Little Hearts Vs Ghaati: ‘ఈ ఏడాది చిన్న సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద అను బాంబులు లాగా పేలుతున్నాయి. అది కూడా పెద్ద సినిమాలను డామినేట్ చేస్తూ. స్టార్ క్యాస్టింగ్ తో తెరకెక్కుతున్న సినిమాలు ఈమధ్య కాలం లో ఆడియన్స్ ని తీవ్రంగా నిరాశపరుస్తున్నాయి. నేడు ‘ఘాటీ'(Ghaati Movie), ‘మదరాసి'(Madharasi Movie) మరియు ‘లిటిల్ హార్ట్స్'(Little Hearts Movie) వంటి చిత్రాలు విడుదల అయ్యాయి. అనుష్క(Anushka Shetty), క్రిష్ జాగర్లమూడి(Krish Jagarlamudi) కాంబినేషన్ లో తెరకెక్కిన ‘ఘాటీ’ చిత్రం నేడు భారీ అంచనాల నడుమ విడుదలై డివైడ్ టాక్ ని సొంతం చేసుకుంది. అదే విధంగా శివ కార్తికేయన్(Siva Karthikeyan), AR మురుగదాస్(AR Murugadoss) కాంబినేషన్ లో తెరకెక్కిన ‘మదరాసి’ అనే చిత్రం కూడా భారీ అంచనాల నడుమ విడుదలై నేడు మొదటి ఆట నుండే డిజాస్టర్ రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. ఈ రెండు సినిమాలకంటే సోషల్ మీడియా సెలబ్రిటీ గా పేరు తెచ్చుకున్న స్టాండప్ కమెడియన్ మౌళి(Mouli Talks) నటించిన ‘లిటిల్ హార్ట్స్’ అనే చిత్రానికి నిన్న రాత్రి ప్రీమియర్ షోస్ నుండే పాజిటివ్ టాక్ వచ్చింది.
Also Read: కవిత కోపం హరీశ్‌పై కాదా.. మరి టార్గెట్ ఎవరు?
దీంతో బుక్ మై షో లో ఈ చిత్రం ‘ఘాటీ’, ‘మదరాసి’ కంటే గొప్పగా ట్రెండ్ అవుతూ కంటెంట్ పవర్ ఎలాంటిదో మరోసారి అందరికీ అర్థం అయ్యేలా చేసింది. బుక్ మై షో యాప్ లో ‘లిటిల్ హార్ట్స్’ అనే చిత్రానికి గంటకు 2800 టికెట్స్ అమ్ముడుపోతుండగా, అనుష్క ‘ఘాటీ’ చిత్రానికి కేవలం 1560 టిక్కెట్లు మాత్రమే అమ్ముడుపోతున్నాయి. మౌళి అనే వ్యక్తి సోషల్ మీడియా లో ఉండే ఆడియన్స్ కి సుపరిచితం అయ్యుండొచ్చేమో కానీ , రెగ్యులర్ మూవీ లవర్స్ కి ఈయన పేరేంటో కూడా తెలియదు. అలాంటి హీరో సినిమా ఏకంగా అనుష్క లాంటి సూపర్ స్టార్ సినిమాని డామినేట్ చేస్తూ ముందుకు దూసుకెళ్తుందంటే, ఆడియన్స్ కంటెంట్ ఉన్న సినిమాలకు ఎంతటి ప్రాధాన్యత ఇస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.
రీసెంట్ గానే ఒక డైరెక్టర్ నా సినిమాని జనాలు చూడడం లేదు, రెండున్నర ఏళ్ళు కష్టపడి తీసాను అంటూ మీడియా ముందుకి వచ్చి ఏడుస్తూ, జనాలను తప్పుబడుతూ చెప్పులతో కొట్టుకున్నాడు. ఆ వీడియో పెద్ద సంచలనంగా మారింది. ఎవరు తీసిన సినిమా వాళ్లకు బాగానే అనిపిస్తుంది. కానీ ఆ సినిమా ఆడియన్స్ కి నచ్చాలి. అలా నచ్చితే ‘లిటిల్ హార్ట్స్’ చిత్రం లాగా ఆడుతుంది. సోషల్ మీడియా లో మన లాగే తిరుగుతూ ఉండే మౌళి అనే అబ్బాయి ఇప్పుడు వెండితెర పై సక్సెస్ కొట్టే రేంజ్ కి వచ్చేశాడు. నిజమైన టాలెంట్ ని ప్రోత్సహించడం లో మన తెలుగు ఆడియన్స్ ఎప్పుడు విఫలం అవ్వరు అని ‘లిటిల్ హార్ట్స్’ చిత్రం తో మరోసారి రుజువు అయ్యింది. మొదటి రోజు అద్భుతమైన ఓపెనింగ్స్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రం, లాంగ్ రన్ లో ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుందో చూడాలి.