Naveen Yadav: జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో గతంలో నవీన్ యాదవ్ పోటీ చేశాడు.. అయినప్పటికీ అతడికి విజయం దక్కలేదు.. అయితే ఈసారి మాత్రం నవీన్ యాదవ్ విపరీతంగా కష్టపడ్డాడు. ఒకరకంగా తన శక్తిని మొత్తం కూడ తీసుకొని ప్రయత్నించాడు. రకరకాల ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ.. తనమీద వ్యతిరేకంగా ప్రచారం జరుగుతున్నప్పటికీ ఏమాత్రం భయపడకుండా.. రేవంత్ రెడ్డి అండతో ముందుకు వెళ్లాడు. గతంలో ఎదురైన ఓటములకు సరైన సమాధానం చెబుతూ.. సాలిడ్ విక్టరీ సాధించాడు. వాస్తవానికి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడం మామూలు విషయం కాదు. ఇది కేవలం ఒక ఉపఎన్నిక మాత్రమే కాదు.. గులాబీ పార్టీకి కాంగ్రెస్ పార్టీ తిరుగులేని సమాధానం చెప్పింది. రేవంత్ రెడ్డి స్టామినా ఏమిటో నిరూపించింది. ఇకపై మంత్రులు రేవంత్ రెడ్డి ముందు కాలర్ ఎగిరేసే అవకాశం ఉండదు. ముఖ్యంగా కొంతమంది మంత్రులు తల బిరుసుతనాన్ని ప్రదర్శించడానికి అవకాశం ఉండదు.
నవీన్ యాదవ్ కు జూబ్లీహిల్స్ గెలుపు తిరుగులేని బూస్ట్ ఇచ్చింది. ఆయన రాజకీయ జీవితానికి ఒకరకంగా మైలు రాయి లాగా నిలిచింది. తన తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్ అందుకోలేని రాజకీయ ఘనతను అందించింది.. మాగంటి సునీత ఏదో ఆరోపిస్తోంది గాని.. నవీన్ యాదవ్ సాధించిన గెలుపు మామూలుది కాదు. ఆయన ఏ స్థాయిలో విజయం సాధించాడో.. ఏ స్థాయిలో జూబ్లీ హిల్స్ ఓటర్ల ప్రేమను పొందాడో సాధించిన ఓట్ల శాతం చెబుతోంది.
జూబ్లీహిల్స్ నియోజకవర్గ చరిత్రలో హైయెస్ట్ ఓట్ల తేడాతో నవీన్ యాదవ్ గెలవడం ఒక రకంగా సంచలనం. ఈ నియోజకవర్గంలో ఇప్పటివరకు హైయెస్ట్ మెజారిటీ విష్ణువర్ధన్ రెడ్డి పేరు మీద ఉండేది. 2009లో జరిగిన ఎన్నికల్లో విష్ణువర్ధన్ రెడ్డి 21,741 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.. ఆయన రికార్డును చివరికి మాగంటి గోపీనాథ్ కూడా బద్దలు కొట్టలేకపోయారు. ఈ నియోజవర్గంలో హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గోపీనాథ్ రికార్డు సృష్టించారు.. 2014లో మాగంటి గోపీనాథ్ టిడిపి తరఫున పోటీ చేసి విజయం సాధించారు. నాటి ఎన్నికల్లో ఆయన 9,242 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 2018 ఎన్నికల్లో 16,004 ఓట్ల తేడాతో విజయం సాధించారు..గత ఎన్నికల్లో 16,338 ఓట్ల తేడాతో గెలుపును దక్కించుకున్నారు. ఇలా మూడుసార్లు తన మెజారిటీని పెంచుకుంటూ పోయారు.
ఈ నియోజకవర్గంలో పోటీ చేసిన నవీన్ యాదవ్ ఓటములు ఎదుర్కొన్న నేపథ్యంలో.. ఆ బాధను మరిపించే విధంగా 2025 లో జరిగిన ఉప ఎన్నికల్లో జూబ్లీహిల్స్ ఓటర్లు నవీన్ యాదవ్ కు బంపర్ మెజారిటీ అందించారు. నవీన్ యాదవ్ తన సమీప ప్రత్యర్థి, భారత రాష్ట్ర సమితి అభ్యర్థి సునీత మీద ఏకంగా 24,729 ఓట్ల మెజారిటీ సాధించారు. నవీన్ యాదవ్ 98,988 ఓట్లు సాధించారు. 50.83 ఓట్ల శాతాన్ని సాధించారు. సునీత 74,259 ఓట్లు సాధించారు. 38.13 ఓట్ల శాతాన్ని సాధించారు. బిజెపి అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి 17,061 ఓట్లు సాధించారు. 8.76 ఓట్ల శాతాన్ని సాధించారు.
#JubileeHillsByElection – #Hyderabad
After Round 7:
INC Naveen Yadav leading by 19,779 votes in #JubileeHills#Congress (#NaveenYadav) – 70,298#BRS (#MagantiSunitha) – 50,519#BJP (#DeepakReddy) – 11,903#JubileeHillsCounting pic.twitter.com/eNeCXos27P— Surya Reddy (@jsuryareddy) November 14, 2025