OG Premiere Show Ticket Rates: రెండు నెలల క్రితమే పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) నుండి విడుదలైన ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) చిత్రం ఎంతటి ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చిందో మన అందరికీ తెలిసిందే. సాధారణంగా పవన్ కళ్యాణ్ సినిమాలు ఎంత పెద్ద ఫ్లాప్ అయినా వీకెండ్ వరకు కచ్చితంగా హౌస్ ఫుల్స్ కలెక్షన్స్ ని నమోదు చేసుకుంటాయి. కానీ ఈ సినిమాకు అది కూడా జరగలేదు. సెకండ్ హాఫ్ చాలా వీక్ గా ఉండడం, గ్రాఫిక్స్ అత్యంత నాసిరకంగా ఉండడం వల్లే ఈ సినిమాని ఆడియన్స్ ఆ రేంజ్ లో రిజెక్ట్ చేశారు. అయితే పవన్ కళ్యాణ్ సినిమా బెనిఫిట్ షోస్ కి ప్రీమియర్ షోస్ కి ఎలాంటి క్రేజ్ ఉంటుందో, ఈ సినిమా ప్రీమియర్ షోస్ కి కూడా అలాంటి క్రేజ్ ఉండేది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు ప్రీమియర్ షోస్ టికెట్ రేట్ 600 పెట్టినా ఎగబడి మరీ చూసారు.
కేవలం తెలుగు రాష్ట్రాల నుండి వచ్చిన ప్రీమియర్ షోస్ గ్రాస్ వసూళ్లే దాదాపుగా 16 కోట్ల రూపాయలకు పైగానే ఉంటుంది. సినిమా విడుదలకు ముందే కచ్చితంగా డిజాస్టర్ ఫ్లాప్ అవుతుందనే వైబ్రేషన్స్ కలిగినా కూడా ఫ్యాన్స్ ఈ చిత్రానికి ఆ రేంజ్ లో ప్రీమియర్ షోస్ టికెట్స్ ని ఎగబడి కొన్నారు. వీరమల్లు ప్రీమియర్ షోస్ టికెట్ కి ఉన్నటువంటి క్రేజ్ ని గమనించిన ఓజీ(They Call Him OG) మేకర్స్, తమ సినిమాకు కూడా ప్రీమియర్ షోస్ ద్వారా భారీ వసూళ్లను జమ చేసుకోవాలని చూస్తున్నారు. ఈ నెల 25 వ తారీఖున విడుదల అవ్వబోతున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్ షోస్ ని రెండు తెలుగు రాష్ట్రాల్లో 24 వ తేదీ రాత్రి 9 గంటల ప్రీమియర్ షోస్ తో ప్రారంభించబోతున్నారు. ఆంధ్ర ప్రదేశ్ లో టికెట్ రేట్స్ 900 నుండి 1000 రూపాయిల వరకు ఉండొచ్చు.
అదే విధంగా తెలంగాణ లో టికెట్ రేట్స్ 1000 నుండి 1200 వరకు ఉండొచ్చు. సినిమాకు విపరీతమైన క్రేజ్ ఉన్న కారణంగా, ప్రతీ ప్రాంతం లో రికార్డు స్థాయి బిజినెస్ జరిగినందున, ఈ మాత్రం టికెట్ రేట్స్ పెట్టాలని ఓజీ మేకర్స్ ని బయ్యర్స్ ఒత్తిడి చేస్తున్నారు. వాళ్ళు కూడా ఈమేరకు అనుమతి కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు దరఖాస్తు చేసుకున్నట్టు తెలుస్తుంది. తెలంగాణ లో తెల్లవారు జామున 4 గంటల ఆటకు కూడా అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నారట. రెండు తెలుగు రాష్ట్రాల్లో #RRR రికార్డు ని బద్దలు కొట్టడమే లక్ష్యంగా ప్లానింగ్ జరుగుతుంది. మరి #RRR ని కొడుతుందా లేదా అనేది చూడాలి. ఒక్క సీడెడ్ మినహా, మిగిలిన అన్ని ప్రాంతాల్లో #RRR రికార్డు బ్రేక్ అవుతుందని ట్రేడ్ పండితులు ఆశిస్తున్నారు. మరి ఈ చిత్రానికి అంత రేంజ్ ఉందా లేదా అనేది మరికొద్ది రోజుల్లోనే తెలియనుంది.