OG Premiere Show Tickets: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) మోస్ట్ క్రేజీ చిత్రం ‘ఓజీ'(They Call Him OG) ఈరోజు ప్రీమియర్ షోస్ తో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు, ఓవర్సీస్ లో కూడా ఒకేసారి ప్రీమియర్ షోస్ ప్రారంభం కానున్నాయి. మొదటి రోజు + ప్రీమియర్ షోస్ కలిపి నిన్ననే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 70 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇది సాధారణమైన విషయం కాదు. ఎందుకంటే రెండు రాష్ట్రాల్లో ఇంకా అనేక ప్రాంతాల్లో పూర్తి స్థాయి అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం అవ్వలేదు. ముఖ్యంగా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి ప్రాంతాల్లో పీవీఆర్, ఐనాక్స్, సినీ పాలిస్ మరియు మిరాజ్ వంటి నేషనల్ మల్టీప్లెక్స్ థియేటర్స్ కి సంబంధించిన బుకింగ్స్ ని మొదలు పెట్టాలి. రేపు మధ్యాహ్నం లోపు ఈ బుకింగ్స్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. వీటితో ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం 100 కోట్ల రూపాయిల గ్రాస్ మార్కుని దాటుతుందని అనుకుంటున్నారు.
ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రానికి సంబందించిన హైదరాబాద్ ప్రీమియర్ షోస్ కి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ నిమిషాల వ్యవధి లో హాట్ కేక్స్ లాగా అమ్ముడుపోవడం జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. 800 టికెట్ రేట్స్ ని పవన్ కళ్యాణ్ అభిమానులు క్షణాల్లో మాయం చేశారు. బయ్యర్స్ కి కూడా మతి పోయినంత పని అయ్యింది. నిన్న హైదరాబాద్ లో దాదాపుగా 100 ప్రీమియర్ షోస్ కి సంబంధించిన బుకింగ్స్ ని మొదలు పెడితే, 4 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇదే అందరినీ విస్మయానికి గురి చేసిన విషయం. రేపు నేషనల్ మల్టీప్లెక్స్ చైన్స్ లో ప్రీమియర్ షోస్ తో పాటు అడ్వాన్స్ బుకింగ్స్ ని మొదలు పెట్టిన తర్వాత గ్రాస్ ఎవ్వరి ఊహలకు అందని విధంగా ఉంటుందని, అన్నీ అనుకున్నట్టు పర్ఫెక్ట్ గా జరిగితే కేవలం హైదరాబాద్ సిటీ నుండి ఈ చిత్రానికి 30 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబడుతుందని అంటున్నారు.
ఇప్పటి వరకు ఒక్క సినిమాకు కూడా ఈ రేంజ్ అడ్వాన్స్ బుకింగ్స్ జరగలేదు. ‘పుష్ప 2’ చిత్రానికి ప్రీమియర్స్ + మొదటి రోజుకి కలిపి కేవలం 21 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఈ రికార్డు ని కచ్చితంగా ఓజీ చిత్రం బద్దలు కొడుతుందని బలమైన నమ్మకం తో ఉన్నారు ట్రేడ్ పండితులు. కానీ నేషనల్ మల్టీప్లెక్స్ బుకింగ్స్ ని ఎంత తొందరగా మొదలు పెడితే అంతటి గొప్ప రికార్డు వస్తుందని అంటున్నారు ఫ్యాన్స్. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది. ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ ని చూస్తుంటే కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే ఈ చిత్రం 120 కోట్ల గ్రాస్ మార్కుని అందుకునేలా అనిపిస్తుంది.