుందో లేదో చూడాలి. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ గురించి ఒక ఆసక్తికరమైన అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతోంది. ముందుగా ట్రైలర్ ని సెప్టెంబర్ 19 న విడుదల చెయ్యాలని అనుకున్నారు. కానీ మరీ ఆలస్యం అవుతుంది, కాస్త జనాల్లోకి గట్టిగా వెళ్లాలంటే ముందుగా రిలీజ్ చేయాలి అనే ఉద్దేశ్యం తో సెప్టెంబర్ 15 న విడుదల చేసే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. త్వరలోనే దీనికి సంబంధించిన అప్డేట్ అధికారికంగా బయటకు చెప్పనున్నారు.
ఈ ట్రైలర్ లో ఉండే డైలాగ్స్ కి ఫ్యాన్స్ మెంటలెక్కిపోతారట. ముఖ్యంగా కొన్ని షాట్స్ అయితే అభిమానుల ఊహకు కూడా అందని విధంగా ఉన్నాయని, వాస్తవానికి ఆ షాట్స్ ని మొన్న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కి విడుదల చేసిన గ్లింప్స్ వీడియో లోనే పెడదామని అనుకున్నారట. కానీ వాటిని కట్ చేసి ట్రైలర్ లో జత చేశారట. మరి ఈ ట్రైలర్ ఎలా ఉండబోతుందో చూడాలి. ఇప్పటికే ఓవర్సీస్ బాక్స్ ఆఫీస్ ని ఈ చిత్రం షేక్ చేస్తూ ముందుకు దూసుకెళ్తుంది. ఇక ట్రైలర్ కంటెంట్ క్లిక్ అయితే ప్రీమియర్ షోస్ గ్రాస్ కి ఆకాశమే హద్దు అనే రేంజ్ లో ఉంటుందేమో చూడాలి. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఆంధ్ర ప్రదేశ్ లోని వైజాగ్ ప్రాంతం సెప్టెంబర్ 19 న ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నారట మేకర్స్.