‘OG’ new schedule in Vijayawada : అభిమానులతో పాటు ప్రేక్షకులు, సినీ ఇండస్ట్రీ, ట్రేడ్ ఇలా ప్రతీ ఒక్కరు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న పాన్ ఇండియన్ చిత్రాల్లో ఒకటి ‘ఓజీ'(They Call Him OG). సుజిత్(Sujeeth) దర్శకత్వం లో పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) హీరో గా నటిస్తున్న ఈ సినిమాపై అంచనాలు మామూలు రేంజ్ లో లేవు. ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించిన రోజే ఇండస్ట్రీ మొత్తం షేక్ అయ్యింది. సోషల్ మీడియా మొత్తం ఊగిపోయింది. నేటి తరం యూత్ ఆడియన్స్ ఇష్టాలకు తగ్గట్టుగా ఈ చిత్రాన్ని పవన్ కళ్యాణ్ ఎంచుకోవడం వల్లే ఈ చిత్రం పై ఇంతటి క్రేజ్ ఏర్పడడానికి కారణం అయ్యింది అని అంటున్నారు విశ్లేషకులు. మధ్యలో పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ అవ్వడం వల్ల ఈ సినిమా షూటింగ్ కి తాత్కాలిక విరామం దొరికింది. ఇప్పుడు మళ్ళీ ఈ చిత్రం గ్రాండ్ గా మొదలైంది. కొన్ని రోజులు హైదరాబాద్ లో మరికొన్ని రోజులు ముంబై లో షూటింగ్ ని జరుపుకుంది ఈ చిత్రం.
నిన్నటితో ముంబై షెడ్యూల్ పూర్తి అయ్యింది. నేటి నుండి విజయవాడ లో ఏర్పాటు చేసిన భారీ సెట్స్ లో పవన్ కళ్యాణ్ పై కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు మేకర్స్. ఈ నెల 10 వరకు ఈ షూటింగ్ కొనసాగుతుంది. పవన్ కళ్యాణ్ కి సంబంధించిన షూటింగ్ వరకు ఈ నెల 10 తో పూర్తి అవుతుంది, కానీ మిగిలిన షూటింగ్ మొత్తం ఈ నెల 16 వ తేదీతో పూర్తి అవుతుందట. అంతే కాకుండా ప్యాచ్ వర్క్ లో కూడా పవన్ కళ్యాణ్ పాల్గొనాల్సి ఉంటుంది. ఇమ్రాన్ హష్మీ తో ఒక ఫైట్ సన్నివేశం బ్యాలన్స్ ఉంటుంది. ముంబై లో షూట్ చేద్దాం అనుకున్నారు కానీ ఇమ్రాన్ హష్మీ కి డెంగ్యూ ఫీవర్ రావడంతో కాస్త ఆయన షూటింగ్ పార్ట్ కి బ్రేక్ ఇచ్చారు. ప్రస్తుతం ఇమ్రాన్ హష్మీ విశ్రాంతి తీసుకుంటున్నాడు.
Also Read : సరికొత్త పోస్టర్ తో ‘ఓజీ’ విడుదల తేదీని ప్రకటించిన నిర్మాతలు..షేక్ అయిన సోషల్ మీడియా!
ఈ నెలాఖరు నుండి ఆయన అందుబాటులో ఉంటాడు. డేట్స్ ఇచ్చిన వెంటనే ముంబై లో పవన్ కళ్యాణ్, ఇమ్రాన్ హష్మీ లపై ఆ కీలక సన్నివేశాన్ని చిత్రీకరిస్తారని, అందుకు మూడు రోజుల డేట్స్ అవసరం ఉంటుందని అంటున్నారు. అదే విధంగా థాయిలాండ్ లో పవన్ కళ్యాణ్ కి సంబంధించి రెండు రోజుల షూటింగ్ ని పూర్తి చేయాల్సి ఉందట. ఆ ప్లాన్ ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఓవరాల్ టాకీ పార్ట్ మొత్తం ఈ నెల 16 తో పూర్తి అవుతుందని, ఆ తర్వాత 5 రోజుల పాటు ఈ ప్యాచ్ వర్క్ ఉంటుందని అంటున్నారు. ఈ చిత్రం ఫ్లాష్ బ్యాక్ లో పవన్ కళ్యాణ్ యంగ్ రోల్ లో కనిపించబోతున్నాడు. అందుకోసం డీ ఏజినింగ్ టెక్నాలిజీ ని ఉపయోగించబోతున్నారు మేకర్స్. ఈ లుక్స్ వేరే లెవెల్ లో ఉంటాయని అంటున్నారు. ఈ నెల చివరి నుండి ఓజీ అప్డేట్స్ రానున్నాయి. సెప్టెంబర్ 25 న గ్రాండ్ రిలీజ్ చేయబోతున్నారు.