OG Movie Netflix Views: 2025 వ సంవత్సరం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) నామ సంవత్సరం గా మారిపోయింది. ఆయన హీరో గా నటించిన ఓజీ(They Call Him OG) చిత్రం దసరా కానుకగా భారీ అంచనాల నడుమ విడుదలై, మొదటి ఆట నుండే ఫ్యాన్స్ నుండి మంచి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకొని, ప్రపంచవ్యాప్తంగా 314 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. అభిమానులు డైరెక్టర్ సుజిత్ కి సోషల్ మీడియా ద్వారా ప్రతీ రోజు ధన్యవాదాలు తెలుపుతూనే ఉన్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ని ఇంత అద్భుతంగా చూపించిన డైరెక్టర్ గత పదేళ్లలో ఎవ్వరూ లేరు. అందుకే ఫ్యాన్స్ ఈ చిత్రాన్ని మర్చిపోలేకపోతున్నారు. థియేటర్స్ నుండి తొలగించేటప్పుడు ఫేర్ వెల్ షోస్ ని ఏర్పాటు చేసుకున్న పవన్ ఫ్యాన్స్, నిన్న ఈ చిత్రం 50 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా స్పెషల్ షోస్ ని ఏర్పాటు చేసుకొని సంబరాలు చేసుకున్నారు.
థియేటర్స్ లో ఇంత మంచి రెస్పాన్స్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రం, ఓటీటీ ఆడియన్స్ ని కూడా అదే రేంజ్ లో అలరించింది. నెట్ ఫ్లిక్స్ లో గత నెల 23 వ తారీఖున విడుదలైన ఈ చిత్రానికి మొదటి వారం 32 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఇక ఆ తర్వాత రెండవ వారం లో 21 లక్షల వ్యూస్ సొంతం చేసుకున్న ఈ చిత్రానికి, రెండు వారాలకు కలిపి 53 లక్షల వ్యూస్ వచ్చాయి. ఇక మూడవ వారం లో 10 లక్షల వ్యూస్ ని ఈ చిత్రం సొంతం చేసుకున్నట్టు చెప్తున్నారు విశ్లేషకులు. ఓవరాల్ గా మూడు వారాలకు కలిపి 63 లక్షల వ్యూస్ ని ఈ చిత్రం సొంతం చేసుకుంది. అయితే కొత్త సినిమాల రాక వల్ల, ఈ చిత్రం టాప్ 1 నుండి టాప్ 6 కి పడిపోయింది.
ఇక నిన్న నెట్ ఫ్లిక్స్ లో ‘తెలుసు కదా’, ‘డ్యూడ్’ చిత్రాలతో పాటు, మరో రెండు ఇంగ్లీష్ సినిమాలు విడుదల అయ్యాయి. దీంతో ఓజీ చిత్రం ప్రస్తుతం 8 వ స్థానం లో ట్రెండ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చే వారం రవితేజ మాస్ జాతర చిత్రం కూడా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. అప్పుడు కూడా ఈ చిత్రం టాప్ 10 లో ట్రెండ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం చూస్తే ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో 8 వారాలు ట్రెండ్ అయ్యే అయ్యే ఛాన్స్ ఉంది. ఈ 8 వారాలకు గాను కచ్చితంగా ఈ చిత్రం కోటి వ్యూస్ ని అందుకుంటుందని అంటున్నారు విశ్లేషకులు. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.