Ghaati Movie Review: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది దర్శకులు డిఫరెంట్ కథలను ఎంచుకొని సినిమాలు చేస్తున్నారు. మరి ఇలాంటి సందర్భంలోనే క్రిష్ లాంటి స్టార్ డైరెక్టర్ సైతం వరుస సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇక గతంలో ‘హరిహర వీరమల్లు’ సినిమా స్టార్ట్ చేసి మధ్యలోనే వదిలేసిన విషయం మనకు తెలిసిందే. ఆయన అనుష్కతో చేసిన ‘ఘాటి’ సినిమా ఈరోజు ప్రేక్షకులు ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది సగటు ప్రేక్షకుడిని మెప్పించిందా? లేదా అనే విషయాన్ని మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
Also Read: ‘ఓజీ’ ట్రైలర్ విడుదల తేదీ వచ్చేసింది..క్రేజీ డైలాగ్స్ లీక్!
కథ
ఇక ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే ఒక ప్రాంతంలో శీలావతి అనే ఒక కొత్తరకం గంజాయి పండుతోంది… దాన్ని మోస్తున్న ఘాటీలు అనేక రకమైన ఇబ్బందులను ఎదుర్కొని మరి తమ ప్రాణాలను రిస్క్ లో పెట్టి వాటిని తీసుకొచ్చి మధ్యలో ఉండే బ్రోకర్ల చేతిలో పెడుతుంటారు.ఇక ఇలాంటి క్రమంలోనే వాళ్లలో చాలా మంది ప్రాణాలను సైతం కోల్పోయి అనాథలు అవుతారు. ఇక విక్రమ్ ప్రభు తన అమ్మకి ఇచ్చిన మాటతో ఘాటి గా పని చేయడం మానేస్తాడు.ఇక విక్రమ్ ప్రభు తన మరదలు అయిన శీలావతి (అనుష్క) సిటీకి వెళ్ళి బతుకుతూ ఉంటారు.
మరి ఇలాంటి సందర్భంలోనే ఘాటీలుగా తమ జీవితాన్ని గడుపుతున్న వాళ్లు ప్రాణం కోల్పోవడం అలాగే తమ పిల్లలు సైతం చదువులు లేకుండా ఉండటాన్ని చూసిన వీళ్లిద్దరూ గంజాయితో లిక్విడ్ ను తయారు చేస్తారు. దాని ద్వారా ఎక్కువ మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చనే ఉద్దేశ్యంతో ఉంటారు… ఈ క్రమంలోనే డీలర్స్ తో వీళ్లకు ఎలాంటి గొడవలు ఏర్పడ్డాయి. ఫైనల్ గా అనుష్క ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంది అనేది తెలియాలంటే మాత్రం మీరు ఈ సినిమా చూడాల్సిందే…
విశ్లేషణ
ఇక విశ్లేషణ విషయానికి వస్తే ఈ సినిమాలో క్రిష్ గంజాయి కి సంబంధించిన సెటప్ ని ప్రాపర్ గా చూపించలేకపోయాడు. మొదట్లోనే గంజాయిలో రకాలు ఉంటాయని ఒక డైలాగ్ రూపంలో చెప్పించినప్పటికి అది ఎలాంటి గంజాయి ఎక్కడ పండుతుంది. దానికి దీనికి తేడా ఏంటి అనే విషయాల్లో వేరియేషన్స్ చూపించినట్లయితే గంజాయి వరల్డ్ అనేది పేపర్ గా సెట్ అయ్యేది. ఎంతసేపు ఘాటీలు గంజాయి మోస్తున్నారు అని చూపించాడు తప్ప అసలు గాంజాయి అనే దానిమీద ఎక్కడ ఫోకస్ చేయలేదు. అందువల్ల ప్రేక్షకులు మొదటి నుంచి కూడా కథ నుంచి డివియెట్ అయిపోయారు…
నిజానికి క్రిష్ మంచి దర్శకుడు అనే పేరు సంపాదించుకున్నప్పటికి ఈ సినిమా మీద మాత్రం ప్రాపర్ గా వర్క్ చేయలేదు అనిపించింది. ప్రతి విషయంలో ఏదో ఒక మైనస్ అయితే కనిపిస్తూనే ఉంది. కథనంలో కూడా ఇంకాస్త జాగ్రత్తలు తీసుకొని ఉంటే బాగుండేది. ఇక పాటల గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అసలు మ్యూజిక్ డైరెక్టర్ పాటలు ఎందుకు కొట్టాడో ఏంటో అర్థం కాలేదు. అలాగే దర్శకుడు సైతం ఆ పాటలో సినిమాకు సంబంధించిన వరల్డ్ ను ఎస్టాబ్లిష్ చేసి ఉంటే బాగుండేది. కానీ ఎంతసేపు పాటల్లో ఘాటీలను మాత్రమే చూపించి వాళ్లు పడే ఇబ్బందులు ఎలా ఉంటాయి అని చెప్పే ప్రయత్నం అయితే చేశాడు గాని అది కళ్లకు కట్టినట్టుగా చూపించలేకపోయాడు.
ఇక విక్రమ్ ప్రభు క్యారెక్టర్ డిజైన్ చేసిన విధానం బాగానే ఉంది. కానీ ఆయన్ని వాడుకున్న వే అంత పర్ఫెక్ట్ గా కుదరలేదు. చైతన్య రావు విలన్ గా నటించినప్పటికి ఆయన నటన పెద్దగా ఇంపాక్ట్ అయితే ఇవ్వలేదు. ఎంతసేపు అరుస్తూ ఉన్నాడు తప్ప నటనలో విలనిజాన్ని చూపించలేకపోయాడు… ఇక గంజాయి నుంచి ఎస్టాబ్లిష్ చేసిన కథని ఒక రివేంజ్ స్టోరీగా మార్చిన విధానం చాలా ఔట్ డేటెడ్ అనిపించింది. క్రిష్ ఇప్పటికైనా మారాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడున్న యంగ్ డైరెక్టర్లు డిఫరెంట్ కథలతో సినిమాలను చేస్తుంటే ఈయన ఇంకా రొటీన్ వే లోనే వెళుతున్నట్టుగా అనిపించింది. ఆ బ్లాకింగ్స్ గాని, స్క్రీన్ మీద ప్రజెంట్ చేసిన విధానం గాని ఏదీ కూడా ప్రేక్షకుడిని అంత పెద్దగా ఇంప్రెస్ చేయలేకపోయాయి…
అనుష్కను స్క్రీన్ మీద అసలు చూడలేకపోయాం… కారణం ఏంటి అంటే ఆమె కొంచెం బరువు పెరగడం వల్ల స్క్రీన్ మీద ఎంతసేపు ఆమె హెవీ వెయిట్ గా ఉండి నటించడానికి ఇబ్బంది పడుతుంది అని అనిపించింది. తప్ప ఆమె ఫ్రీగా నటించినట్టుగా ఎక్కడ అనిపించలేదు… అలాగే ఆమె సెకండాఫ్ లో చేసిన ఫైట్ సీక్వెన్స్ లు సైతం కొంచెం ఇబ్బందిగా అనిపించాయి…అలాగే ఎమోషనల్ గా టచ్ చేయలేకపోయాయి…
ఆర్టిస్టుల పర్ఫామెన్స్
ఇక ఆర్టిస్టుల పర్ఫామెన్స్ విషయానికి వస్తే అనుష్క ఇందులో నటించడం ఒక పెద్ద ప్లస్ పాయింట్ అయితే, ఆమె స్క్రీన్ మీద అంత ఎఫెక్టివ్ గా కనిపించకపోవడం ఈ సినిమాకి మైనస్ గా మారింది… విక్రమ్ ప్రభు తన పాత్రకి కొంతవరకు న్యాయం చేసినట్టుగా అనిపించింది. అలాగే చైతన్య రావు విలన్ గా ఒక అటెంప్ట్ అయితే చేశాడు, కానీ అది పెద్దగా ఎఫెక్టివ్ గా అనిపించలేదు…
జగపతి బాబు పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించినప్పటికి ఆయన పోలీస్ ఆఫీసర్ గా ఏదైతే చేయబోతున్నాడో ప్రేక్షకులు ముందుగానే ఊహించడం వల్ల ఆయన పాత్రలో అంత ఇంటెన్స్ అయితే రాలేకపోయింది… ఇక మిగిలిన ఆర్టిస్టులందరు కూడా వాళ్ళ పాత్రల పరిధి మేరకు ఓకే అనిపించారు…
టెక్నికల్ అంశాలు
ఇక టెక్నికల్ అంశాల విషయానికి వస్తే ముందుగా మ్యూజిక్ గురించి మాట్లాడుకోవాలి. ఇక మ్యూజిక్ అంత పెద్దగా ఎఫెక్ట్ గా అనిపించలేదు. ఒక్క పాట కూడా వినడానికి లేకుండా ఉండడం అలాగే వాటిని స్క్రీన్ మీద ప్రజెంట్ చేసిన విధానం కూడా అసలు బాగా లేకపోవడంతో పాట ఎప్పుడు వచ్చినా కూడా అది ఎప్పుడు అయిపోతుందా? అనే ఒక ధోరణిలో ప్రేక్షకుడు వెయిట్ చేస్తున్నాడు తప్ప పెద్దగా ఎంజాయ్ చేయలేకపోయారు. ఇక విజువల్ గా కూడా ఇంకాస్త జాగ్రత్తలు తీసుకొని ఉంటే బాగుండేది…
బ్లాకింగ్ అంత ఎఫెక్ట్ గా అనిపించలేదు. విజువల్స్ కూడా చాలావరకు మైనస్ అయ్యాయనే చెప్పాలి…ఎమోషన్ ను క్యారీ చేయడంలో విజువల్స్ అంత ఇంపాక్ట్ ఇవ్వలేకపోయాయి…ప్రొడక్షన్ వాల్యూస్ కొంతవరకు పర్లేదు… ఎడిటర్ కొన్ని స్కిన్స్ కి తన కత్తెరకు పని చెప్పి ఉంటే సినిమా ఇంకొంచెం షార్ప్ గా వచ్చి ఉండేది…
ప్లస్ పాయింట్స్
ఫస్టాఫ్ లో వచ్చే కొన్ని సీన్స్
మైనస్ పాయింట్స్
కథ
డైరెక్షన్
మ్యూజిక్
రేటింగ్
ఈ మూవీకి మేమిచ్చే రేటింగ్ 2.25/5