OG : కొంతమంది హీరోలకు కొన్ని సినిమాలు ల్యాండ్ మార్క్ గా నిల్చిపోతూ ఉంటాయి. అలాంటి ల్యాండ్ మార్క్స్ పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) కెరీర్ లో చాలానే ఉన్నాయి. ఇప్పుడు ఆ జాబితాలోకి ‘ఓజీ'(They Call Him OG) చిత్రం కూడా వెళ్తుందని పవన్ అభిమానులు బలంగా నమ్ముతున్నారు. సుజిత్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం కేవలం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రమే కాదు, ఇతర హీరోల అభిమానులు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇలా పవన్ కళ్యాణ్ కోసం అభిమానులు కాకుండా ఇతరులు ఇంతలా ఎదురు చూడడం జరిగి పదేళ్లు దాటిపోయింది. ఎందుకంటే రీ ఎంట్రీ తర్వాత ఆయన చేసిన సినెమళ్ళన్ని రీ మేక్ సినిమాలే. 2020 కి ముందు ఆయన సర్దార్ గబ్బర్ సింగ్, కాటమరాయుడు, అజ్ఞాతవాసి లాంటి కళా ఖండాలను తీసాడు. అందుకే మామూలు ఆడియన్స్ పవన్ కళ్యాణ్ సినిమాల కోసం ఎదురు చూడడం ఆపేసారు.
Also Read : ఓజీ’ నుండి సెన్సేషనల్ అప్డేట్..వచ్చే వారం నుండి ఫ్యాన్స్ కి పండగే!
కానీ ఇప్పుడు ఆయన 8 ఏళ్ళ తర్వాత నేటి తరం ఆడియన్స్ అభిరుచికి తగ్గ జానర్ సినిమాని ఎంచుకోవడంతో అభిమానులతో పాటు, మామూలు ఆడియన్స్ ఈ సినిమా కోసం పిచ్చిగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా 2023 వ సంవత్సరం లో విడుదల చేసిన గ్లింప్స్ వీడియో కి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. ఎలాంటి రెస్పాన్స్ అంటే టాలీవుడ్ హిస్టరీ లో ఈ గ్లింప్స్ ని కొట్టే మరో గ్లింప్స్ రావడం అసాధ్యం అనే రేంజ్ రెస్పాన్స్ వచ్చింది. సుమారుగా 70 శాతం కి పైగా షూటింగ్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. మిగిలిన భాగం పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయ్యాక ఫుల్ బిజీ అవ్వడం తో పెండింగ్ లో పడుతూ వచ్చింది. ఇప్పుడు ఆ పెండింగ్ వర్క్ ని కూడా పూర్తి చేసే పనిలో పడ్డారు మేకర్స్. రీసెంట్ గానే పవన్ కళ్యాణ్ ఈ సినిమాకు డేట్స్ ని కేటాయించాడు.
ఈ నెల 14 నుండి ఆయన తాడేపల్లి లో వేసిన స్పెషల్ సెట్స్ లోకి అడుగుపెట్టబోతున్నాడు. ఈ నెలలో కొన్ని రోజులు, అదే విధంగా జూన్ నెలలో మరికొన్ని రోజులు షూటింగ్ చేసి ఈ చిత్రాన్ని పూర్తి చెయ్యాలి అనే ఆలోచనలో ఉన్నాడు పవన్ కళ్యాణ్. అయితే ఈ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయం బయటపడింది. అదేమిటంటే ఫస్ట్ హాఫ్ లో పవన్ కళ్యాణ్ ఒక్క సన్నివేశం లో చొక్కా లేకుండా కనిపిస్తాడట. ఆ సన్నివేశం మొత్తం ఫైట్ ఉంటుందని తెలుస్తుంది. ఎన్నికల ప్రచారానికి వెళ్లే ముందు పవన్ కళ్యాణ్ ఒక కీలక షెడ్యూల్ చేసాడు. ఈ షెడ్యూల్ లోనే ఆ సన్నివేశాలను చిత్రీకరించారట. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ చాలా సన్నగా, మంచి ఫిట్ గా ఉన్నాడని, కుంభమేళా లో ఉన్నట్టు ఉండదని, ఈ సన్నివేశం వచ్చినప్పుడు ఆడియన్స్ మెంటలెక్కిపోతారంటూ చెప్తున్నారు. సెప్టెంబర్ 5 న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో విడుదల కానుంది.
Also Read : ‘ఓజీ’ ఈ ఏడాది లో విడుదల అవ్వడం కష్టమేనా..? జూన్ లో ఏమి జరగబోతుంది?