OG : తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pavan Kalyan)కి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఆయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశమైతే ఉంటుంది. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇక మీదట ఆయన చేయబోతున్న సినిమాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి… రీసెంట్ గా ‘హరిహర వీరమల్లు’ (Harihara Veerramallu) సినిమా షూటింగ్ మొత్తాన్ని కంప్లీట్ చేసిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఓజీ (OG) సినిమాకు సంబంధించిన డేట్స్ ని కూడా కేటాయించాడు. ఈ సినిమాను కూడా పూర్తి చేసి వీలైనంత తొందరగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఉద్దేశ్యంతో తను ఉన్నట్టుగా తెలుస్తోంది. మొత్తానికైతే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేశారు. ఇక సుజిత్ (Sujeeth) ఈ సినిమాలో బ్యాలెన్స్ ఉన్న షూటింగ్ మొత్తాన్ని ప్లాన్ చేసుకొని ఒకేసారి మొత్తం షూట్ కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నట్టుగా తెలుస్తోంది… ఇక ఈ షెడ్యూల్లో పవన్ కళ్యాణ్ మీద క్లైమాక్స్ ఫైట్ ను చిత్రీకరించే అవకాశాలైతే ఉన్నాయి. దాంతోపాటుగా సెకండాఫ్ లో వచ్చే కొన్ని సీక్వెన్స్ లను కూడా చిత్రీకరిస్తారట.
Also Read : ‘ఈసారి ముగిద్దాం’ అంటూ సంచలన అప్డేట్ ఇచ్చిన ‘ఓజీ’ టీం..ఫోటో వైరల్!
అయితే ఓజీ సినిమాను వీలైనంత తొందరగా ఫినిష్ చేసి రిలీజ్ చేయాలనే ఉద్దేశ్యంతో సుజిత్ అయితే ఉన్నాడు. ఇక దానికి పవన్ కళ్యాణ్ కూడా సపోర్ట్ చేస్తూ ఉండడం నిజంగా చాలా గొప్ప విషయం అనే చెప్పాలి. ఇప్పటివరకు ఒక్కడే ఈ సినిమా మీద ఒంటరి పోరాటమైతే చేశాడు. పవన్ కళ్యాణ్ డేట్స్ కోసం చాలా రకాలుగా ప్రయత్నం చేశాడు.
కానీ ఏపీ ఎలక్షన్స్ రావడం వల్ల పవన్ కళ్యాణ్ అప్పుడు ఒక ఆరు నెలలు ఈ సినిమా మీద డేట్స్ కేటాయించకుండా ఎలక్షన్స్ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఇక ఆ తర్వాత తను భారీ మెజార్టీతో గెలవడం తన పార్టీ మెంబర్స్ ను గెలిపించుకోవడం అలాగే ఏపీ డిప్యూటీ సీఎం గా మారడంతో ప్రజల యోగక్షేమాలు చూడడానికి తనకు మరొక సిక్స్ మంత్స్ కావాలని షూట్స్ కి దూరంగా ఉన్నారు. ఇన్ని రోజుల పాటు సుజిత్ చాలా ఓపిగ్గా వెయిట్ చేశాడు.
మొత్తానికైతే ఎలక్షన్స్ అయిపోయి వన్ ఇయర్ అయిన తర్వాత ఇప్పుడు ఈ సినిమాకి డేట్స్ ని ఇవ్వడం దాంతో సుజిత్ ఈ సినిమాని పూర్తి చేయడానికి భారీ కసరత్తులను చేసుకుంటూ బరిలోకి దిగుతూ ఉండడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం అనే చెప్పాలి. మరి ఈ సినిమాతో విజయాన్ని సాధిస్తాడా? తద్వారా పవన్ కళ్యాణ్ కి ఇప్పటి వరకు ఇండస్ట్రీలో లేనటువంటి ఒక గొప్ప గౌరవాన్ని తీసుకు వచ్చే సినిమా అవుతుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే.
Also Read : ఓజీ లో పవన్ కళ్యాణ్ కి సిక్స్ ప్యాక్..? చొక్కా లేకుండా అంత పెద్ద ఫైట్ ఉందా!